1986 లో విడుదలై సంచలన విజయం సాధించిన చిత్రం ” సింహాసనం ”. సూపర్ స్టార్ కృష్ణ ద్విపాత్రాభినయం పోషించడమే కాకుండా దర్శకత్వం వహించిన ఈ చిత్రం మొట్ట మొదటి 70 ఎం ఎం చిత్రం కావడం విశేషం. పద్మాలయా స్టూడియోస్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించారు. కృష్ణ , జయప్రద , రాధ , మందాకినీ , సత్యనారాయణ , కాంతారావు , తదితరులు నటించారు.
పాత సినిమాలను మళ్ళీ విడుదల చేయడం కామన్ అయిపొయింది ఇటీవల కాలంలో. ఇప్పటికే మహేష్ బాబు నటించిన పోకిరి , పవన్ కళ్యాణ్ నటించిన జల్సా చిత్రాలను మళ్ళీ విడుదల చేయగా వసూళ్ల వర్షం కురిపించాయి. దాంతో కృష్ణ నటించిన సూపర్ హిట్ చిత్రం సింహాసనం ను 8 K రెసొల్యూషన్ లో సరికొత్త హంగులతో 2023 లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Breaking News