Samarasimha Reddy Re Release : బాలక్రిష్ణ హీరోగా బి.గోపాల్ దర్శకత్వంలో 1999 జనవరి 13న వచ్చిన సినిమా సమరసింహారెడ్డి. తెలుగు పరిశ్రమలో వండర్ క్రియేట్ చేసింది. బాలయ్య జీవితంలో అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా గుర్తింపు పొందింది. ఫ్యాక్షన్ యాక్షన్ తో వచ్చిన సినిమా బ్రహ్మాండమైన హిట్ గా నిలిచింది. ముగ్గురు హీరోయిన్లతో బాలయ్య వేసిన స్టెప్పులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.
సినిమాలో రైలు ఛేజింగ్ సన్నివేశాలు అందరిని ఆకట్టుకున్నాయి. సినిమాకు హైలైట్ గా నిలిచాయి. సిమ్రాన్, అంజలా ఝవేరి, సంఘవి హీరోయిన్లుగా నటించారు. 73 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకున్న చిత్రంగా రికార్డులు కొల్లగొట్టింది. 29 కేంద్రాల్లో అర్థ శతదినోత్సవం జరుపుకుంది. బాలయ్య యాక్షన్ కు ప్రేక్షకులు చప్పట్లు కొట్టారు. తన ఇమేజ్ ను పెంచిన చిత్రంగా నిలిచింది.
ఈ సినిమాకు ఆ రోజుల్లో రూ. 6 కోట్లు ఖర్చు చేశారు. కానీ రూ. 20 కోట్లు సాధించింది. అత్యంత ప్రజాదరణ పొందిన చిత్రంగా గుర్తించబడింది. ఫ్యాక్షన్ యాక్షన్ తో తెలుగు పరిశ్రమలో బ్రహ్మాండమైన హిట్ సాధించింది. బి.గోపాల్, బాలక్రిష్ణ కాంబినేషన్ లో వచ్చిన మరో అద్భుత చిత్రంగా ఖ్యాతి ఆర్జించింది. సమరసింహారెడ్డి సినిమా మార్చి 2న 4కే వెర్షన్ లో రీ రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ సమాయత్తం అవుతున్నారు. ఇప్పుడు కూడా రికార్డులు కొల్లగొడుతుందేమో చూడాలి మరి.