Home NRI న్యూజెర్సీలో చంద్రబోస్ కు సత్కారం

న్యూజెర్సీలో చంద్రబోస్ కు సత్కారం

47
new jersey felicitates oscar winner chandrabose
new jersey felicitates oscar winner chandrabose
new jersey felicitates oscar winner chandrabose
new jersey felicitates oscar winner chandrabose

ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు అనే పాట రాసి సంచలనం సృష్టించి ఆస్కార్ అవార్డు అందుకున్నాడు చంద్రబోస్. దాంతో చంద్రబోస్ పై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఆస్కార్ అవార్డు అందుకున్న చంద్రబోస్ ప్రస్తుతం అమెరికాలోనే ఉన్నాడు. దాంతో న్యూజెర్సీలో ఉన్న తెలుగువాళ్లు చంద్రబోస్ కు ఘన సత్కారం చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు.

మార్చి 18 న న్యూజెర్సీలోని తెలుగువాళ్లు చంద్రబోస్ ను భారీ ఎత్తున సన్మానించనున్నారు. అందుకు న్యూజెర్సీ లోని రాయల్ ఆల్బర్ట్ ప్యాలెస్ ఈ వేడుకకు సిద్ధం చేస్తున్నారు.  మార్చి 18 సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు పాల్గొననున్నారు.