హైదరాబాద్ మహానగరంలో సోనూ సూద్ పేరిట అతిపెద్ద మండి ప్రారంభం కానుంది. మరో విశేషం ఏంటంటే…… ఈ గిస్మత్ జైల్ మండి ప్రారంభోత్సవ కార్యక్రమం సోనూ సూద్ చేతుల మీదుగా జరుగనుండటం విశేషం. హైదరాబాద్ లోని కొండాపూర్ లో ఈ అతిపెద్ద జైల్ మండి ప్రారంభం అవుతోంది. ఫిబ్రవరి 18 న సోనూ సూద్ చేతుల మీదుగా లాంచింగ్ కు అన్ని రకాల ఏర్పాట్లు చేశారు నిర్వాహకులు.
కరోనా మహమ్మారి సమయంలో సోనూ సూద్ తన సేవా కార్యక్రమాలతో తిరుగులేని హీరో ఇమేజ్ సొంతం చేసుకున్నారు. సహాయం అడిగిన వాళ్లకు , అడగని వాళ్లకు నో అని చెప్పకుండా అందరికీ సహాయం అందించారు సోనూ సూద్. దాంతో దేశ వ్యాప్తంగా సోనూ సూద్ కు ఎనలేని పేరు ప్రఖ్యాతులు లభించాయి. దాంతో దేశ వ్యాప్తంగా సోనూ సూద్ పేరిట పలు షాప్ లు వెలుస్తున్నాయి. అందులో భాగంగానే హైదరాబాద్ లోని కొండాపూర్ లో కూడా గిస్మత్ జైల్ మండి ప్రారంభం అవుతోంది.