Home EXCLUSIVE Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

Anchor Vishnupriya : ఛాన్సుల కోసం పడుకుంటే తప్పేంటి.. యాంకర్ విష్ణుప్రియ హాట్ కామెంట్లు..!

53

Anchor Vishnupriya :

సినిమా ఇండస్ట్రీని ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనే భూతం వేధిస్తోంది. దాని బారిన పడి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కొందరు దాని బారిన పడి జీవితాను నాశనం చేసుకుంటున్నారు. కొందరు దాన్ని ఎదురించి కూడా ఛాన్సులు కోల్పోతున్నారు. ఇంకొందరు మాత్రం కమిట్ మెంట్లు ఇచ్చేసి ఎంచక్కా అవకాశాలు పడుతున్నారు. అయితే కొందరు మాత్రమే దానిపై మాట్లాడుతున్నారు.

తాజాగా యాంకర్ విష్ణుప్రియ  కూడా తన వాయిస్ వినిపించేసింది. ఆమె గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె యాంకర్ గా చాలా ఫేమస్. ఇప్పుడు బుల్లితెరపై కనిపించట్లేదు గానీ వెండితెరపై మాత్రం బాగానే అవకాశాలు పడుతోంది. ఏదో ఒక సినిమాలో లిప్ లాక్ సన్నివేశాలతో ఆమె రెచ్చిపోవడం కూడా మనం చూస్తున్నాం.

ఈ క్రమంలోనే ఆమె తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమెకు కాస్టింగ్ కౌచ్ గురించి ప్రశ్న ఎదురైంది. దానిపై ఆమె మాట్లాడుతూ.. అవకాశాల కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేస్తారు. అందులో కొందరు కాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కుంటారు. ఇక్కడ ఛాన్సుల కోసం ఎవరు ఏమైనా చేస్తారు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం.

కాబట్టి కాస్టింగ్ కౌచ్ కు ఒప్పుకున్నంత మాత్రాన తప్పుబట్టాల్సివన అవసరం లేదు. దేశంలో ఇంతకన్నా పెద్ద సమస్యలు చాలానే ఉన్నాయి. కాబట్టి వాటి గురించి ఆలోచిస్తే బాగుంటుంది. ఇలాంటి చిన్న విషయాలను పెద్దది చేయాల్సిన అవసరం లేదు అంటూ తన అభిప్రాయం వెల్లడించింది ఈ హాట్ యాంకర్. ఆమె స్పందన మీద భిన్నమైన కామెంట్లు వస్తున్నాయి.