35.8 C
India
Monday, May 20, 2024
More

    Expatriates : లక్షల కోట్లు పంపిస్తున్న ప్రవాసులు..ఈ విషయంలో ఇండియానే టాప్

    Date:

    Expatriates
    Expatriates

    Expatriates : ప్రస్తుతం సంపాదన కోసం చాలామంది విదేశాల బాట పడుతున్నారు. అక్కడ బాగా సంపాదించుకుని తమ కుటుంబీకులకు స్వదేశానికి పంపిస్తున్నారు. అలా వెళ్లిన ప్రవాసులు 2022లో మన దేశంలోని కుటుంబీకులు, సన్నిహితులకు దాదాపు రూ.9.2 లక్షల కోట్లను పంపించారు. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం ఒక దేశం నుంచి వెళ్లి, వివిధ దేశాల్లో నివశిస్తున్న వారు సొంత దేశానికి పంపిన అత్యధిక మొత్తం ఇదే కావడం గమనార్హం. ఒక ఏడాదిలోనే 100 బిలియన్‌ డాలర్ల ప్రవాస నిధుల మైలురాయిని అందుకున్న తొలి దేశంగా భారత్‌ నిలిచింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితికి చెందిన ఇంటర్నేషనల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ మైగ్రేషన్‌ తన నివేదికలో పేర్కొంది. ప్రవాసులు అత్యధికంగా నిధులు పంపిన దేశాల్లో భారత్‌, మెక్సికో, చైనా, ఫిలిప్పిన్స్‌, ఫ్రాన్స్‌.. మొదటి ఐదు స్థానాలను దక్కించుకున్నాయి. రెండో స్థానంలో ఉన్న చైనాను 2021నుంచి మెక్సికో ఆక్రమించింది. 2022లో మెక్సికోకు ప్రవాసుల నుంచి 61 బిలియన్ డాలర్లు రాగా.. చైనా 51 బిలియన్ డాలర్లు అందుకుంది. 2010లో (53.48 బిలియన్‌ డాలర్లు), 2015లో (68.91 బి.డాలర్లు), 2020లో (83.15 బి.డాలర్లు)లతో భారత్ అగ్రస్థానంలో నిలిచింది. ఇక 2022లో 100 బిలియన్‌ డాలర్ల మైలురాయిని అధిగమించి ఆ స్థానాన్ని మరో సారి నిలబెట్టుకుందని సదరు నివేదిక పేర్కొంది.

    ప్రవాసులు ఎక్కువగా నిధులు పంపిస్తున్న టాప్ 10 దేశాల్లో దక్షిణాసియాకు చెందిన భారత్‌, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌ ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి కార్మిక వలసలూ అధికంగా ఉంటున్నాయి. 2022లో ప్రవాస నిధులపరంగా పాకిస్తాన్‌ ఆరో స్థానంలో (30 బిలియన్‌ డాలర్లు), బంగ్లాదేశ్‌ (21.5 బి.డాలర్లు) ఎనిమిదో స్థానంలో ఉన్నాయి.  వలస కార్మికులకు గల్ఫ్‌ దేశాలే ప్రధాన గమ్యస్థానాలుగా కొనసాగుతున్నట్లు నివేదిక పేర్కొంది. యూఏఈ మొత్తం జనాభాలో 88శాతం మంది వలస వచ్చిన ప్రజలే. వలసలకు గమ్యస్థానంలో భారత్‌ 13వ స్థానంలో ఉంది. ఇక చదువుల నిమిత్తం విదేశాలకు వెళ్తున్న వారి సంఖ్య విషయంలోనూ ఆసియా దేశాలే ముందున్నాయి. 2021లో చైనా నుంచి పది లక్షల మందికి పైగా విద్యార్థులు వలస వెళ్లారు. ఈ విషయంలో భారత్‌ రెండో స్థానంలో నిలిచింది. ఇక్కడ నుంచి సుమారు ఐదు లక్షల మంది చదువుల కోసం విదేశాల బాట పట్టారు. ఉన్నత చదువుల కోసం అమెరికానే విద్యా్ర్థులు ఎక్కువగా ఎంచుకుంటున్నారు. ఈ దేశానికి సుమారు 8,33,000 మంది విద్యార్థులు వివిధ దేశాల నుంచి చదువుకునేందుకు వెళ్లారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రిటన్‌ (6,01,000), ఆస్ట్రేలియా (3,78,000), జర్మనీ (3,76,000), కెనడా (3,18,000) ఉన్నాయి.

    Share post:

    More like this
    Related

    AP News : అంతా అయన మనుషులే ..

    AP News : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మే 13 న...

    Sunrisers Hyderabad : పంజాబ్ పై సన్ రైజర్స్ ఘన విజయం.. క్వాలిఫైయర్ 1 కు క్వాలిఫై

    Sunrisers Hyderabad : సన్ రైజర్స్ హైదరాబాద్, పంజాబ్ కింగ్స్ ఎలెవన్...

    Medaram : 29, 30 తేదీల్లో వనదేవతల దర్శనం నిలిపివేత

    Medaram : మేడారంలోని వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణాన్ని ఈ...

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cognizant : ఆఫీసుకు రాకుంటే జాబ్ నుంచి తీసేస్తాం: కాగ్నిజెంట్

    Cognizant : ఉద్యోగులంతా కచ్చితంగా ఆఫీసుకు వచ్చి పనిచేయాలని, ఈ నిబంధనను...

    Ex-Indian Army Officer : మాజీ సైన్యాధికారి మృతిపై ఐరాస సంతాపం – భారత్ కు క్షమాపణలు

    Ex-Indian Army Officer : భారత మాజీ సైన్యాధికారి కర్నల్ వైభవ్...

    USCIS : USCIS కొత్త పెండింగ్ I-485 ఇన్వెంటరీ..

    USCIS : యూఎస్ లో శాశ్వత నివాసం కోరుతూ దాఖలు చేసే...