Home EXCLUSIVE Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన...

Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

31
Chanakya Niti
Chanakya Niti

Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని రాజును గద్దెదించి చంద్రగుప్త మౌర్యుడిని రాజుగా చేశాడు. చాణక్య నీతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ఆయన పండితుడు కాబట్టి ప్రతీ అంశంలో మంచి మంచి వివరాలు వెళ్లడించాడు. ఆయన చెప్పిన విషయాలు పాటించిన వారు ఎప్పుడూ విఫలం కాలేదు. నేటికీ, ఆచార్య చాణక్యుడి విధానాలు ప్రభావం చూపుతాయి.

పెళ్లయిన పురుషుల గురించి ఆసక్తి కర విషయాలు చాణక్య నీతిలో వివరించారు. పెళ్లయిన కొద్ది సేపటికే పురుషులు ఇతర స్త్రీలతో శారీరక సంబంధం పెట్టుకోవాలని కోరుకుంటారు. దీని వెనుక కారణం ఆలోచించారా? చాణక్య నీతిలో, ఆచార్య చాణక్యుడు కూడా భార్యా, భర్తల సంబంధానికి సంబంధించి సిద్ధాంతాన్ని వివరించాడు.

పురుషులు మహిళల చేత ఆకర్షితులవుతారని అందరికీ తెలిసిందే. ఆకర్షణ హద్దులు దాటినప్పుడు అక్రమ సంబంధాలకు దారి తీస్తాయి. ఇదే జరిగితే వైవాహిక జీవితం నాశనం అవుతుంది. అక్రమ సంబంధం తప్పుగా పరిగణించబడుతుంది.

చిన్న వయసులో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. చిన్న వయసులో కెరీర్ పై ఎక్కువ ఫోకస్ పెట్టే సమయంలో వివాహం చేసుకుంటే సరైన అవగాహన ఉండదు. స్థిరమైన జీవితం సెటిల్ మెంట్ జరిగిన తర్వాత వివాహం చేసుకుంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా భాగస్వామితో కోరికలు తీర్చుకోవచ్చు.

భార్యాభర్తల బంధంలో శారీరక తృప్తి ముఖ్యం. అది లేకపోవడం వల్ల ఇద్దరి మధ్య ఆకర్షణ తగ్గుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో వివాహేతర సంబంధాల వైపు అడుగులు పడతాయి. కొంత మంది భార్య ఉండగానే వివాహేతర సంబంధం పెట్టుకునేందుకు ఇష్టపడతారు. ఇటువంటి పరిస్థితిలో, భార్యాభర్తల సంబంధంలో నమ్మకం  ముఖ్య పాత్ర పోషిస్తుంది.

దంపతులు తల్లిదండ్రులు అయ్యే వరకు వారి మధ్య ప్రేమ ఉంటుంది. బిడ్డ పుట్టిన తర్వాత పురుషులు వారి భార్యల నుంచి దూరం అవడం ఎక్కువగా జరుగుతుంది. దీని వెనుక కారణం ఉంది. భార్య తన బిడ్డకంటే భర్తకు తక్కువ ప్రాధాన్యత ఇస్తుంది.

(గమనిక : ఇది ప్రజల విశ్వాసాలు, సోషల్ మీడియా సమాచారం మాత్రమే.)