Home EXCLUSIVE USA News : అమెరికా ప్రజల భయం అదేనట?

USA News : అమెరికా ప్రజల భయం అదేనట?

7
USA News
USA News

USA News : అగ్ర రాజ్యం అమెరికా. అన్ని దేశాలకు పెద్దన్న పాత్ర పోషిస్తుంది. ప్రపంచ దేశాలను గాడిలో పెడుతోంది. కష్టాల్లో ఉన్న దేశాలను ఆదుకుంటుంది. భూకంపాలు, ఇతర వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ఆపన్న హస్తం అందిస్తుంది. ప్రపంచంలోనే పెద్దదైన ఆర్థిక వ్యవస్థ దాని సొంతం. దీంతో అమెరికా ఆదేశాలను అన్ని దేశాలు పాటించాల్సిందేనని హుకుం జారీ చేయడం మామూలే.

ఈనేపథ్యంలో అమెరికా ఓ విషయంలో భయపడుతోంది. అక్రమ వలసదారుల వల్ల అల్లాడిపోతోంది. అది మెక్సికో నుంచి కావొచ్చు. ఇతర దేశాల నుంచి కావచ్చు. దేశంలోకి అక్రమంగా చొరబడే వారి సంఖ్య ఎక్కువవుతోంది. ఈ క్రమంలో దేశంలోని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. తమ బతుకులు దుర్భరంగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దేశంలో దాదాపు 35 శాతం మంది అక్రమంగా వలస వచ్చిన వారేనట. ఇలా వచ్చిన వారి వల్ల అక్కడున్న వారి ఉపాధి అవకాశాలు దెబ్బతింటున్నాయి. నిరుద్యోగం కూడా సుమారు 32 శాతం పెరుగుతోంది. ఇతర దేశాల నుంచి వచ్చిన వారికే ఉద్యోగాలు వస్తుండటంతో ఆ దేశ వాసులు ఉపాధి అవకాశాలు దొరక్క తంటాలు పడుతున్నారట.

ఇలా దేశంలో కష్టాలు రావడానికి ఇతర దేశాల వారేననే బెంగ పట్టుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో వలస దారులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఏర్పడిందని చెబుతున్నారు. రాబోయే ఎన్నికల్లో ఇదే ప్రధాన ఎన్నికల అస్త్రంగా మారనుందని అంటున్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతున్న క్రమంలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని నిపుణుల అభిప్రాయం.