BRO the avatar బ్రో ది అవతార్ సినిమా జులై 28న వస్తోంది. ఇప్పటికే టీజర్ విడుదలై బ్రహ్మాండమైన రెస్పాన్స్ అందుకోవడంతో సినిమా విజయంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. వకీల్ సాబ్, భీమ్లానాయక్ సినిమాకు థమన్ సంగీతమే ప్లస్ అయింది. దీంతో ఈ సినిమాకు కూడా సంగీతమే ప్రధానం అనుకున్నా పాటలు మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు. సినిమా అయినా విజయం సాధించాలని అందరు కోరుకుంటున్నారు.
సినిమాలో దేవుడు క్యారెక్టర్ పవన్ కల్యాణ్ ఫిక్స్ కావడంతో ఇంకో క్యారెక్టర్ ఎవరు చేయాలనే దానిపై చర్చ వచ్చినప్పుడు త్రివిక్రమ్ నితిన్ ను సూచించాడట. కానీ పవన్ మాత్రం తన మేనల్లుడు సాయిధరమ్ తేజకు ఓటు వేశాడట. దీంతో సాయిధరమ్ తేజ్ కే ప్రాధాన్యం ఇచ్చారట. కానీ నితిన్ అయితే బాగుండేదని అందరు అంటున్నారు. సహజంగానే నితిన్ కు పవన్ అంటే ప్రాణం ఉండటంతో వారి కాంబినేషన్ కు మంచి విలువ ఉండేదని చెబుతున్నారు.
సినిమాకు థమన్ సంగీతమే హైలెట్ అనుకున్నారు కానీ ఆశించిన మేర ఫలితం రాలేదు. పాటలు హోరెత్తిస్తాయని అనుకున్నా అదీ కుదరలేదు. ఇప్పుడు ఒక బ్యాడ్ డ్రాప్ సంగీతంపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో బ్రో హిట్ కావడానికి సంగీతం ఎంతగా దోహదం చేస్తుందో తెలియడం లేదు. ఈనేపథ్యంలో బ్రో గురించి ప్రేక్షకులు ఎంతో ఆతృతగా చూస్తున్నారు.
పవన్ కల్యాణ్, థమన్ కాంబినేషన్ కు మంచి డిమాండ్ ఉంది. అందుకే ఈ సినిమాపై అందరికి ఉత్సాహం కలుగుతోంది. టీజర్ కు మంచి స్పందన రావడంతో సినిమా కూడా సక్సెస్ అవుతుందని అంటున్నారు. దీంతో బ్రో సినిమా ఎంత మేరకు క్రేజీ సంపాదిస్తుందోననే ఆశలు అందరిలో పెరుగుతున్నాయి. పవన్ తన మేనల్లుడు కలిసి నటించడంతో ప్రేక్షకుల్లో సందడి నెలకొంది.