Home EXCLUSIVE KTR : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై భయపడుతున్న కేటీఆర్

KTR : కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపుపై భయపడుతున్న కేటీఆర్

33
KTR is afraid
KTR is afraid
KTR is afraid
ktr

KTR is afraid of Congress victory in Karnataka : కర్ణాటక ఫలితాలపై తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ గెలుపొందడం తెలంగాణలో కాంగ్రెస్ కేడర్ ఫుల్ జోష్ లో ఉండడంతో ఆయన కొంత అసహనానికి గురైనట్లు తెలుస్తోంది. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపించడం లేదంటూ సర్వేలు వస్తున్న నేపథ్యంలో దానికి ప్రత్యాన్మాయంగా కాంగ్రెస్ ఉంటుందా అని ఆందోళనలో ఉన్నాడు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే బీఆర్ఎస్ చాలా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది.

కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచిన నేపథ్యలో తెలంగాణలోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, కేడర్ ఇక్కడ కూడా ప్రభుత్వంలోకి వచ్చేలా కృషి చేయాలని అనుకుంటున్నారు. బీజేపీతో అంత భయపడేంత పని లేకున్నా కాంగ్రెస్ తో బీఆర్ఎస్ భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో భారీ కేడర్ ఉంది. దీనికి తోడు తెలంగాణ ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ కావడంతో ఈ సారి అటువైపు మొగ్గు చూపే ప్రమాదం ఉందని అంచనాలు అందుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్ దీనిపై ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

ఆయన కర్ణాటకలో కాంగ్రెస్ విజయంపై స్పందించారు. కన్నడనాట కాంగ్రెస్ గెలుపొందడంపై ఆయన ట్విటర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ది కేరళ స్టోరీ’ కర్ణాటక ఎన్నికలపై ఎలాంటి ప్రభావం చూపించ లేదన్నారు. అదే విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ గెలుపు కూడా తెలంగాణపై ప్రభావం చూపించలేదన్నారు. నీచ, విభజన రాజకీయాలను తిరస్కరించిన కర్ణాటక ప్రజలకు నా కృతజ్ఞతలు. పెట్టుబడుల ఆకర్షణలో, మౌలిక వసతుల కల్పనలో హైదరాబాద్ బెంగళూర్ మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి అన్నాలని, అది కూడా దేశానికి మేలు చేసేలా ఉండాలి.. కర్ణాటకలో కొత్త ప్రభుత్వానికి నా శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు కేటీఆర్.