39.6 C
India
Saturday, April 27, 2024
More

    Shobhan Babu : తన పాత్ర కంటే నా పాత్రకే ప్రాధాన్యత ఎక్కువ.. రామారావును ఎన్నటికీ మరిచిపోలేను: శోభన్ బాబు

    Date:

    Shobhan Babu
    Shobhan Babu and Rama Rao

    Shobhan Babu : తెలుగు సినిమాను సగర్వంగా తలెత్తుకునేలా చేసిన నటుల్లో మొదటి వారు నందమూరి తారక రామారావు. చెన్నై కేంద్రంగా ఉన్న టాలీవుడ్ ను హైదరాబాద్ కు మార్చి అంచలంచెలుగా ఎదిగేందుకు ఎంతో కృషి చేశారు. కళామతల్లి రుణం తీర్చుకునేందుకు వందలాది చిత్రాల్లో నటించి మెప్పించారు. ఎంతో మంది కొత్త నటులను ఎంకరేజ్ చేస్తూ మంచి పాత్రలు ఇప్పించడంలో విశేష కృషి చేశారు. ఆంధ్రాలో వరదలు వచ్చిన సమయంలో వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్టీఆర్ చేసిన పనులకు మాటలు కూడా చాలవేమో. ఎంతో మందికి యాక్టింగ్ లో అవకాశం ఇప్పించిన ఆయన వారి గుండెల్లో అజరామరంగా ఉన్నారు. ఆయన గురించి ఒక యంగ్ హీరో ఏమన్నాడంటే..

    నటభూషణ్ గా టాలీవుడ్ ను ఏలిన అందగాడు శోభన్ బాబు. ఆయన కెరీర్ మొదట్లో అవకాశాల కోసం స్టూడియోల చుట్టూ తిరిగినా దక్కలేదు. ఆర్థిక భారం భరించలేక ఇంటి బాటపట్టాలనుకున్న ఆయనకు చిన్న చిన్న అవకాశాలు రావడం మొదలైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ దేవుడిలా కనిపించి ఒక సినిమాలో వేషం ఇప్పించాడు. ఆ సినిమాలో ఎన్టీఆర్ హీరో కాగా.. అంతకంటే మంచి పాత్ర కోసం శోభన్ బాబును తీసుకోవాలని సదరు దర్శకుడికి ఎన్టీఆర్ చెప్పారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే విందాం.

    ‘1967 లో ‘పుణ్యవతి’ సినిమాలో రామారావు గారు నాకొక ప్రధాన పాత్ర ఇప్పించి నా సినీ జీవితం కీలక మలుపు తిరిగేలా చేశారు. నిజానికి పుణ్యవతిలో ఎన్టీఆర్ గారే హీరో, కానీ వారు చేసిన పాత్ర కంటే నాకు వారు ఇప్పించిన పాత్రకే ఎక్కువ ప్రాధాన్యం ఉంది. నటన విషయంలో కూడా నా పాత్రకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. నిరంతరం తాగుతూ ఉండే పాత్ర అది. ముందు జగ్గయ్య గారినో మరెవరినో ఆ పాత్ర కోసం అనుకున్నారు. కారణం తెలీదు కానీ జగ్గయ్య గారు కుదర్లేరు. దీంతో రామారావు గారు నన్ను రికమెండ్ చేశారు.

    ‘ఒకసారి ఎన్టీఆర్ వారింటికి పిలిచారు. వెళ్లాను.. బ్రదర్, వాసూ మీనన్ గారు ‘పుణ్యవతి’ అని ఓ మంచి సినిమా తీస్తున్నారు తెలుసా..?  ఏదో.. సూచాయగా విన్నానండి. అవును బ్రదర్, అందులో ఒక బ్రహ్మాండమైన పాత్ర ఉంది. మీరు వారిని కలవండి. మేం ఆల్రెడి చెప్పి ఉంచాం మీ పేరు.. ధ్యాంక్యు సార్.. ఏ హీరో కూడా తాను హీరోగా చేస్తన్న పిక్చర్ లో కొత్తగా వస్తున్న కుర్రాడికి సపోర్టింగ్ హీరో వేషం రికమెండ్ చేయరు. ఆయన పాత్రకు మించిన పాత్రను ఇప్పించడానికి ఎవరూ సిద్ధంగ ఉండరు. కానీ ఎన్టీఆర్ సిద్ధంగా ఉండడమే కాదు ప్రోత్సహించడం, కమాన్ బ్రదర్ కమాన్ దంచేయండి అని నాకు చెప్పడం, నేను మంచి నటుడిని అంటూ నలుగురికీ నన్ను పరిచయం చేయడం, నాకు వేషాలిప్పించడం ఇవన్నీ ఎన్టీఆర్ గారికే చెల్లిందేమో. అది నా అదృష్టం.

    ఆ సినిమా తర్వాత చాలా సినిమాల్లో హీరోగా నటించాను. నేను ఒక ఆఫీస్ పెట్టుకున్న తర్వాత అందులో ఆయన ఫొటోనే పెట్టుకున్నాను. ప్రతీ రోజు ఆఫీసుకు వెళ్లి ఆయన ఫొటోను చూసిన తర్వాతనే షూటింగ్ కు వెళ్తుంటాను. నా అఫీషియల్ దినచర్య ఆయన ఫొటోను చూసిన తర్వాతే స్ట్రాట్ అవుతుంది. వారు ఎన్నటికీ మరపురాని మహా నటుడే కాదు, మహావ్యక్తిగా నా జీవితంలో మిగిలిపోయారు. మిగిలిపోతారు కూడా..!’ అని తన పుస్తకంలో రాసుకున్నారు శోభన్ బాబు.

    1967, నవంబర్ 3వ తేదీన విడుదలైన తెలుగు చిత్రం పుణ్యవతి. వీ దాదా మిరాశి ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్, కృష్ణ కుమారి, శోభన్ బాబు, ఎస్‌వీ రంగారావు, భానుమతి తదితరులు నటించారు.

    Share post:

    More like this
    Related

    CM Jagan : బ్యాండేజ్ తీసిన సీఎం జగన్.. వైసీపీ మేనిఫెస్టో విడుదల

    CM Jagan : ఈరోజు సీఎం జగన్ తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో...

    Office Meeting in Traffic : ట్రాఫిక్ లోనే ఆఫీస్ మీటింగ్..ఇవేం ఉద్యోగాలురా బాబూ..  

    Office Meeting in Traffic : ప్రస్తుత రోజుల్లో మనిషి కూడా...

    Mahesh Babu : మహేశ్ బాబు చిన్నప్పటి ఫొటో వైరల్.. పక్కనున్న వ్యక్తి ఎవరంటే..

    Mahesh Babu : మహేశ్ బాబు తన చిన్ననాటి ఫొటో ఒకటి...

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నాని ఫొటో వైరల్..

    Junior NTR : జూనియర్ ఎన్టీఆర్ కు కొడాలి నానికి మధ్య...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    NTR Death Anniversary : న్యూ జెర్సీలో ఎన్టీఆర్ వర్ధంతి..

    NTR Death Anniversary : శక పురుషుడు నందమూరి తారక రామారావు...

    Our Rituals : మన ఆచార వ్యవహారాలకు పెద్ద పీట వేసేవారెవరో తెలుసా?

    Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన...