27.6 C
India
Sunday, October 13, 2024
More

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Date:

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావును అధికారం నుంచి అక్రమంగా తొలగించారని, ఆయన్ని వెంటనే తిరిగి ముఖ్యమంత్రిని చేయాలని కోరుతూ ఆ ఉద్యమం మొదలయింది.

    ఎన్టీఆర్ ని సమర్ధిస్తున్న టీడీపీ సభ్యులతోపాటు మిత్ర పక్షాలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా హైదరాబాదు, ముషీరాబాద్ లోని రామకృష్ణా స్టుడియోలో బస చేస్తున్నారు. అందులోకి పోవాలన్నా, బయటకి రావాలన్నా బోలెడన్ని ఆంక్షలు ఉండేవి. అయితే విలేకరులు మాత్రం తమ గుర్తింపు కార్డులు చూపించి వెళ్ళే వెసులుబాటు వుండేది. ఇక రేడియో విలేకరిగా నేను దాదాపు ప్రతిరోజూ వెళ్లి వస్తుండేవాడిని.
    ఒకరోజు నాతోపాటు మిత్రుడు జ్వాలా నరసింహారావు, మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు కూడా వచ్చారు.

    లోపలకు వెళ్ళాము. స్టూడియో అంతా సందడిగా వుంది. ఎమ్మెల్యేలు పేపర్లు చదువుతూ, పచార్లు చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్నారు. చంద్రబాబునాయుడు కూడా హడావిడిగా తిరుగుతూ పైనుంచి అన్నీ కనుక్కుంటూ వున్నారు. ఆయన్ని పలకరించి, ఖమ్మం సీపీఎం ఎమ్మెల్యే మంచికంటి రాంకిషన్ రావు గారి వద్దకు వెళ్ళాము. మాకు బంధువు కూడా. ఆయన కాస్త దిగులుగా కనిపించారు. భార్యకు ఒంట్లో నలతగా వున్నట్టు ఇంటి నుంచి కబురు వచ్చినట్టు వుంది.

    ఆయన మాతో చెప్పారు. “రామారావు గారితో విషయం చెప్పి ఓ రెండు రోజులు ఖమ్మం వెళ్లి వద్దామని వారి దగ్గరకు వెళ్లాను. మా ఆవిడ సుస్తీ సంగతి చెప్పాను. ఆయన ఇలా అన్నారు. ‘రాం కిషన్ రావు గారు, మీరు పెద్దవారు. మీకు చెప్పదగిన వాడిని కాను. కానీ నా విషయం తీసుకోండి. మా ఆవిడ (శ్రీమతి బసవ తారకం) మద్రాసు కేన్సర్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య వుంది. అయినా నేను వెళ్ళలేని పరిస్తితి. పెద్ద మనసుతో కాస్త అర్ధం చేసుకోండి’ అని ఆ పెద్దమనిషి అంటుంటే ఇక నేనేమి మాట్లాడను?”
    మేమూ మాట్లాడలేని పరిస్థితి.

    అలాంటి రామారావు గారు మరణించిన రోజు జనవరి 18. అందుకే ఆయన్ను గుర్తు చేసుకుందాం..

    భండారు శ్రీనివాసరావు
    భండారు శ్రీనివాసరావు

    Share post:

    More like this
    Related

    Amaravathi: ఏపీ పన్నుల చీఫ్ కమిషనర్ గా బాబు.ఎ

    Amaravathi: ఏపీ రాష్ట్ర పన్నుల చీప్ కమిసనర్ గా బాబు.ఎ నియమితులయ్యారు....

    CM Chandrababu: పండగల పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత: సీఎం చంద్రబాబు

    CM Chandrababu: పండగ పవిత్రతను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని సీఎం...

    Ratantata : ముమ్మాటికీ నువ్వు చేసింది తప్పే రతన్ టాటా

    Ratantata : పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా తీవ్ర అస్వస్థతతో 86...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR Costly Watch : ఎన్టీఆర్ దగ్గర మూడు కోట్ల విలువైన లగ్జరీ ఐటెమ్.. ఏంటంటే?

    NTR Costly Watch: సినీ పరిశ్రమలో స్టార్ హీరోల జీవితాలు లగ్జరీగా...

    1983 Mahanadu : దేశ రాజకీయాల్లో సంచలనం ‘1983 మహానాడు’.. ఎన్టీఆర్ పిలుపుతో హేమాహేమీలంతా ఒక్కచోటకు

    1983 Mahanadu : తెలుగోడి తెగువను ప్రపంచానికి చాటారు అన్న ఎన్టీఆర్....

    Sr. NTR : ఎన్టీఆర్ చరితం చిరస్మరణీయం..

    Sr. NTR : ఎన్టీఆర్ తెలుగు ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిన మహనీయుడు....

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...