Married men వివాహం తర్వాత ప్రతీ ఒక్కరి జీవితంలో చాలా మార్పులు వస్తాయి. ఇటు అబ్బాయి, అటు అమ్మాయి ఇద్దరి జీవితాలు పూర్తిగా మారిపోతాయి. వారి ఇష్టాల నుంచి లైఫ్ స్టయిల్ వరకు మారుతుంది. ఇద్దరూ ఒకరినొకరు గౌరవించుకోవాలి. వారి అలవాట్లను మార్చుకోవాలి. కానీ, తెలియక కొందరు చేసే కొన్ని పొరపాట్లు భాగస్వామిని ఇబ్బంది పెడతాయి. భర్త పరాయి ఆడవారిని ఇష్టపడడం అందులో ఒకటి. ఎందుకు అలా చేస్తారో ఫస్ట్ తెలుసుకోండి.
సమాజంలో ఆడవారికి మగవారికి మధ్య చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇది కామన్. మగవారు పెళ్లికి ముందు చాలా స్వేచ్ఛగా ఉంటారు. కానీ ఆడవారు అలా ఉండరు. ఇక వారిపై ఎలాంటి ఆంక్షలు కూడా ఉండవు. అమ్మాయిలకైతే చాలా ఆంక్షలు ఉంటాయి. కానీ ఒక్క సారి పెళ్లి అయితే మగవారు వారి స్వచ్ఛ ఎవరో అపహరించారన్న ఫీలింగ్ లోకి వెళ్తారు. దీనికి కారణం ప్రధానంగా భాగస్వామే అనుకుంటారు. అందుకే, భార్యలను కాకుండా ఇతర మహిళలను ఇష్టపడతారు.
మగవారి మనస్సు కుదురుగా ఉండదు. వారికి ఏదైనా ఇన్ కంప్లీట్ గా అనిపిస్తే కంప్లీట్ చేసుకునేందుకు పరుగులు తీస్తారు. వివాహ బంధంలో వారికి ఇన్ కంప్లీట్ అనిపిస్తే మరో స్త్రీలో ఆ ఆనందం వెతుక్కునేందుకు పరుగులు పెడుతుంటారు. ప్రతి మనిషి తన మనసుకి అనుగుణంగా ఉండాలనుకుంటాడు. భార్యలు ప్రతి విషయంలో జోక్యం చేసుకుంటే గొడవలు మొదలవుతాయి. దీంతో చిన్న చిన్నవే పెద్ద యుద్ధానికి దారి తీస్తాయి. అలాంటి సమయంలోనే ఇతర మహిళలకు అట్రాక్ట్ అవుతారు.
గమనిక: ఈ కథనం కొందరు వ్యక్తులు పంచుకున్న అనుభవాలు మాత్రమే.. పాఠకులు ఈ విషయాన్ని గమనించగలరు.