
Diamond Ring gift effect : భారత ప్రధాని మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా అమెరికా-భారత్ మధ్య అనేక వ్యూహాత్మక ఒప్పందాలు జరిగాయి. ఇదే సమయంలో భారత ప్రధాని మోదీకి అమెరికా సర్కారు రాచమర్యాదలు చేయగా మీడియా ఆకాశానికెత్తేసింది. ఈక్రమంలోనే అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్.. ఆయన సతీమణి భారత ప్రధాని మోదీ పలు కానుకలు అందజేశారు. బోడైన్ భార్యకు 7.5 క్యారెట్ల డైమండ్ రింగును మోదీ బహుకరించడం విశేషం.
మోదీ గిప్టుకు ముగ్దురాలైన బైడెన్ సతీమణి ప్రధాని మోదీకి విశేషమైన గౌరవం ఇచ్చారు. ఈమేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ కంటే కూడా ఆయన సతీమణి మోదీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కన్పించింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు డైమాండ్ రింగ్ ఎఫెక్ట్ అంటుంటే మరికొందరు మోదీనా మజాకా అంటూ కామెంట్ చేస్తున్నారు.