Our Rituals : మనం ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తాం. మన కట్టుబాట్లు పాశ్చాత్యులకు సైతం నచ్చుతాయి. కాకపోతే మనమే మన ఆచార వ్యవహారాలను మరచిపోతున్నాం. సంప్రదాయాలకు టాటా చెబుతున్నాం. పరాయి వారి అలవాట్లకు బానిసలు అవుతున్నాం. ఫలితంగా మన సనాతన సంప్రదాయాలను పాటించడం లేదు. దీంతో పలు నష్టాలు సైతం వస్తున్నాయి.
మన తెలుగువాడైన పీవీ నరసింహారావు సంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు. ఆయన మన ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అప్పుడు 1972వ సంవత్సరంలో పీవీ నరసింహారావు మద్రాసు వెళ్లినప్పుడు మన తెలుగు నటుడు ఎన్టీ రామారావు వారి ఇంటికి భోజనానికి రావాలని పీవీని కోరారట. దీంతో అందుకు ఆయన సమ్మతించి వారి ఇంటికి భోజనానికి వెళ్లారట.
తమిళ రాజకీయాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్న ఎంజీ రామచంద్రన్ ను కూడా ఆహ్వానించారట. దీంతో ముగ్గురు కలిసి చాప మీద కూర్చుని భోజనం చేసిన ఫొటో ఇప్పుడు వైరల్ అవుతోంది. అంత పెద్ద హోదాలో ఉండి కూడా పీవీ నేల మీద కూర్చుని భోజనం చేయడం గమనార్హం. ఇప్పుడు మనం దర్జా కోసం డైనింగ్ టేబుల్ మీదే కూర్చుని భోజనాలు చేస్తున్నాం. కానీ కింద కూర్చుని తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదనే విషయం చాలా మందికి తెలియదు.
మన ఆరోగ్యం కోసం కింద కూర్చుని భోజనం చేయడం ఎంతో ఉత్తమం. ప్రస్తుతం అందరు కింద కూర్చోవడానికి ఇష్టపడటం లేదు. అదేదో పెద్ద తప్పుగా చూస్తున్నారు. పూర్వం రోజుల్లో కింద కూర్చుని అరటాకులో భోజనం చేసేవారు. కాలక్రమంలో మన అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. మన పూర్వ కాలం నాటి ఆచారాలను పాటించడం వల్ల మనకు లాభాలు ఉంటాయి.