Home POLITICS ANDHRA PRADESH Home Minister Vangalapudi Anitha : వారంలో టోల్ ఫ్రీ నెంబర్.. హోం మినిస్టర్ వంగలపూడి

Home Minister Vangalapudi Anitha : వారంలో టోల్ ఫ్రీ నెంబర్.. హోం మినిస్టర్ వంగలపూడి

15
Home Minister Vangalapudi Anitha
Home Minister Vangalapudi Anitha

Home Minister Vangalapudi Anitha : ఆంధ్రప్రదేశ్‌ హోం మినిస్టర్ గా చార్జి తీసుకున్న వంగలపూడి అనిత శాఖ అధికారులను పరుగులు పెట్టిస్తున్నారు. పోలీసు శాఖలోని ఉన్నతాధికారులతో సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఏపీ పోలీసులకు సంబంధించి బర్నింగ్ టాపిక్‌ను ప్రస్తావించారు. ముఖ్యంగా తమ హయాంలో వైసీపీకి అనుకూలంగా పనిచేసిన పోలీసు అధికారులకు ఆమె మౌఖిక హెచ్చరిక చేశారు.

ముఖ్యంగా కొంతమంది పోలీస్ అధికారులు వైసీపీ ఆదేశానుసారం పనిచేశారని, గతంలో అనేక సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని అనిత ఎత్తిచూపారు. వారి పట్ల తీవ్ర పరిణామాలుంటాయని ఆమె హెచ్చరించారు. ఇప్పటికైనా జగన్ వైపు మొగ్గు చూపుతున్న అధికారులు వెంటనే తమ పదవులను వదులుకోవాలని కొత్త హోంమంత్రి హెచ్చరించారు.

‘జగన్‌పై మీకు ఇంకా ప్రేమ ఉంటే పోలీసు విధులకు రాజీనామా చేసి వైసీపీ నేతలుగా పని చేయండి. నా హయాంలో రాజకీయ ఒరవడికి స్థానం లేదు. ఎల్లవేళలా శాంతి భద్రతలు కాపాడాలి. అని అనిత అన్నారు.

గత ఐదేళ్ల జగన్ పాలనలో టీడీపీ శ్రేణుల నుంచి వచ్చిన ప్రధాన ఫిర్యాదుల్లో ఒకటి టీడీపీ నాయకత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు పోలీసు బలగాలను దుర్వినియోగం చేయడం. వైసీపీ ఎమ్మెల్యేలు, నేతల ఆదేశానుసారం పలువురు పోలీసు అధికారులు పనిచేసి టీడీపీ వర్గాలను టార్గెట్ చేసినట్లు ఫిర్యాదులు వచ్చాయి.

ఇక రాష్ట్రంలో జగన్ పాలనలో విపరీతంగా స్మగ్లింగ్ చేసిన గంజాయిని పూర్తిగా అరికట్టాలని ఆమె పోలీసులను ఆదేశించారు. ప్రజల్లో కూడా అవేర్ నెస్ తెస్తే మరింత కట్టడి చేయవచ్చని భావించిన హోం మినిస్టర్ ప్రజల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. గంజాయి ఎక్కడ కనిపించినా సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు.