తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నాడు. 2023 జనవరి 26 నుండి పాదయాత్ర చేపట్టనున్నాడు. అయితే తెలంగాణ అంతటా పాదయాత్ర చేయడానికి సిద్దమయ్యాడు కానీ ఎక్కడ ప్రారంభించాలి ? ఎక్కడ ముగించాలి? అనే విషయంలో మాత్రం తీవ్ర తర్జన భర్జన పడ్డారు. చివరకు శ్రీ సీతారాములు కొలువైన భద్రాచలం నుండి పాదయాత్ర చేయడానికి సుముహూర్తం నిర్ణయించాడు.
కాంగ్రెస్ పార్టీకి కంచుకోట ఖమ్మం జిల్లా దాంతో భద్రాచలం శ్రీ సీతారాముల వారిని దర్శించుకొని పాదయాత్ర చేయడం ద్వారా కాంగ్రెస్ శ్రేణులకు ధైర్యాన్ని , భరోసాను కల్పించినట్లు అవుతుందని ఇక్కడి నుండే ప్రారంభిస్తున్నారట. మొత్తంగా 5 నెలల పాటు అన్ని జిల్లాలను కవర్ చేసేలా పాదయాత్ర రూట్ మ్యాప్ ఖరారు అయ్యింది. ఇక అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్రారంభిస్తాడు. అయితే ఈ పాదయాత్ర లో రేవంత్ రెడ్డి ఒక్కడే ఉంటాడా ? సీనియర్లు కూడా పాల్గొంటారా ? అన్నది తెలియాల్సి ఉంది.