నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోయిన్ హనీ రోజ్ తో కలిసి పెగ్గేసిన స్టిల్ వైరల్ గా మారింది. హనీ రోజ్ , బాలయ్య ఒకరి చేతుల్లోంచి మరొకరు చేయి పెట్టుకొని దగ్గరగా నిలుచొని మద్యం గ్లాసులను నోట్లో పెట్టుకొని ఇచ్చిన ఫోజు వైరల్ అవుతోంది. నిన్న రాత్రి వీరసింహారెడ్డి విజయోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మేకర్స్. కాగా ఆ వేడుకలు అయ్యాక రాత్రి ఇలా మందు పార్టీ జరిగింది. ఇంకేముంది ఆ పార్టీలో బాలయ్య , హనీ రోజ్ ఇలా మద్యం గ్లాసులతో రెచ్చిపోయారు. హీరోలు, హీరోయిన్ లు మద్యం తీసుకోవడం ఈరోజుల్లో సర్వసాధారణమనే విషయం తెలిసిందే.
వీరసింహారెడ్డి చిత్రంలో బాలయ్య సరసన హనీ రోజ్ నటించిన విషయం తెలిసిందే. మలయాళ ముద్దుగుమ్మ అయిన హనీ రోజ్ చూడచక్కని శరీర సౌష్టవంతో ఉండటంతో ఈ భామకు క్రేజ్ బాగానే వుంది. మలయాళంలో స్టార్ హీరోయిన్ అయిన హనీ రోజ్ కు సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. దాంతో అందాలను ఆరబోస్తూ రకరకాల ఫోటోలను పెడుతూనే ఉంది. వీరసింహారెడ్డి చిత్రంతో టాలీవుడ్ లో అడుగు పెట్టిన ఈ భామకు తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నాయి. వీరసింహారెడ్డి చిత్రంలో గ్లామర్ తో అలరించింది…….అలాగే పెర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. వీరసింహారెడ్డి విజయం సాధించడంతో హనీ రోజ్ చాలా సంతోషం వ్యక్తం చేస్తోంది.