37 C
India
Friday, May 17, 2024
More

    Women for Hinduism : హిందూత్వం కోసం నాటి మహిళల త్యాగం మరువలేనిది..

    Date:

    తమిళ మాసం వైకాసి సందర్భంగా శ్రీరంగంపై ఢిల్లీ జీహాడీ దురాక్రమణదారులు దాడి చేశారు. శ్రీరంగం ద్వీపంలో దాదాపు 12,000 మంది హిందువులు ఆలయ రక్షణ కోసం పోరాడుతూ తమ ప్రాణాలను అర్పిం చారు. జీహాడీ మూకలు ఆలయంపై దాడి చేసి రంగనాథ స్వామి ఆభరణాలు, ఆలయ బంగారం ఎత్తుకె ళ్లా రు. బలగాలు విష్ణుమూర్తిని కూడా స్వాధీనం చేసుకోవాలనుకున్నాయి.. ఆ పిశాచ మూక పెరుమాళ్ విగ్రహం కోసం వెతికారు కానీ వైష్ణవ ఆచార్య, పిళ్ళైలోకాచార్య పెరుమాళ్ ను తీసుకొని ఆ జీహాడీ మూకాలను తప్పించుకొని మదురైకి చేరుకున్నారు..

    (1323లో శ్రీరంగం నుండి బయలుదేరిన నంపెరుమాళ్ అని పిలువబడే విష్ణుమూర్తి 1371లో మాత్రమే తిరిగి వచ్చారు). విగ్రహం జాడ తెలియని సుల్తానేట్ జీహాడీ దళాలు ఆలయ అధికారులను చంపి, పిళ్లైలోకాచార్య మరియు నంపెరుమాళ్ కోసం భారీ వేట ప్రారంభించాయి..బలగాలు ఆచార్యుడిని మరియు ప్రతిమను బంధిస్తాయనే భయంతో, ఆలయ నర్తకి (దేవదాసి) వెల్లాయి దళాల కమాండర్ ముందు ఒక నృత్యాన్ని ప్రదర్శించింది..

    తద్వారా పిళ్ళైలోకాచార్య చిత్రంతో తప్పించుకోవడానికి సమయం చిక్కింది..ఆమె నృత్యం గంటల తరబ డి సాగి చివరకు సేనాపతిని తూర్పు గోపురం వద్దకు తీసుకెళ్లి నిలువెల్లా మొహంతో నిండిపోయిన ఆ జీహాడీ పిశాచాన్ని కిందకు తోసి అతన్ని చంపిన తరువాత ఆ అపర మోహినీ అవతారమైన వెల్లాయి రంగనాథర్ నామాన్ని జపిస్తూ తూర్పు ముఖద్వారం యొక్క గోపురం పైనుంచి నుండి దూకి చనిపోయింది.

    ఇక్కడ జీహాడీ సేనల దాడులను గురించి తెలుసుకున్న విజయనగర సైన్యాధిపతి కెంపన్న ఆఘమేఘాల మీద శ్రీరంగం చేరుకొని జీహాడీ మూకాలను ఊచకోత కోసి శ్రీరంగాన్ని రక్షించాడు..వెల్లాయి చేసిన త్యాగా నికి అచ్చెరువొందిన కెంపన్న ఆమె పేరు మీద ఆవిడ ఏ గోపురంనుంచైతే ఆత్మార్పణం చేసిందో ఆ గోపు రానికి వెల్లాయి గోపురం అని పేరు పెట్టాడు.. ఆమె జ్ఞాపకార్థం ఇప్పటికీ గోపురం తెల్లగా సున్నం వేస్తా రు..ఇప్పుడు దీనిని వెల్లై గోపురం అని పిలుస్తారు.. హిందూత్వం కోసం నాటి మహిళలు సైతం ప్రాణాలకు తెగించి పోరాడిన ఫలితమే నేడు మన హిందువులు అనుభవిస్తున్న ఈ మత స్వేచ్ఛ..
    మతం మారి అటువంటి త్యాగధనుల త్యాగాలను అవహేళన చేయకండి..
    జైరంగనాధ..

    Share post:

    More like this
    Related

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు...

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి...

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని...

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hinduism : హిందూత్వ స్పృహ

    Hinduism : "విశ్వ హిందూత్వం లేదా విశ్వ వ్యాప్తంగా భారతీయత పునర్భవం ఔతోంది......

    ఫ్రీ బస్సు ఎపెక్ట్ బస్సు చార్జీల పెంపు

    మహిళలకు ప్రీ బస్ ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో ఛార్జీలు పెంచబోమని డిప్యూటి...

    Telangana, తెలంగాణ మహిళలకు బస్సు ఉచితం

    మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో హైదరాబాద్ లో కొత్త బస్సుల...

    Scheme For Women : మహిళలు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 3 లక్షల వరకు రుణం పొందొచ్చు

    Scheme For Women : ప్రస్తుతం పురుషులతో పాటు మహిళలు కూడా ఏదో...