34.1 C
India
Saturday, May 18, 2024
More

    Lucknow Vs Kolkata : లక్నో.. కోల్ కతా మధ్య హై హోల్టేజ్ మ్యాచ్ 

    Date:

    Lucknow Vs Kolkata
    Lucknow Vs Kolkata

    Lucknow Vs Kolkata : లక్నో సూపర్ గెయింట్స్, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం లక్నో లోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకనా గ్రౌండ్ లో జరగనుంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చాలా ఇంపార్టెంట్. ఇప్పటికే పాయింట్ల టేబుల్స్ లో రెండో స్థానంలో కోల్ కతా ఉండగా.. మూడో ప్లేస్ లో లక్నో కొనసాగుతుంది. ఈ మ్యాచ్ కోల్ కతా గెలిస్తే 8 విజయాలు 16 పాయింట్లతో ప్లే ఆప్ కు చేరువయ్యే అవకాశం ఉంది. లక్నో కూడా 7 విజయాలు 14 పాయింట్లతో ప్లే ఆప్ రేసులో నిలుస్తుంది.

    కోల్ కతా ప్లేయర్లలో పిల్ సాల్ట్, సునీల్ నరైన్ ఓపెనింగ్ భాగస్వామ్యంతో అదరగొడుతున్నారు. బ్యాటింగ్ లో గత మ్యాచ్ లో కోల్ కతా బ్యాటర్లు తడబడినా వెంకటేశ్ అయ్యర్, మనీశ్ పాండే ఇద్దరు సమయోచిత ఇన్సింగ్స్ ఆడారు. ముంబయిలోని కఠిన పిచ్ పై వీరోచితంగా పోరాడి కీలక మ్యాచ్ లో గెలిపించారు. 25 కోట్ల ఆటగాడు మిచెల్ స్టార్క్ కూడా 4 వికెట్లతో ఫామ్ లోకి రావడం కలిసొచ్చే అంశం.

    లక్నో సూపర్ గెయింట్స్ లో మార్కస్ స్టోనియిస్ ఫామ్ అందుకున్నాడు. నికోలస్ పూరన్, డికాక్, కేఎల్ రాహుల్ కూడా బ్యాటింగ్ లో దంచి కొడుతున్నారు. బౌలింగ్ విభాగం కాస్త డల్ గా కనిపిస్తోంది. రవి బిష్ణోయ్ పెద్దగా రాణించడం లేదు. మోసిన్ ఖాన్, మయాంక్ యాదవ్ లు వేగంగా బంతులు వేస్తున్న పరుగులు ఎక్కువగా ఇస్తున్నారు. లక్నో, కోల్ కతా ఇప్పటి వరకు నాలుగు సార్లు తలపడగా.. లక్నో మూడుసార్లు గెలిచి పై చేయి సాధించింది.

    ఈ మ్యాచ్ లో లక్నో స్టార్ బౌలర్ మయాంక్ యాదవ్ మళ్లీ ఆడకపోవచ్చు. గాయం తిరగబెట్టడంతో ఈ సీజన్ కు మొత్తం దూరమయ్యేలా కనిపిస్తున్నాడు. కోల్ కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, వైభవ్ అరోరా బాగానే బౌలింగ్ చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం ఎవరిది పై చేయి అవుతుందో వారే ప్లే ఆప్ కు చేరువవుతారు.

    Share post:

    More like this
    Related

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో వేళల్లో మార్పులేదు

    Hyderabad Metro Timings : హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో...

    Ayodhya Temple : అయోధ్య రామాలయం గేట్లు తెరిపించిందే కాంగ్రెస్ ప్రభుత్వం

    - నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి Ayodhya Temple : పీఎం...

    Deve Gowda : మనవడు ప్రజ్వల్ కేసుపై స్పందించిన మాజీ ప్రధాని దేవెగౌడ

    Deve Gowda : హసన ఎంపీ, మాజీ ప్రధాన మంత్రి హెచ్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hardik Pandya : హార్దిక్ పాండ్యాపై మ్యాచ్ నిషేధం.. ఎందుకో తెలుసా?

    Hardik Pandya : ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా IPL...

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై నిషేధం

    Hardik Pandya : హర్దిక్ పాండ్యాపై ఐపీఎల్ ఫ్రాంచైజీ నిషేధం విధించింది. ఇప్పటికే...

    MI Vs LSG : చివరి మ్యాచ్ లో ముంబయి ఢీలా.. లక్నో గెలుపుతో ఇంటి బాట

    MI Vs LSG : ముంబయి ఇండియన్స్ తో వాంఖడే లో...

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్...