Most Consumed Meat : ప్రపంచంలో మాంసాహారుల సంఖ్య పెరుగుతోంది. మాంసం మాంసాన్ని పెంచుతుంది కానీ మంచిని కాదని తెలిసినా అత్యధికులు మాంసాన్ని ఇష్టంగా తింటున్నారు. దీంతో ఎన్నో అనర్థాలు వస్తున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటుంది. కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. అత్యధిక మంది తినే ఆహారాల్లో చికెన్ రెండో స్థానంలో నిలిచింది. చాలా మంది కోడి మాంసాన్ని తెగ తింటున్నారట.
ప్రపంచంలో గొడ్డు మాంసం తినే వారి సంఖ్య మూడోస్థానంలో ఉన్నారు. ఇతర మాంసాల కంటే దీని ధర ఎక్కువ అయినా ఎక్కువ మంది దీన్ని తినడానికే ఇష్టపడుతున్నారు. మటన్ నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ వ్యాప్తంగా మేకలు ఎక్కువగా ఉన్నా ప్రజాదరణ మాత్రం పొందలేదు. దీంతో మటన్ నాలుగో స్థానానికి పడిపోవడం గమనార్హం.
టర్కీ మాంసం ఐదో స్థానంలో ఉంది. ఉత్తర అమెరికా, మెక్సికోలో దీనికి ప్రాధాన్యం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇది కూడా ప్రాచుర్యం పొందింది. ఇక బాతు మాంసం ఆరోస్థానంలో నిలిచింది. ఇది చైనా, అమెరికాలో ప్రసిద్ధి చెందింది. గేదె మాంసం ఏడో స్థానం దక్కించుకుంది. ఆసియా దేశాల్లో దీనికి విలువ ఎక్కువ. కుందేలు మాంసం ఎనిమిదో స్థానంలో ఉంది. చైనా, ఉత్తర కొరియాలో బాగా తింటారు.
జింక మాంసం తొమ్మిదో స్థానంలో నిలిచింది. జపాన్ లో ఎక్కువగా తింటారు. ప్రపంచంలో అత్యధికంగా వినియోగించే మాంసాల్లో పంది మాసం మొదటి నిలవడం గమనార్హం. ఇలా మాంసం తినే వారి అభిరుచుల్లో వాటి స్థానాలేంటే తెలుసుకున్నాం. ఎవరి టేస్ట్ కు అనుగుణంగా వారు మాంసాహారాలు తింటుండటం వల్ల వాటి స్థానాలు గుర్తించారు.