33.2 C
India
Saturday, May 4, 2024
More

    NTR Vardhanthi : యుగానికొక్కడు.. తెలుగు జిలుగు.. నందమూరి తారకరాముడు

    Date:

    NTR Vardhanthi
    NTR Vardhanthi
    • అభినయవేత్త
    • ఇవాళ మన తెలుగు జిలుగు నందమూరి తారకరామారావు వర్ధంతి. ఈ‌‌ సందర్భంగా ఆయన గుఱించి‌ నెమరు వేసుకుందాం. రండి…

    ఎన్.టి. ఆర్‌‌. ఒక  ఇంద్రజాలికమైన పేరు. తెలుగులో ఎంతో కదిలిన పేరు తెలుగును ఎంతో కదిలించిన‌ పేరు. మనలో మెదులుతూ ఉన్న పేరు.

    నందమూరి‌ తారక‌ రామారావు‌ పూర్తి‌ పేరు‌ నందమూరి తారక‌ రామారావు‌ చౌదరి.

    భారత దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఇంత‌ ప్రతిభ ఉన్న చలనచిత్ర నటుడు మఱొకరు‌ ఉండరేమో? ఆయన నటనలో చూపిన వైవిధ్యం మఱే నటుడూ ప్రదర్శించలేదు. ‘రామారావు‌ ఒక అభినయవేత్త’.

    పౌరాణికాలు మాత్రమే కాదు సాంఘీకాలలో కూడా రామారావు అంతర్జాతీయ స్థాయి నటనను ప్రదర్శించారు. వివాహబంధం, పిచ్చి పుల్లయ్య , షావుకారు, చిరంజీవులు వంటి సినిమాలు అందుకు తార్కాణం. రాజు పేద సినిమాలో ఆయన పోషించిన భిక్షగాడి పాత్ర మఱెవ్వరూ ఆయనలా చెయ్యలేరు‌. తమిళ్ష్ నటుడు ఎం.జి.రామచంద్రన్‌కు
    ఈ పాత్ర బాగా ఇష్టమట.

    “పాత్రధారి” అంటారు కదా? రామారావు పాత్రధారి. ధరించిన పాత్రలను ఆయన అమోఘంగా పోషించారు.

    ఆహార్యం, వాచికం, ఆంగికం,‌ అభినయం- ఒక‌‌‌ నటుడికి కావాల్సినవి. ఆహార్యం (make up) నటుడికి ఇతరులు చేస్తారు.
    వాచికం- రామారావు ప్రదర్శించిన వాచికం ఎంతో గొప్పది. మల్లిశ్వరి, పాతాళ భైరవి, పిచ్చిపుల్లయ్య వంటి చిత్రాలలో ఆయన వాచికం ఎంతటి ప్రతిభావంతమైందో మనం తెలుసుకోవచ్చు. కళ్లు మూసుకుని విన్నా ఆయన వాచికంవల్ల ఆ సన్నివేశమూ, భావమూ‌ దృశ్య‌ రూపంగా మనకు కనిపిస్తాయి. ఇంక ఆంగికం‌- బీదపాత్రలు చేసినా, పౌరాణికాలు చేసినా ఆయన ఆంగీకంవల్ల ఆ పాత్రలు ప్రత్యేకతను‌ సంతరించుకున్నాయి. కృష్ణదేవరాయలు‌‌ పాత్రను కన్నడంలో రాజ్ కుమార్‌ అన్న గొప్ప నటుడు చాల బాగా చేశారు. కానీ తన ఆంగీకం, వాచికాల వల్ల ఆ పాత్రలో‌ రామారావు మెఱుగ్గా మెఱుస్తారు. కృష్ణ‌ దేవరాయలు పాత్రకు రామారావు సమకూర్చిన గాంభీర్యాన్ని మఱొకరు తీసుకు రాలేకపోయారు.

    గాంభీర్యం అంటే రామారావు. హిందీ పృధ్వీరాజ్ కపూర్, మన ఎస్.వి. రంగారావులు ఈ‌ గాంభీర్యం‌ విషయంలో‌ రామారావుకు సాటి రాగలరు. సత్య హరశ్చంద్ర , బడిపంతులు పాత్రలలో రామారావు చూపిన సాత్వికత, దైన్యత చాల మేలైనవి.

    దేవదాసు పాత్ర నాగేశ్వరరావు చాలా గొప్పగా చేశారు. అందఱికీ తెలిసిందే. రామారావు అలాంటి పాత్రను‌ చిరంజీవులు సినిమాలో‌ చేశారు. ఆ పాత్ర ధారణ అనితరసాధ్యం, అద్వితీయం.

    కృష్ణుడి పాత్ర అంటే రామారావు. ఇది మామూలుగా అందఱికీ‌ తెలిసిందే. కానీ‌ రామారావుకు కృష్ణుడు పాత్ర సహజంగా అమరింది కాదు. ఆయన సాధించుకున్నది. తన శారీరిక‌ దోషాలకు అతీతంగా,‌ తన సహజ‌ గాత్ర‌ ధర్మానికి అతీతంగా తన మేధతో తన ఆలోచనా సరళితో సాధించుకున్న ఘనత కృష్ణుడి పాత్ర. కృష్ణుడు‌ పాత్ర ధారణే రామారావు‌ మహోన్నత‌‌మైన నటుడు అన్నదానికి‌ సరైన ఋజువు.

    అదే విధంగా రాముడి పాత్ర. మన దేశంలో రాముడి‌‌ పాత్రను‌ ప్రేమ్ అదీబ్ (హిందీ చిత్రాలు‌ – భరత్ మిలాప్. రామరాజ్య) రామారావుకు ముందు చాల గొప్పగా పోషించారు. రామారావు ఆ రాముడి‌‌ పాత్రను‌ తనదిగా‌ చేసుకున్నారు.

    రాముడిగా చేసిన‌ రామారావు‌ రావణుడిగా చెయ్యడం అదీ సీతారామ కళ్యాణంలో ఉన్నతంగా‌ చెయ్యడం ఒక‌ అద్భుతం. ఎన్నో‌ ప్రత్యేకతలను‌‌‌ నిబిడీకృతం‌ చేసుకుని రావణుడి‌ పాత్రను చేశారు‌ రామారావు. ముఖ్యంగా‌ పేగులతో వీణ వాయించే‌ సన్నివేశం నభూతో న భవిష్యతి. ఆయన రావణుడి‌ పాత్రలో ప్రదర్శించిన క్రౌర్యం, భక్తి అపూర్వం.

    కృష్ణుడుగా చేసిన ఆయన దుర్యోధనుడిగా చేశారు. శ్రీ కృష్ణ పాండవీయం సినిమాలో దుర్యోధనుడు గా రామారావు‌ చేసింది విశిష్టమైంది. ఇక‌ కర్ణుడిగానూ రామారావు చేసింది ఉత్తమమైంది. కర్ణుడి‌ పాత్రను అంతకు ముందు తమిళ్‌లో శివాజి‌ గణేసన్ చేశారు. కానీ రామారావు‌ ఆ పాత్ర చెయ్యడం ఎంతో ఉత్తమంగా ఉంటుంది. శివాజీ గణేసన్ కర్ణుడుగా చేసిన తమిళ సినిమాలో రామారావు కృష్ణుడుగా చేశారు. అందులో రామారావు పాత్ర నిడివి చాల తక్కువగా ఉంటుంది. ఆ సినిమాను చూస్తూ‌‌ శివాజీ గణేసన్ ” నాకళ్లు కూడా రామారావునే చూస్తున్నాయి. ఆయన‌ ముందు నేను నాకే కనిపించడంలేదు” అన్నారు. తమిళ్లో శివాజీ గణేసన్ చేసిన గుడిగంటలు, కలిసి ఉంటే కలదు సుఖం, రక్తసంబంధం సినిమాల్లోని పాత్రలు ఆయనకన్నా రామారావు తెలుగులో మేలుగా చేశారు. దిలీప్ కుమార్ సైతం గుడిగంటలులో రామారావు నటనకు తులతూగలేకపోయారు.

    రామారావు‌ screen presense చాల గొప్పది. దిలీప్ కుమార్, కన్నడ రాజ్ కుమార్, ఎస్.వి. రంగారావు, ముమ్ముట్టి. అమితాబ్ బచన్, రజనీకాంత్, మోహన్ లాల్ లకు మాత్రమే అలాంటి, అంతటి‌ screen presense ఉంది. ‘చలనచిత్ర నటన పరంగా రామారావు ఒక అద్భుతం’.

    మగతనం ఉట్టి పడే రామారావు నర్తనశాలలో‌ పేడి పాత్ర చెయ్యడం అదీ గొప్పగా చెయ్యడం ఇంకెక్కడా, ఇంకెవ్వరూ కనీసం ఊహించలేనిది. రామారావుకు మాత్రమే సాధ్యపడేది.

    డాక్టర్ ఆనంద్ సినిమాలో దుష్టత్వం ఉన్న పాత్రను చేశారు. ఒక నాయకుడిగా, దేవుళ్ల పాత్రల‌ నటుడిగా ప్రజాదరణ ఉన్న రామారావు డాక్టర్ ఆనంద్ లాంటి పాత్రలు చెయ్యడం పెద్ద సాహసం. ఆ పాత్రనూ గొప్పగా పోషించారు రామారావు.

    conceptualized performance and designed performance రామారావు‌ నటన. దిలీప్ కుమార్ తరువాత రామారావు దీన్ని సాధించి చూపించారు. రామారావు పాత్ర‌ పోషణలో‌ insight ఉంటుంది. “అలిగితివా సఖీ ప్రియా…” పాటలో “ప్రియురాలవనీ…” అని వచ్చిన చోట ఎదురుగా ఉన్న సత్యభామను చూపించకుండా చేతి‌‌ వేళ్లను కృష్ణుడు తన హృదయాన్ని తాకించి చూపుతాడు. సఖీ, ప్రియ హృదయంలో ఉన్నదన్న insight తో కృష్ణుడిగా ఎన్.టి.ఆర్ అభినయించారు. ఇలా ఇంకెన్నో ఉన్నాయి.

    portray లేదా పాత్రధారణలో‌ రామారావు చాల గొప్పవారు.

    రామారావు చివరి దశలో‌ చేసిన కవిసార్వభౌమ‌ శ్రీనాథ సినిమాలో‌ శ్రీనాథుడి‌ పాత్రను‌ అద్భుతంగా‌ portray చేశారు రామారావు.

    జనరంజకమైన నటుడవడం వల్ల రామారావు ఒక‌ మహోన్నతమైన నటుడు అన్నదీ, ప్రపంచ సినిమాలో
    ఒక‌ అరుదైన నటుడు అన్నదీ కొంత మరుగున పడిపోయింది. ఆయనకు వచ్చిన పేరు‌కన్నా ఆయన ఎంతో గొప్ప‌ నటుడు. రామారావు నటనా విస్తృతిపై, నటనా ప్రతిభపై పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉంది. ఆయన నటనా వైదుష్యం ప్రపంచానికి ఇంకా సరిగ్గా తెలియరాలేదు. ఆ పని జరగాలి.

    రామారావు గుఱించి కొన్ని‌:

    పుట్టిన తేది :
    1923.
    పుట్టిన చోటు :
    నిమ్మకూరు.
    వివాహం :
    1942.
    చదువు :
    బి.ఎ.
    ఎత్తు :
    5 ‘ 10
    తొలి దశ లో చేసినవి:
    పాలు అమ్మడం,
    పొగాకు వ్యాపారం,
    బొంబాయి లో సౌండ్ రికార్డింగ్‌‌ శిక్షణ,
    బొంబాయిలో మెస్‌‌‌ నడపడం
    తొలి మేకప్ మాన్ :
    మంగయ్య
    తొలి స్ట్యూడియో :
    శోభనాచల
    తొలిసారి కెమెరా అనుభవం :
    మనదేశం‌ సినిమా ‌‌‌‌
    తొలి పాత్ర :
    సబ్ ఇన్ స్పెక్టర్
    తొలి సినిమా రాబడి:
    1116
    తొలి దర్శకుడు:
    ఎల్.వి. ప్రసాద్
    తొలిసారి కథానాయకుడి పాత్ర: పల్లెటూరి పిల్ల
    తొలి‌ నాయిక :
    అంజలి‌ దేవి
    తొలి సారి కృష్ణుడి పాత్ర:
    ఇద్దరు‌ పెళ్ళాలు
    తొలిసారి రాముడి పాత్ర:
    చరణదాసి. ‌‌‌‌‌‌‌‌ ‌‌‌ ‌
    తొలి రావణ పాత్ర :
    భూకైలాస్
    తొలి‌‌ శివుడి పాత్ర :
    దక్షయజ్ఞం

    అద్భుతమైన నటనా వ్యక్తిత్వం. విస్తారమైన, విపులమైన‌ నటనా ప్రావీణ్యం నందమూరి తారకరామారావు.

    ఆయన గుఱించి చెప్పటానికి ఇంకా ఉంటుంది …

     

     

     

     

    -రోచిష్మాన్
    94440 12279
    అంతర్జాతీయ కవి, విశ్లేషకుడు, కాలమిస్ట్

    Share post:

    More like this
    Related

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సైడ్ డ్యాన్సర్.. టాలీవుడ్ నే ఏలిందిగా.. ఏవరా బ్యూటీ

    7/G Brindavan Colony : 7/జి బృందావన్ కాలనీ సినిమాలో సైడ్...

    BRS MLC : బీఆర్‌ఎస్ కు మరో బిగ్ షాక్.. ఎమ్మెల్సీ ఎన్నిక రద్దు చేసిన హై కోర్టు..

    BRS MLC : భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్‌)కి ఎదురుదెబ్బ తగిలింది....

    Chandrababu : 2047 వరకు ఇండియా ఇలా ఉండబోతుంది.. చంద్రబాబు ప్రిడిక్షన్ వింటే గూస్ బంబ్స్ గ్యారెంటీ!

    Chandrababu : భారత్ భవిష్యత్ లో ఎలా ఉండబోతోందో చంద్రబాబు నాయుడు...

    Perni Kittu : పేర్ని కిట్టుపై హత్యాయత్నం కేసు నమోదు

    Perni Kittu : మచిలీపట్నం వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నేత ఎన్టీఆర్

    NTR : తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలిపిన నాయకుడు ఎన్టీఆర్. రాజకీయాలకు కొత్త...

    Bhandaru Srinivasa Rao : జనవరి 18, ఈ తేదీ ప్రాధాన్యత గుర్తుందా! – భండారు శ్రీనివాసరావు

    Bhandaru Srinivasa Rao : ఉమ్మడి రాష్ట్రంలో ప్రజాస్వామ్య ఉద్యమం సాగుతున్నరోజులు. ముఖ్యమంత్రి...

    Nandamuri Taraka Rama Rao : రాష్ట్రపతులతో అన్నగారి కుటుంబం.. అప్పుడు.. ఇప్పుడు..

    Nandamuri Taraka Rama Rao : తెలుగు తేజం, అన్న నందమూరి...

    RRR combo : అప్పట్లోనే ‘ఆర్ఆర్ఆర్’ కాంబో.. ఎవరెవరో తెలుసా.. వీడియో వైరల్!

    RRR combo : ఆర్ఆర్ఆర్ కాంబో.. ఈ కాంబో గురించి ఈ...