Sreeleela Mother : తెలుగు చిత్ర పరిశ్రమలో దూసుకుపోతున్న హీరోయిన్లలో శ్రీలీల ప్రథమ స్థానంలో ఉంది. మొదట సినిమాలు బాగానే ఆడినా తరువాత కాలంలో ప్లాప్ లు మూటగట్టుకుంది. దీంతో సినిమాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏది పడితే అది ఒప్పుకుంటే పరాజయాలు వెంటాడుతున్నాయి. ఇటీవల విడుదలైన గుంటూరు కారం కూడా డిజాస్టర్ గా నిలవడంతో కంగారు పడుతోంది.
మెడిసిన్ చదువుతున్న ఈ అమ్మడు కాస్త సినిమాలకు విరామం ఇచ్చి పరీక్షలకు హాజరు కావాలని చూస్తోంది. అటు చదువును కూడా నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేయాలని చూస్తోంది. పెళ్లిసందడి సినిమాతో తెరంగేట్రం చేసిన ఆమెకు రవితేజ ధమాకా మంచి రెస్పాన్స్ ఇచ్చింది. దీంతో ఇక తన తడాఖా చూపించింది. అన్ని సినిమాల్లో నటించినా హిట్లు మాత్రం దక్కలేదు. దీంతో నైరాశ్యంలో పడింది.
ఇటీవల ఓ ప్రముఖ దర్శకుడు కథ వినిపించేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. హీరోయిన్ కి కథ మొత్తం వివరించాడు. సినిమాల్లో బోల్డ్ సన్నివేశాలు ఉండటంతో తటపటాయించింది. దీంతో ఆమె తల్లి అతడిని తిట్టి పంపించేసింది. బోల్డ్ సన్నివేశాల్లో నా కూతురు నటించదని నిర్మొహమాటంగా చెప్పేసింది. దీంతో అతడు కామ్ గా వెళ్లిపోయాడట.
దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటే హద్దులు గీసుకోకూడదు. గ్లామర్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు సంపాదించుకోవాలి. లేదంటే వయసు పెరిగితే ఆ చాన్సు కూడా దక్కదు. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో కనీసం పదేళ్లు కూడా హీరోయిన్లు ఉండటం లేదు. ఎప్పటికప్పుడు కొత్త హీరోయిన్లు వస్తూనే ఉన్నారు. పాత వారు వెళ్లిపోతూనే ఉన్నారు. శ్రీలీల సంగతి కూడా అంతేగా మరి.