![Balakrishna and Pawan Kalyan love my fish pulusu](https://jaiswaraajya.tv/wp-content/uploads/2024/02/kiraakrp-1672745496.jpg)
Kiraak RP : జబర్దస్త్ కామెడీ షో నుండి ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన ప్రతీ ఒక్కరు నేడు ఏ స్థాయిలో ఉన్నారో మనమంతా చూస్తూనే ఉన్నాం. అందరూ ఇండస్ట్రీ లో టాప్ కమెడియన్స్ గా స్థిరపడితే, కిరాక్ ఆర్ఫీ మాత్రం వ్యాపార రంగం లో స్థిరపడిపోయాడు. జబర్దస్త్ లో ఈయన మంచి కమెడియన్ గానే కొనసాగాడు కానీ, సుడిగాలి సుధీర్, హైపర్ ఆది రేంజ్ కి మాత్రం చేరుకోలేకపోయాడు. మధ్యలో సినిమాల్లో కూడా ట్రై చేసాడు కానీ వర్కౌట్ అవ్వలేదు.
ఆ తర్వాత దర్శకుడిగా మారి ఒక సినిమా తియ్యడానికి సిద్ధం అయ్యాడు. ఆ సినిమా ప్రారంభం లోనే ఆగిపోయింది. ఒక పక్క జబర్దస్త్ పోయింది, సినిమాల్లో అవకాశాలు రావడం లేదు, చదువుకున్న చదువుకి పెద్ద ఉద్యోగాలు కూడా దొరికే పరిస్థితి లేదు. దీంతో ఎలా చెయ్యాలి, ఎలా బ్రతకాలి అని అనుకుంటున్నా రోజుల్లో ఆయనకీ ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ అనే హోటల్ ని పెట్టే ఆలోచన వచ్చింది.
జబర్దస్త్ ద్వారా సంపాదించిన డబ్బు మొత్తాన్ని ఈ హోటల్ కోసం వినియోగించాడు. ఒక్కమాటలో చెప్పాలంటే చాలా రిస్క్ చేసాడు అనే చెప్పాలి. కానీ ఏ ముహూర్తం లో ఈ ఫిష్ హోటల్ ప్రారంభించాడో తెలియదు కానీ, అప్పటి నుండి కిరాక్ ఆర్ఫీ కి మహర్దశ పట్టుకుంది. హైదరాబాద్ లో ఈ హోటల్ ప్రారంభించిన అతి కొద్దీ రోజుల్లోనే బాగా ఫేమస్ అయిపోయింది. హైదరాబాద్ నలుమూల నుండి జనాలు ఇక్కడకి వచ్చి తినేసి వెళ్లేవారు. ప్రస్తుతం సోషల్ మీడియా లో కుమారి ఆంటీ ఏ రేంజ్ లో ట్రెండ్ అవుతుందో, అప్పట్లో ‘నెల్లూరు పెద్దా రెడ్డి చేపల పులుసు’ హోటల్ ఆ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది.
డిమాండ్ రోజు రోజుకి పెరుగుతూ ఉండడం , తన దగ్గర ఆ డిమాండ్ తగ్గ పనిమనుషులు, వంటవాళ్లు లేకపోవడం కొద్దీ రోజులు హోటల్ మూసేసి మళ్ళీ రీ స్టార్ట్ చేసాడు. మణికొండ, అమీర్ పేట్ ఇలా హైదరాబాద్ లో టాప్ సెంటర్స్ అన్నిట్లో ఈ హోటల్ ని ఓపెన్ చేసాడు. రెస్పాన్స్ అదిరిపోయింది. రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ ‘మా హోటల్ నుండి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేయించుకొని తిన్నారు..నాకు అది ఎంతో సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ చెప్పుకొచ్చాడు.