
Talakaya curry should be cooked like this : తలకాయ కూరంటే అందరికి ఇష్టమే. అది వండ విధానం బట్టి ఉంటుంది. మాంసాహార ప్రియులకు తలకాయ కూరంటే భలే పసందు. విందులో తలకాయ కూర ఉంటే ఆ మజాయే వేరు. దీంతో తలకాయ కూర తింటే ఎముకలకు బలం చేకూరుతుంది. తలకాయ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుంటే మంచిగా వండుకోవచ్చు. ఎలా వండుకుంటే బాగుంటుందో ఓసారి తెలుసుకుందాం.
తలకాయ కూర కోసం కావాల్సిన పదార్థాలు తలకాయ మాంసం, రెండు కప్పుల ఉల్లిపాయ ముక్కలు, రెండు కప్పుల టమాటాల ముక్కలు, రెండు ఇంచుల దాల్చిన చెక్క, పది లవంగాలు, ఐదు యాలకులు, టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు, మూడు టీ స్పూన్ల కారం, తగినంత పచ్చిమిర్చి, రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక టీ స్పూన్ మిరియాలు, అర కప్పు కొత్తిమీర ఐదు టేబుల్ స్పూన్ల నూనె, నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు, పావు కప్పు ఎండుకొబ్బరి తురుము, రెండు బిర్యాణీ ఆకులు.
ధనియాలు, మిరియాలు, కొబ్బరి తురుము మూడు మెత్తగా చేసుకోవాలి. తలకాయ కూరను శుభ్రంగా కడుక్కోవాలి. ఇందులో సగం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కారం, లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు, సగం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి. తరువాత రెండు గ్లాసుల నీల్లు పోసి మూత పెట్టాలి. సన్నని మంటపై ఇరవై నిమిషాలు ఉడికించాలి.
తరువాత మూత తీసి ఉడికిందో లేదో చూసుకోవాలి. మెత్తగా ఉతికిన తరువాత కడాయిలో నూనె వేసి వేడయ్యాక మిగిలిన ఉల్లిపాయ ముక్కలు, బిర్యాణీ ఆకు వేసి వేయించుకోవాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఉడికించిన తలకాయ కూర వేసి కలపాలి. మిక్సీ పట్టుకున్న పొడి కలపాలి. రుచికి సరిపడ నీళ్లు పోసుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉడికించాలి. చివరగా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉడికిస్తే మంచి రుచిగల తలకాయ కూర తయారవుతుంది.