Home EXCLUSIVE AP-Telangana : తెలంగాణకు ఏపీ సర్కార్ అద్దె కట్టక తప్పదా..? 

AP-Telangana : తెలంగాణకు ఏపీ సర్కార్ అద్దె కట్టక తప్పదా..? 

8
AP-Telangana
AP-Telangana

AP-Telangana : తెలుగు రాష్ట్రాలకు హైదరాబాద్ ఉమ్మడి రాజ ధాని గడువు ఈ ఏడాది జూన్ 2తో ముగు స్తుంది. ఈ నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఏపీ ప్రభు త్వ ఆఫీసులో భవనాలను అతిథి గృహాలను ఖాళీ చేయాల్సి ఉంటుంది.

కొనసాగించాలనుకుంటే అద్దె కట్టక తప్పదు. ఖాళీ చేయడమా లేక అద్దె చెల్లించి ఉండడమా అనే అంశంపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. జూన్ 2 నాటికి ఏపీలో ఇంకా ప్రభు త్వం ఏర్పాటు అయ్యే అవకాశం లేని నేపథ్యంలో పరిస్థితి ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగుతూ వచ్చింది. అయితే గడువు జూన్ 2 నాటికి పూర్తి అవుతుంది. సాధారణంగా కొత్త రాష్ట్రాల ఏర్పడినప్పుడు అక్క డ రాజధాని ఏర్పాటు చేసుకునే అంతవరకు అప్పటివరకు ఉన్న రాజధానిని ఉమ్మడి రాజధా నిగా కొనసాగుతుందని కేంద్రం నిర్ణయం తీసు కుంది. అయితే ఉమ్మడి రాజధాని గడువు పూర్తి అవుతున్న  నేపథ్యంలో ఏపీ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వేచి చూడాల్సిన అవసరం ఉంది.