
Google map : చేరాల్సిన ప్రదేశాన్ని గూగుల్ మ్యాప్ లో చూసుకుంటూ వెళ్తూ ముగ్గురు యువకులు దారి తప్పారు. చేరాల్సిన గమ్యం కాదని తెలిసి గ్రహించి వెనక్కి తిరిగి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఒక యువకుడు మృతి చెందాడు. వివరాలను పరిశీలిస్తే..
కృష్ణా జిల్లాలోని, చిన్నగొల్లపాలెంకు చెందిన చరణ్ ఇంజినీరింగ్ కంప్లీట్ చేశాడు. హైదరాబాద్ లోని పోచారం వద్ద ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా ఉద్యోగం చేస్తున్నాడు. సమీపంలోని టౌన్ షిప్ లో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. వారాంతపు సెలవులు రావడంతో శనివారం సాయంత్రం మూడు 3 బండ్లపై తొమ్మిది మంది స్నేహితులు కొత్త సెక్రటేరియట్, భారీ అంబేడ్కర్ విగ్రహాలను చూసేందుకు వెళ్లారు. కొంత సమయం ట్యాంక్ బండ్ పై ఎంజాయ్ చేశారు. తర్వత తీగెల వంతెన చూడాలని బయల్దేరారు. అయితే వారందరికీ నగరం కొత్త. అక్కడికి చేరుకోవాలని గూగుల్ మ్యాప్ పెట్టుకున్నారు. మ్యాప్ ను బట్టి మెహిదీపట్నం మీదుగా తీగల వంతెన వైపు బయల్దేరారు. రెండు బైకులపై మిత్రులు ముందు వెళ్లారు.
అయితే చరణ్ అనే యువకుడు గూగుల్ మ్యాప్ చూస్తూ ఆరాంఘర్ వద్ద బైక్ పీవీఎన్ఆర్ ఎక్స్ ప్రెస్ వే వైపు మళ్లించాడు. కాసేపయ్యాక దారి తప్పినట్లు అనిపించింది. గచ్చిబౌలి వెళ్లేందుకు పిల్లర్ నెంబర్ 82 వద్ద ఎక్స్ ప్రెస్ వే నుంచి ర్యాంపు మీదుగా కిందకు వెళ్లేందుకు మలుపు తిరిగాడు. అదే సమయంలో ఆరాంఘర్ నుంచి వస్తున్న కారు చరణ్ బైక్ ను ఢీ కొంది. లంగర్ హౌజ్ ఇన్ స్పెక్టర్ శ్రీనివాస్, ఎస్ఐ సత్యనరేంద్ర యాక్సిడెంట్ స్థలానికి చేరుకొని చరణ్ ను స్థానిక హాస్పిటల్ కు తరలించారు. ఆదివారం మరణించినట్లు తెలిసింది. చరణ్ బైక్ వెనుక కూర్చున్న యువతులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.
అయితే ప్రమాదంలో గాయపడిన చరణ్ రోడ్డుపై కొంత సేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడాడు. లేవలేని స్థితిలో ఉన్న ఆయన అక్కడికి వచ్చిన వారికి చేతులు జోడించి తనను కాపాడాలంటూ సైగలు చేస్తూ వేడుకున్నాడు. ఇక పోలీసులు వచ్చే వరకూ ఎవరూ ఆయనను చూస్తూ ఉండిపోయారు. పోలీసులు వచ్చేంత వరకూ వరకూ చరణ్ రోడ్డుపై ప్రాణాలతో కొట్టుమిట్టాడే హృదయ విదారకరనమైన దృష్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అక్కడికి వచ్చిన వారిని కూడా చాలా మంది విమర్శిస్తున్నారు. యాక్సిడెంట్ ప్రదేశానికి వచ్చిన వారు మొదలే స్పందిస్తే చరణ్ ప్రాణాలు నిలిచేవని అంటున్నారు.
ఏది ఏమైనా గూగుల్ మ్యాపులో ఒక ప్రదేశానికి వెళ్లబోయి దారి తప్పడం.. మళ్లీ దారిలోకి వచ్చి రాంగ్ టర్న్ తీసుకోవడం వల్లే చరణ్ మరణించాడంటూ వాదనలు వినిపిస్తున్నాయి. ఆ మలుపు తిరగకుండా ఉంటే చరణ్ బతికే వాడని కొందరు అంటే ఆయన చేసుకున్న కర్మఫలం అంటూ కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.