Rajadhani Files Review : అరుణప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రెండవ అధినేత మనస్తత్వానికి ఆ రాష్ట్ర రాజధాని అయిరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతుల బాధలకు మధ్య జరిగిన సంఘర్షణ ప్రధాన ఇతివృత్తంగా తీసిన సినిమా.
“తరాలుగా” సొంతమైన భూములు ఇవ్వడానికి నిరాకరించిన సమయంలో “భవిష్యత్తు తరాలకు” ఇవ్వడం అవసరం అని కన్విన్స్ చేసి తీసుకోవడం ఆపై ఆ ప్రాంత రాజధాని నాశనం కోసం ప్రభుత్వ అధినేత అడుగులు పడడం చివరికి కలల రాజధాని కల సాకారం ఎలా అయిందో చెప్పడమే కథనం.
అయిరావతి పై కులం నిర్మాణ ఖర్చు లో అబద్ధాలు ఏంటి ? రైతులు భూములు వెనక్కి తీసుకుని వ్యవసాయం చేసుకోకుండా ఎందుకు రాజధాని నిర్మాణం పై పట్టుబట్టారు ? ఇలాంటి అంశాలతో సహా ఆరంభం లో ప్రతిపక్ష నేతగా రాజధాని శంఖుస్థాపన కార్యక్రమానికి ఎందుకు హాజరు కాలేదు? చివర్లో రాజధాని భూములు పేదలకు ఇవ్వడంలో మర్మం ఏమిటి? ఇలా ప్రభుత్వ అధినేత ప్రతి విధ్వంసక నిర్ణయం లో అసలు మర్మం ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు.
మాయాబజార్ లో పాండవుల చుట్టూ కథ తిరుగుతూ ఉన్నా ఎక్కడా పాండవుల పాత్రలు లేకుండా తీసిన విధంగా రాజధాని ఫైల్స్ సినిమా ఆరంభం నుంచి చివరి వరకు ఎక్కడా విభజిత అరుణప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ మొదటి అధినేత నారా రాంబాబు ఎక్కడా కనపడకుండా కేవలం వారి విజన్ మాత్రమే కనపడేలా చిత్రీకరించడం విశేషం.
కేవలం రాజధాని అంశం మాత్రమే కాకుండా అభివృద్ధి లేకుండా వివిధ పథకాల పేరిట జనానికి డబ్బు పంచడంలో కులాల మధ్య చిచ్చు నాడు నేడు వగైరా అధినేత & వారి వెనుక ఉన్న వ్యూహకర్త ప్రతి నిర్ణయం వెనుక అసలు మర్మం ఏమిటో.. ఒక్క మాటలో చెప్పాలంటే అరుణప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ద్వితీయ అధినేత నిజస్వరూపం బయటపెట్టే ప్రయత్నమే “రాజధాని ఫైల్స్”