Home EXCLUSIVE Medigadda Barrage : మేడిగడ్డ ఏడో బ్లాక్ ను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ టీం

Medigadda Barrage : మేడిగడ్డ ఏడో బ్లాక్ ను పరిశీలించిన సీడబ్ల్యూపీఆర్ఎస్ టీం

9
Medigadda Barrage
Medigadda Barrage

Medigadda Barrage : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీని సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ సెంటర్ నిపుణుల బృందం పరిశీలించింది. బ్యారేజ్ ఏడో బ్లాక్ లో దెబ్బతిని, కుంగిన పిల్లర్లను సీడబ్ల్యూపీఆర్ఎస్ నిపుణులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బ్యారేజ్ ఏడో బ్లాక్ లోని కుంగిన 15 నుంచి 21వ పిల్లర్ గేట్ల వద్ద ఇసుక మేటలను పరిశీలించారు.

కాళేశ్వరంలోని కీలకమైన మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ ఏడో బ్లాక్ 20వ పియర్ భారీ శబ్ధంతో కుంగిపోయింది. బ్యారేజ్ దెబ్బ తినడంతో సరిహద్దులో తెలంగాణ, మహారాష్ట్రల మధ్య 2023 అక్టోబరు 21వ తేదీ నుంచి రాకపోకలను నిలిపి వేసిన సంగతి తెలిసిందే.