Viral News : ఒక్కొక్కరిది ఒక్కో చరిత్ర..ఒక్కో వ్యధ.. పేదవాడికి కడుపునిండాలనే బాధ..సంపన్నుడికి ఇంకా సంపాదించాలనే కోరిక..రాజకీయనాయకుడికి అధికారం రావాలనే ఆకాంక్ష.. ఆడవాళ్లకు మాతృప్రేమను అనుభవించాలనే ఆవేదన.. ఇలా ఒక్కొక్కరి వ్యవహరం ఒక్కోలా ఉంటుంది. కానీ కొందరు మహిళలు చేసే వింత ప్రవర్తన ఆశ్చర్యమనిపిస్తుంది. ఇక దుబాయ్ లో ఉండే ఈ అమ్మడి వింత కోరిక చూస్తే ఘటికురాలే అనిపించక తప్పదు.
దుబాయ్ లో ఉండే ఓ మిలియన్ భార్య బిడ్డను కనేందుకు తన భర్తకు వింత షరతును పెట్టింది. తనకు నెలకు రూ.2.5 కోట్లు చెల్లిస్తేనే బిడ్డను కంటానని కరాఖండిగా చెప్పేసింది. ఉచితంగా తాను పురిటి నొప్పులు భరించాలని అనుకోవడం లేదని నిర్మోహమాటంగా చెప్పింది. తాను గర్భం దాల్చకముందే తనకు, తన భర్తకు దీనికి సంబంధించిన ఒప్పందం కుదిరిందని ఆమె చెప్పుకొచ్చింది. పుట్టబోయే పిల్లల జెండర్ కు అనుగుణంగా పలు రంగులతో కూడిన డైమండ్ రింగ్, డిజైనర్ హ్యాండ్ బ్యాగ్ వంటి విలాస వస్తువులను ఆమె డిమాండ్ చేసింది.
బిడ్డను మొదటి కొన్ని రోజుల్లో దాదాపు వెయ్యి లేదా రెండు వేల మంది తమ వద్దకు వస్తారని, అందుకు వీఐపీ గదిని బుక్ చేయాలని కూడా షరతు విధించింది. అలాగే కొత్తకారును బహుమతిగా ఇవ్వాలని కోరిందట. అలాగే తన నిద్రకు భంగం కలుగకుండా ఇంట్లో సిబ్బందిని, నైట్ నర్సును రెట్టింపు చేయాలని సూచించింది.
అయితే ఈమె వింత కోరికలు ఇలా ఉండగా.. ఈ దుబాయ్ ధనవంతుడు భరించగలడు కానీ మనబోటి వాళ్లకు ఇది సాధ్యమయ్యే పనేనా. అందమైన భార్య ఆనందం కోసం ఈ సంపన్నులు ఏమైనా చేస్తారు లెండి. మొన్నటికి మొన్న మన ముఖేశ్ అంబానీ తన చిన్న కొడుకు ప్రీవెడ్డింగ్ వేడుకల కోసం తన భార్య నీతూ అంబానీ కోసం రూ.500కోట్ల ఆభరణం చేయించిన విషయం వైరల్ గా మారింది. దీన్నే అంటారు ‘ఉండి ఒకడు ఏడిస్తే..లేక ఇంకొకడు ఏడ్చాడట.’’