39.2 C
India
Saturday, April 27, 2024
More

    Happy Krishnashtami : హ్యాపీ కృష్ణాష్టమి : ఈరోజు శ్రీక్రిష్ణుడి దేవాలయాలు సందర్శిస్తే ఎలాంటి మేలు కలుగుతుందంటే?

    Date:

    Happy Krishnashtami :

    శ్రీక్రిష్ణ జన్మాష్టమి సందర్భంగా ఆయనకు సంబంధించిన ఆలయాలు కిటకిటలాడతాయి. భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆయన జన్మాష్టమి జరుపుకుంటారు. కొన్ని ప్రదేశాల్లో ఉట్టి కొడతారు. కొన్ని చోట్ల పూజలు చేస్తారు. మనం కొలిచే దేవుళ్లలో మహా విష్ణువు అవతారమైన క్రిష్ణుడిని అందరు ఆరాధిస్తుంటారు. జన్మాష్టమి రోజు ఆయన దేవాలయాలను సందర్శిస్తే మహాపుణ్యం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం.

    మధురలోని ద్వారకాధీష్ ఆలయం ప్రసిద్ధి చెందింది. ఇక్కడ క్రిష్ణుడు నలుపు రంగులో దర్శనమిస్తాడు. యమునా నది ఒడ్డున జైలు గదిలో ఉంది. ఇక్కడే ఆయన జన్మించాడని నమ్ముతుంటారు అందుకే దీనికి ద్వారాధీష్ దేవాలయం అని పేరు పెట్టారు. ఈ ఆలయాన్ని దర్శించడానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు మధురకు వస్తుంటారు. ఈ ఆలయాన్ని సందర్శిస్తే శాంతి కలుగుతుందని చెబుతుంటారు.

    క్రిష్ణుడు చిన్నతరంలో బాంకే బిహారీ దేవాలయంలో జన్మించాడని అంటుంటారు. అందుకే ఈ ఆలయం పేరు బాంకే బిహారీ అని పిలుస్తుంటారు. ఇక్కడే ఆయన చిన్నతనంలో ఎన్నో చిలిపి చేష్టలు కొనసాగించాడు. రాసలీలలు చేశాడు. జన్మాష్టమి సందర్భంగా భక్తులు ఈ ఆలయాన్ని సందర్శించి తరిస్తారు. పూజలు నిర్వహిస్తారు.

    ఉడిపిలోని శ్రీ క్రిష్ణ మఠం ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటి. వైష్ణవ సన్యాసి శ్రీ మాధవాచార్యులు 13వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడని ప్రతీతి. ఈ ఆలయంలో ఉన్న తొమ్మిది రంధ్రాల కిటికీ ద్వారా భక్తులు క్రిష్ణుడిని దర్శించుకుంటారు. దీన్ని అద్భుత కిటికీ అని పిలుస్తుంటారు. ఇక్కడకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు సందర్శించి పూజలు, దీపాలు వెలిగించి పూజలు చేస్తారు.

    గుజరాత్ లో ఉన్న ద్వారకాధీష్ ఆలయం క్రిష్ణుడి ప్రధాన దేవాలయంగా చెబుతారు. దీన్ని జగత్ మందిర్ అని పిలుస్తుంటారు. ఇది చార్ ధామ్ లో ఒకటి. ఈ ఆలయం నాలుగు ధాములలో అత్యంత సుందరమైనది. ద్వారకాధీష్ దేవాలయం గోమతి క్రీక (గోమతి ఘాట్ ) మీద ఉంటుంది. 43 మీటర్ల ఎత్తులో నిర్మించడం వల్ల భక్తుల సందడి ఎక్కువగా ఉంటుంది.

    ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీలోని జగన్నాథ స్వామి ఆలయం. ఇక్కడ క్రిష్ణుడు తన సోదరుడు బలరాముడు, సోదరి సుబద్రతో కలిసి ఉండటం వల్ల ప్రాచుర్యం పొందింది. ఈ రథయాత్రలో పాల్గొనడానికి చాలా మంది ఉత్సాహం చూపిస్తారు. రథాన్ని లాగడానికి లక్షలాది మంది తరలి వస్తుంటారు. ఈ ప్రయాణంలో బలరాముడు అధిరోహించే రథం ముందు వరుసలో ఉంటుంది. అనంతరం సోదరి సుభద్ర రథం, తరువాత క్రిష్ణుడి రథాలు ఉంటాయి.

    Share post:

    More like this
    Related

    Prabhas Kalki : జూన్ 27న ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్

    Prabhas Kalki : ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబినేషన్ లో...

    Everest : ఎవరెస్ట్ పై త్రివర్ణ పతాకం ఎగురవేసిన ఆరేళ్ల బాలుడు

    Everest : హిమాచల్ ప్రదేశ్ బిలాస్ పుర్ కు చెందిన ఆరేళ్ల...

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Superstar’s Family : సూపర్ స్టార్ కుటుంబంలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటో తెలుసా?

    Superstar's Family : సూపర్ స్టార్ క్రిష్ణ తనయుడు మహేష్ బాబు...

    Google Map చూస్తూ వెళ్తూ.. రోడ్డు ప్రమాదం.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి..

    Google map : చేరాల్సిన ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ...

    ఏపీకి పవన్ కళ్యాణ్.. కలవరపడుతున్న వైసీపీ నేతలు..

    Pavan Kalyan to AP : జనసేన పార్టీ అధినేత చాలా...

    చిత్ర పరిశ్రమలో మరో విషాదం : నటుడు, నిర్మాత కాస్ట్యూమ్స్ కృష్ణ మృతి

    తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు ,...