కాంగ్రెస్ పార్టీలో లొల్లి ఆగడం లేదు. అధికారానికి దూరమైనప్పటికి అసంతృప్తికి , అసమ్మతికి ఎక్కడా తగ్గేదేలే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. రేపు గాంధీభవన్ లో ఒకరోజు శిక్షణా శిబిరం నిర్వహిస్తున్నారు. కాగా ఆ సమావేశానికి అసమ్మతి నేతలు హాజరౌతారా ? లేదా ? అనే సంగదిక్తత నెలకొంది. దాంతో అసమ్మతి నేతలకు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేసి హాజరు కావాలని కోరారు.
ఇక ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఈనెల 26 నుండి తెలంగాణ అంతటా పాదయాత్ర చేయాలని సన్నాహాలు చేసుకుంటున్నాడు. అయితే రేవంత్ రెడ్డి పాదయాత్రకు అధిష్టానం అనుమతి లేదని చెప్పి సంచలనం సృష్టించాడు అసమ్మతి నేత మహేశ్వర్ రెడ్డి. ఎవరి నియోజకవర్గంలో వాళ్ళు చేసుకోవచ్చు అంతేకాని రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని అధిష్టానం చెప్పలేదన్నాడు. అంతేకాదు అధిష్టానం 2 నెలలు మాత్రమే పాదయాత్ర చేయాలని చెప్పిందని , కానీ రేవంత్ రెడ్డి 5 నెలల పాటు పాదయాత్ర చేయాలని చూస్తున్నాడని , అధిష్టానం అనుమతి ఇస్తే అందరం కలిసి పాల్గొంటామని మీడియా ముందుకు వచ్చాడు మహేశ్వర్ రెడ్డి. దాంతో మరోసారి కాంగ్రెస్ లో కల్లోలం మొదలయ్యింది…… అసమ్మతి రాజుకున్నట్లయింది.