Home EXCLUSIVE Donald Trump : యూఎస్ తొలి ఎన్నికల్లో బోణి కొట్టిన ట్రంప్.. నిక్కీ, వివేక్ అవుట్

Donald Trump : యూఎస్ తొలి ఎన్నికల్లో బోణి కొట్టిన ట్రంప్.. నిక్కీ, వివేక్ అవుట్

26

Trump who ha entered the US elections first and Nicky, Vivek out

Donald Trump : అమెరికాలో నాలుగేండ్లకొకసారి అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయనే విషయం తెలిసిందే. ఈ ఏడాది డిసెంబర్ లో ఈ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుతం డెమోక్రటిక్ పార్టీ అధికారంలో ఉంది. జో బైడెన్ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన పదవీ కాలం ముగియడానికి మరో ఏడాది మాత్రమే ఉంది.

ఇక ప్రతిపక్ష రిపబ్లికన్ పార్టీ ఎన్నికల కోసం తన సన్నాహకాలు మొదలుపెట్టింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను తమ పార్టీ అభ్యర్థిగా ఎన్నుకుంది. పలు నేరారోపణలు, కేసులు ఉన్నప్పటికీ ట్రంప్ పైనే విశ్వాసం ఉంచారు. 2019 నాటి ఎన్నికల్లో ఓడినప్పటికీ..మళ్లీ ట్రంప్ అభ్యర్థిత్వం వైపే మొగ్గు చూపడం ప్రాధాన్యం సంతరించుకుంది.

రిపబ్లికన్ పార్టీని అభ్యర్థిని ఎంచుకోవడానికి అయోవా స్టేట్ లో నిర్వహించిన ప్రాథమిక ఎలక్ట్రోరల్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఆయనకు 52.8శాతం ఓట్లు పోల్ అయ్యాయి. అభ్యర్థి ఎన్నికల్లో నిలువాలని కోరుకుంటున్న ఇతరులు రాన్ డీశాంటీస్ -21.4, నిక్కీ హేలీ-17.7, వివేక్ రామస్వామి-7.2 శాతం ఓట్లను సాధించారు. నిక్కీ హేలీ, వివేక్ రామస్వామి ఇద్దరూ భారత సంతతికి చెందినవారు.

అభ్యర్థిత్వం ఖరారు కావడానికి 1,215 ఓట్లు అవసరం కాగా.. డొనాల్డ్ ట్రంప్ కు తొలి రౌండ్ లోనే 2,035 మేర ఓట్లు పోల్ అయ్యాయి. కౌంటింగ్ ఇంకా కొనసాగుతుండడం వల్ల ఆయన ఆధిక్యత మరింత పెరిగే అవకాశం ఉంది. రాన్ డీశాంటీస్ రెండో స్థానంలో ఉన్నారు. ఆయనకు 824 ఓట్లు, నిక్కీ హేలీ-682, వివేక్ రామస్వామి-278 ఓట్లు వచ్చాయి.

ఈ సారి అధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టాలని ట్రంప్ తహతహలాడుతున్నారు. గత ఎన్నికల్లో ఓడిపోవడమే ఆయనకు రుచించలేదు. తన అనుచరులతో వీరంగం సృష్టించారు. ఇక ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఏదేమైనా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

2024 అయోవా కాకస్‌లలో ట్రంప్ గెలుపు

బలమైన సంప్రదాయవాదులు, పాత ఓటర్లు, MAGA అభిమానులు, 2020 ఎన్నికల తిరస్కరణలు మరియు తక్కువ విద్యావంతులైన అయోవా రిపబ్లికన్‌లు సోమవారం రాత్రి అయోవా యొక్క రిపబ్లికన్ కాకస్‌లలో డోనాల్డ్ ట్రంప్‌ను గెలిపించారు. ఎన్నికల్లో అత్యధికంగా 51 శాతం మంది ట్రంప్ అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వానికి మద్దతుగా ఓట్లు వేశారు.   తీవ్రమైన చలి వాతావరణం, ఇబ్బందులు ఉన్నా జనాలు తరలివచ్చి ఓటు వేయడం విశేషం. .

ట్రంప్ నకు వ్యతిరేకంగా నెలల తరబడి ప్రచారం చేసిన ప్రముఖ ఛాలెంజర్‌లు పోటీపడినప్పటికీ  పోటీ చేసిన అయోవాలో ఇప్పటివరకు అత్యధిక తేడాతో ట్రంప్ విజయం సాధించారు. రిపబ్లికన్ కాకస్‌లు 1976లో ప్రారంభమయ్యాయి.

ఈ పోల్స్ లో ట్రంప్ 51 శాతంతో టాప్ లో ఉండగా.. డీ సాన్ టీస్ 21 శాతంతో రెండో స్థానంలో.. ఇక నిక్కీ హేలీ 19 శాతంతో మూడో స్థానంలో నిలిచారు.