శోభన్ బాబు ఎంత చెబుతున్నా వినకుండా హైదరాబాద్ , చెన్నై లలో ఉన్న ఎకరాల కొద్దీ భూములను అమ్మానని , దాంతో 100 కోట్ల ఆస్థి పోగొట్టుకున్నానంటూ బోరుమన్నాడు సీనియర్ నటులు చంద్రమోహన్. ఇటీవల JSW & Jaiswaraajya.tv లకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలను చేసాడు చంద్రమోహన్.
హైదరాబాద్ లోని కొంపల్లిలో ద్రాక్ష తోట కొన్నాను. శోభన్ బాబు సలహాతోనే హైదరాబాద్ లో అలాగే చెన్నై లో పలు చోట్ల భూములను కొన్నానని, అయితే వాటిని చూసుకోవడం ఇబ్బంది అనిపించి అమ్మేయాలని అనుకున్నప్పుడు ఈ విషయం శోభన్ బాబుకు తెలిసి వద్దంటే వద్దని వారించాడని , కానీ నేను మాత్రం అతడి మాటలు వినిపించుకోకుండా ఆ భూములను తక్కువ ధరకే అమ్మానని అవి 100 కోట్లకు పైగా విలువైన భూములను ఆవేదన వ్యక్తం చేసాడు.
నేను ఇన్నేళ్ల నటజీవితంలో సంపాదించిన దానికంటే పోగొట్టుకున్నదే ఎక్కువ అని బాధపడ్డాడు చంద్రమోహన్. తెలుగునాట 1100 చిత్రాలకు పైగా నటించి సంచలనం సృష్టించాడు. హీరోగా , విలన్ గా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇలా అన్ని రకాల పాత్రలను పోషించిన గొప్ప నటుడు చంద్రమోహన్. అయితే గతకొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంత జీవితాన్ని గడుపుతున్నాడు.