28.5 C
India
Friday, May 3, 2024
More

    Chanakya Niti : చాణక్య నీతి: ఎలాంటి చోట ఇల్లు కట్టుకోవాలో తెలుసా?

    Date:

    Chanakya Niti
    Chanakya Niti Build House

    Chanakya Niti : ఇల్లే కదా స్వర్గసీమ అంటారు. మనం ఇంట్లోనే ఎక్కువగా గడుపుతాం. అందుకే ఇల్లు సురక్షితమైన ప్రాంతంలో నిర్మించుకునేందుకు అందరు ఇష్టపడుతుంటారు. ఇల్లు ఎప్పుడు కూడా జనావాసాల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఏ అడవిలో ఎవరు కూడా ఇల్లు కట్టుకోరు. జీవితంలో మంచి ఇల్లు కట్టుకుని ఇంటి ముందు కారు పెట్టుకుని సంతోషంగా జీవితం గడపాలని ప్రతి ఒక్కరి ఆలోచన.

    ఆచార్య చాణక్యుడు మనం కట్టుకుని ఇల్లు ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి? అనే విషయాలపై స్పష్టత ఇచ్చాడు. జీవితంలో విజయాలు దక్కాలంటే మనం కట్టుకునే ఇల్లు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చాణక్యుడి విశ్వాసం. మనం ఇల్లు కట్టుకునే చోట మనకు గౌరవం లేకపోతే మానుకోవాలి. ఎందుకంటే మన చుట్టు ఉన్న వారు మనల్ని గౌరవంగా చూడకపోతే బాగుండదు.

    మనకు ఉద్యోగావకాశాలు ఉన్న చోట ఇల్లు కట్టుకోవాలి. మన ఇంటికి ఉద్యోగం చేసే చోటుకు దూరం ఎక్కువగా ఉంటే ఇబ్బందులు ఎదుర్కొంటాం. అందుకే మనం పని చేసే చోటుకు సమీపంలోనే ఇల్లు నిర్మించుకోవడం ఉత్తమం. మనకు ఇల్లు ఎంత సౌకర్యంగా ఉన్నా అందుబాటులో లేకపోతే కష్టాలు పడతాం. అందుకే మనం పనిచేసే చోట ఇల్లు కట్టుకోవడం ఉత్తమం.

    స్నేహితులు, బంధువులు అందుబాటులో ఉండే చోట కట్టుకోవడం మంచిది. ఏదైనా అవసరాలు పడితే తొందరగా తీర్చుకోవచ్చు. అదే దూరంగా ఉంటే అక్కడికి వెళ్లడం కొంచెం కష్టంగా మారుతుంది. మనం నివసించే చోట మంచి విద్యాసంస్థలు ఉండేలా చూసుకోవాలి. పిల్లల చదువులు కూడా ముఖ్యమే కదా. వారిని ఎక్కడో దూరంగా వేస్తే వారిని తీసుకురావడం ఓ సమస్యగా మారొచ్చు.

    జీవితంలో ఇల్లు చాలా ప్రభావవంతమైనది. మన విజయంలో ఇల్లు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. జీవితంలో ఎదగాలంటే ఇలాంటి సదుపాయాలు ఉన్న చోటనే ఇల్లు నిర్మించుకునేలా ప్రయత్నించాలి. చాణక్యుడు సూచించిన మార్గాల్లో ఇల్లు నిర్మించుకుని ముందుకు వెళ్లాలని సూచించాడు.

    Share post:

    More like this
    Related

    Sunrisers Hyderabad : ఉత్కంఠ పోరులో సన్ రైజర్స్ దే గెలుపు

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ మధ్య...

    Pagidipati family : పిల్లల ఆస్పత్రికి రూ.417 కోట్ల విరాళం ఇచ్చిన ప్రవాస తెలుగు పగిడిపాటి కుటుంబం

    Pagidipati family : అమెరికాలోని ఫ్లోరిడాలోని టంపా బేకు చెందిన తెలుగు ప్రవాసులు...

    Telangana Weather : నిప్పుల కొలిమి.. తెలంగాణ

    Telangana Weather : తెలంగాణ రాష్ట్రం మండుతున్న ఎండలతో నిప్పుల కొలిమిలా...

    Food Habits : ఈ ఐదుగురితో కలిసి భోజనం చేయవద్దు.. అలా తిన్నారో.. ఫలితం ఇలానే ఉంటుంది!

    Food Habits : శరీరాన్ని నిలబెట్టేందుకు ఆహారం తీసుకోవడం అత్యవసరం. ఇప్పుడు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Chanakya Niti : పెళ్లయిన మగవారు ఇతర స్త్రీల పట్ల ఎందుకు ఆకర్షితులవుతారు? చాణక్య చెప్పిన విషయాలు ఏంటి?

    Chanakya Niti : ఆచార్య చాణక్య గొప్ప పండితుడు. తనను అవమానించని...

    Plants : ఇంట్లో ఈ మొక్క పెంచుకుంటే హానికరమే?

    Plants : మనం అందమైన ఇల్లు కట్టుకోవాలని అనుకుంటాం. ఇంటి ముందు...

    చాణక్య నీతి : ఎక్కడ సిగ్గు పడకూడదో తెలుసా?

    చాణక్యుడు జీవితంలో ఎదురయ్యే ఇబ్బందులను ఎదుర్కొనే క్రమంలో జాగ్రత్తలు పాటించాలి. ఆనాడే...