Home POLITICS TELANGANA 25 ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దంటున్న ఎర్రబెల్లి

25 ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వొద్దంటున్న ఎర్రబెల్లి

138
minister errabelli dayakar rao sensational comments on BRS
minister errabelli dayakar rao sensational comments on BRS
minister errabelli dayakar rao sensational comments on BRS
minister errabelli dayakar rao sensational comments on BRS

తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసాడు. BRS కు చెందిన 25 మంది ఎమ్మెల్యే లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని , వాళ్ళను మారిస్తే మళ్ళీ వచ్చే ఎన్నికల్లో తప్పకుండా  100 సీట్లు గెలుచుకుంటామని వ్యాఖ్యానించి సంచలనం సృష్టించాడు. రాజకీయ వర్గాల్లో ఎర్రబెల్లి దయాకర్ రావు వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.

తెలంగాణ ప్రజల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పట్ల పూర్తి నమ్మకం ఉందని , అయితే మా ఎమ్మెల్యేలలో కనీసం 25 మంది ఎమ్మెల్యేలపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వాళ్ళను మార్చకపోతే 90 సీట్లు గెలుస్తాం ……. మార్చితే 100 సీట్లు గెలుస్తాం అంటూ వ్యాఖ్యానించాడు. ఎర్రబెల్లి వ్యాఖ్యలతో కొంతమంది ఎమ్మెల్యేల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆ 25 మంది ఎమ్మెల్యేలు ఎవరు ? అనే చర్చ మొదలైంది అప్పుడే. నేను చేసిన సర్వే ప్రకారం ఇది తేలిందని , నా సర్వేలు ఎప్పుడూ తప్పు కాలేదని అంటున్నాడు ఎర్రబెల్లి.