Home EXCLUSIVE Bhagwant Kesari : మ్యూజిక్ ట్రీట్ స్టార్ట్ చేయనున్న ‘భగవంత్ కేసరి” మేకర్స్.. ఫస్ట్ సింగిల్...

Bhagwant Kesari : మ్యూజిక్ ట్రీట్ స్టార్ట్ చేయనున్న ‘భగవంత్ కేసరి” మేకర్స్.. ఫస్ట్ సింగిల్ అతి త్వరలోనే..

58
Bhagwant Kesari
Bhagwant Kesari

Bhagwant Kesari : నందమూరి బాలకృష్ణ చాలా కాలం పాటు సరైన హిట్స్ లేక బాధ పడ్డారు.. అయినా కూడా హిట్స్ ప్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేసారు. అయితే ఈయనకు అఖండ వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ వచ్చింది.. అఖండ హిట్ అయినప్పటి నుండి బాలయ్య దశ తిరిగిపోయింది. ఏది పట్టుకున్న సూపర్ హిట్టే అనేలా ఈయన కెరీర్ సాగుతుంది.

ఇక ఈ ఏడాది సంక్రాంతికి వీరసింహారెడ్డి సినిమాతో వచ్చి మరో సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్న బాలయ్య అప్పుడే మరో సినిమాను లైన్లో పెట్టాడు.. వరుస బ్లాక్ బస్టర్స్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా ‘భగవంత్ కేసరి’.. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా మాసివ్ రెస్పాన్స్ అందుకుంది. దీంతో మరిన్ని అంచనాలు పెరిగాయి..

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ చేస్తున్న ఈ సినిమా దసరా కానుకగా 2023, అక్టోబర్ 19న రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే 90 శాతం పూర్తి కాగా మిగిలిన కొద్దీ భాగాన్ని కూడా శరవేగంగా పూర్తి చేస్తున్నారు.. ఇప్పటి వరకు టీజర్ కొన్ని పోస్టర్స్ మాత్రమే రిలీజ్ చేసిన మేకర్స్ ఇప్పుడు మ్యూజిక్ ట్రీట్ ను స్టార్ట్ చేయనున్నట్టు తెలుస్తుంది.

భగవంత్ కేసరి ఫస్ట్ సింగిల్ ను సెప్టెంబర్ 1న రిలీజ్ చేయబోతున్నట్టు ఇప్పటికే థమన్ అదిరిపోయే ట్యూన్ కూడా ఇచ్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ పాట వినాయకుడి మీద ఉంటుందట.. చూడాలి ఈ సాంగ్ ఎలా ఆకట్టుకుంటుందో.. కాగా షైన్ స్క్రీన్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తుండగా హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తుంది.. అలాగే బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల నటిస్తుంది..