35.8 C
India
Sunday, April 28, 2024
More

    Krishna brother : కృష్ణ తమ్ముడంటే ఇండస్ట్రీకి హడల్.. ఎందుకో తెలుసా..?

    Date:

    Krishna brother
    Krishna brother, Hanumantha Rao

    Krishna brother : హీరోగానో, హీరోయిన్ గానో ఇండస్ట్రీలో రాణిస్తే వారి నుంచి తమ పరివారం ఒక్కొక్కరుగా వచ్చి ఇండస్ట్రీలోని కీలక బాధ్యతలు తీసుకుంటారు లేదా వారు కూడా స్టార్ నటులుగా మారుతారు. అలా అన్న కోసం ఇండస్ట్రీకి వచ్చిన తమ్ముడి అన్న వెంటే నిలబడి అన్ని చూసుకుంటూ ఇండస్ట్రీలో ముక్కు సూటి మనిషి అంటూ పేరు తెచ్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. అన్న సినిమాలు, వాటి నిర్మాణాలు, బాధ్యతలను ఆయన బాగా చూసుకునేవారు. ఎక్కడ ఎలాంటి డిస్టర్బ్ లేకుండా చూసుకునే వారట అందుకు ఎంతటి స్టార్ డైరెక్టర్ అయినా, హీరోనైనా ఎదుర్కునే వారట. ఆయనే సూపర్ స్టార్ కృష్ణ తమ్ముడు హనుమంతా రావు.

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, తెనాలి వద్ద బుర్రిపాలెంలో జన్మించారు సూపర్ స్టార్ కృష్ణ. ఆయన తల్లిదండ్రులకు ముగ్గురు సంతానం. అందులో పెద్దవాడు సూపర్ స్టార్ కృష్ణ. ఆయనకు పెద్ద తమ్ముడు హనుమంత రావు, చిన్న తమ్ముడు ఆదిశేషగిరి రావు. కృష్ణ ఇండస్ట్రీకి వచ్చాక చాలా బిజీగా మారారు. అనతి కాలంలోనే స్టార్ హీరోగా గుర్తింపు సంపాదించుకున్నాడు. దీంతో ఆయనకు సంబంధించిన పనులు చూసుకునేందుకు ఇద్దరు తమ్ముళ్లును ఆయన పిలిపించుకున్నారు. అందులో పెద్దవాడు హనుమంత రావు అంటే అందరికీ హడల్.

    1 అక్టోబర్, 1944లో బుర్రిపాలెంలోనే జన్మించారు హనుమంతా రావు. డిప్లమా చేసి గవర్నమెంట్ ఉద్యోగం సంపాదించారు. అప్పట్లో నాగార్జున సాగర్ డ్యాం నిర్మాణంలో కూడా ఆయన పాలు పంచుకున్నారు. అన్న కృష్ణ ఇండస్ట్రీలో స్టార్ హీరో కావడంతో ఆయనకు చేదోడుగా ఉండేందుకు ఉద్యోగం వదిలి వచ్చేశారు. ఆయనకు కూడా సినిమాల్లో కనిపించాలని అనిపించేది. ఆయన కోరిక మేరకు డైరెక్టర్లు కొన్ని సినిమాల్లో అవకాశాలు కూడా ఇచ్చారు. ‘అనురాధ’ సినిమాలో సీఐడీ ఆఫీసర్ గా నటించారు. కృష్ణ నటించిన ‘గూఢచారి’లో కూడా కనిపించారు.

    ఇక పద్మాలయ స్టూడియో నిర్మాణం పూర్తయ్యాక పూర్తి బాధ్యతలు తీసుకున్నారు హనుమంతా రావు. కృష్ణ గారి సినిమాలు, రెమ్యురేషన్, కథ తదితరాలను ఆయనే స్వయంగా చూసుకునేవారు ఆయన ముక్కుసూటి మనిషి కావడంతో డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఆయనంటే హడలెత్తిపోయేవారు. ఒకానొక సందర్భంగా రాఘవేందర్ రావుతో కూడా గొడవకు దిగారు హనుమంతా రావు. ‘ఖైదీ’ మూవీని హిందీలో రీమేక్ చేయాలని దానికి డైరెక్టర్ గా ఉండాలని రాఘవేందర్ రావును సంప్రదిస్తే రెమ్యునరేషన్ తక్కువగా ఇస్తారు చేయలేను అన్నారట. ముక్కుసూటిగా వ్యవహరించే ఆయన రాఘవేందర్ రావు అయినా.. ఆయన అసిస్టెంట్ అయినా నాకు ఒక్కటే అంటూ వెళ్లిపోయారట. పైగా రాఘవేందర్ రావుకు హిందీలో ఫస్ట్ చాన్స్ ఇచ్చింది తామేనని మరిచిపోవద్దని కూడా చెప్పారట. ఆ సినిమాను రాఘవేందర్ రావు అసిస్టెంట్ డైరెక్టర్ తో రీమేక్ చేయించారు.

    ఇక ‘అల్లూరి సితారామరాజు’ టైటిల్ వివాదాన్ని కూడా ఆయన అంతే ఘాటుగా చక్కబెట్టారట. ఈ టైటిల్ రిజిస్ట్రర్ చేసుకునేందుకు ఫిల్మ్ ఛాంబర్ వెల్లారట. అయితే అక్కడ ప్రెసిడెంట్ గా డీవీఎస్ రాజు, సెక్రటరీగా యూ విశ్వేశ్వర్ రావులు ఉన్నారు. ఇందులో విశ్వేశ్వర్ రావు అన్న నందమూరి తారక రామారావుకు బావ అవుతారు. ఈ టైటిల్ రిజిస్ట్రేషన్ కు వారు తటపటాయించారట. దీంతో ఆగ్రహం వచ్చిన హనుమంతా రావు విశ్వేశ్వర్ రావును పట్టుకొని నువ్వు ఛాంబర్ కు సెక్రటరీనా..? లేక మీ బావకా..? అంటూ మొహం పట్టుకొని అడిగేశారట. ఇక ఆ తర్వాత టైటిల్ రిజిస్ట్రర్ అయిపోయింది. కృష్ణ కు అన్ని విధాలుగా తోడుగా నిల్చున్న తమ్ముడు హన్మంతారావు 1993లో మరణించారు. ఆయన పిల్లలు శేషగిరిరావుతో కలిసి పద్మాలయ బ్యానర్ బాధ్యతలను చూసుకుంటున్నారు.

    Share post:

    More like this
    Related

    Cyber Scam : సీబీఐ అధికారులం అంటూ.. రూ.50 లక్షలు కొట్టేశారు

    Cyber Scam : సైబర్ నేరాలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఒక్కొక్కరు ఒక్కో...

    Faria Abdullah : ‘ఆ ఒక్కటి అడక్కు’ మంచి ఎంటర్‌టైన్ మూవీ: ఫరియా అబ్దుల్లా

    Faria Abdullah : అల్లరి నరేష్, ఫరియా అబ్దుల్లా జంటగా నటించిన...

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్.. ఆర్సీబీ మ్యాచ్ లో గెలుపెవరిదో

    GT Vs RCB : గుజరాత్ టైటాన్స్,  ఆర్సీబీ మధ్య అహ్మదాబాద్...

    LSG Vs RR : లక్నోపై రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం

    LSG Vs RR : లక్నో సూపర్ గెయింట్స్ పై అటల్...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Hanumantha Rao : సీఎం రేవంత్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేసిన హనుమంత రావు..? 

    Hanumantha Rao : తెలంగాణ: కాంగ్రెస్ లో BRS నేతల చేరికపై ఆ...

    Tribute to Natasekhar : నటశేఖరుడికి డాక్టర్ జై యలమంచిలి నివాళి..

    Tribute to Natasekhar : నట శేఖరుడు, సూపర్‌ స్టార్ కృష్ణ...

    ఈనాడు సంచలనానికి 40 ఏళ్ళు

    నటశేఖర కృష్ణ ను సూపర్ స్టార్ ను చేసిన చిత్రం ''...

    ఐ లవ్ యు నాన్న : మహేష్ బాబు ట్వీట్ వైరల్

    ఐ లవ్ యు నాన్న ...... నువ్వే నా సూపర్ స్టార్...