Home POLITICS ANDHRA PRADESH Visakhapatnam : విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం

Visakhapatnam : విశాఖలో రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడులకు ఘన స్వాగతం

12
Atchannaidu
Atchannaidu – Rammohan Naidu

Visakhapatnam : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, రాష్ట్రమంతి అచ్చన్నాయుడులకు విశాఖలో ఘన స్వాగతం లభించింది. ఈరోజు (సోమవారం) ఉదయం ప్రత్యేక విమానంలో వీరు విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరికి స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో టీడీపీ అభిమానులు, కార్యకర్తలు విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిని నియంత్రించలేక పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు,  అచ్చెన్నాయుడులకు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్ పోర్టు నుంచి శ్రీకాకుళం 200 కార్లు, 350 బైకులతో భారీ ర్యాలీగా వీరు వెళ్లారు.