Home EXCLUSIVE Guava Leaves : జామ ఆకులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి తెలుసా?

Guava Leaves : జామ ఆకులోనూ ఎన్నో ఔషధ గుణాలున్నాయి తెలుసా?

52
Guava Leaves
Guava Leaves
Guava Leaves
Guava Leaves

Guava Leaves : మనకు లభించే పండ్లలో జామ ఎంతో ముఖ్యమైనది. ఇందులో ఉండే పోషకాల వల్ల ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఈ నేపథ్యంలో జామ పండుతో పాటు దాని ఆకులు కూడా మనకు మందులా ఉపయోగపడుతాయి. జామపండులో ఉండే బలం అలాంటిది. ఇలా ఇది మన ఆరోగ్య పరిరక్షణలో ఎంతో సాయపడుతుంది. ఈ క్రమంలో జామ పండును తింటే మనకు చాలా లాభం ఉంటుంది.

నోటిలో పుళ్లు, నోటిపూత, చిగుళ్ల వాపు, గొంతు నొప్పి వంటి వాటిని జామ ఆకులు దూరం చేస్తాయి. దీని ఆకులను నీటిలో వేసి మరిగించి ఆ నీటితో పుక్కిలించిన ఈ సమస్యలు లేకుండా పోతాయి. రెండు మూడు జామ ఆకులు నీటిలో వేసి మరిగించి తరువాత వాటిని తీసివేసి ఆ నీటిని తాగడం వల్ల్ జలుబు సంబంధిత సమస్యలు తగ్గుతాయి. దీంతో క్యాన్సర్ వంటి వ్యాధులు రాకుండా పోతాయి.

జామ ఆకుల కషాయం తీసుకోవడం వల్ల నడుం నొప్పి మాయమవుతుంది. నిద్రలేమితో బాధపడే వారు ఈ కషాయం తాగితే మంచి నిద్ర పడుతుంది. నిద్ర లేమి సమస్యను దూరం చేస్తుంది. ఇలా జామ ఆకులతో మనకు ఎన్నో ఉపయోగాలున్నాయి. క్యాన్సర్ ను కూడా నియంత్రణలో ఉంచుతుంది. జీర్ణ వ్యవస్థ పనితీరు బాగుండేలా చేస్తుంది. శరీర భాగాలకు రక్తప్రసరణ బాగుండేలా చేస్తుంది.

గుండె సంబంధిత రోగాలకు కూడా చెక్ పెడుతుంది. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. దీంతో అవయవాలకు రక్తప్రసరణ సాఫీగా జరిగేలా చేస్తుంది. ఈ నేపథ్యంలో జామ ఆకుల కషాయం మన ఎన్నో రకాల రోగాలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇలా జామ ఆకులతో మనకు కలిగే లాభాలు చాలా ఉన్నాయి.