39.1 C
India
Monday, May 20, 2024
More

    KTR : రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ సూచన.. ఇవి దగ్గరపెట్టుకోండి

    Date:

    KTR
    KTR

    KTR : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ ట్విటర్ (ఎక్స్) ద్వారా పలు సూచనలు చేశారు. 13 వ తారీఖు ఎలక్షన్స్ అయిపోయాక మీరు కొన్ని వస్తువులు దగ్గరగా ఉంచుకోవాల్సిన అవసరముందన్నారు. ఇన్వర్టర్, చార్జర్స్ బల్బ్ లు, పవర్ బ్యాంక్స్, జనరేటర్స్, క్యాండిల్స్, టార్చ్ లైట్లు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఎందుకంటే తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వమని బీఆర్ఎస్ గవర్నమెంట్ కాదని సూచించారు.

    రాష్ట్రంలోని ప్రజలందరూ ఈ విషయాన్ని ఫాలో కావాలని సూచనలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నుంచి బీఆర్ఎస్ నేతలు పవర్ కట్ అయితుందంటూ ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కేసీఆర్ తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు సందిస్తున్నారు. తెలంగాణలో ఒక్క నిమిషం కూడా కరెంట్ పోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం చర్యలు తీసుకుందని కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే కరెంట్ కోతలు వచ్చాయని ఆరోపిస్తుంది.

    తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ సర్కారు పాలనలో పూర్తిగా తెలంగాణలో గ్రామ గ్రామాన 24 గంటలు ఇచ్చామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎక్కడ కూడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపిస్తున్నారు. ఇది చేతకాని ప్రభుత్వ తీరుకు నిదర్శనమని దుమ్మెత్తిపోస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్ర స్థాయిలోనే స్పందిస్తుంది. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి దివాల తీయించారని, కరెంట్ కోతలు లేకున్నా.. కావాలనే కరెంట్ పోతుందంటూ విమర్శలు చేస్తున్నారని మండిపడుతున్నారు.

    కొంతమంది కావాలనే కరెంట్ కోతలు ఉన్నాయంటూ పుకార్లు సృష్టిస్తున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ట్విటర్ లో మాట్లాడే టిల్లుకు ఏం తెలుసని కౌంటర్లు ఇస్తున్నారు. పేద ప్రజల బాగోగులు చూడడానికే కాంగ్రెస్ ఉందని వివరిస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమైనా చేయడానికి సిద్ధమని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. మరి ట్విటర్ లో కేటీఆర్ చేసిన కామెంట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి రెస్పాన్స్ ఇస్తుందో చూడాలి.

    Share post:

    More like this
    Related

    Patanjali Soan Papdi : ‘సోన్ పాపిడీ’ కేసులో పతంజలి సిబ్బందికి ఆరు నెలల జైలు

    Patanjali Soan Papdi : యోగా గురువు బాబా రాందేవ్ కు...

    Balcony Baby Mother Suicide : ‘బాల్కనీ పసికందు’ తల్లి సూసైడ్.. సోషల్ మీడియా కాంమెట్లే కారణమా?

    Balcony Baby Mother Suicide : ఏప్రిల్ 28వ తేదీ తిరుముల్లైవాయల్‌లోని...

    Banglore Rave Party : బెంగళూరు లో రేవ్ పార్టీ తెలుగు మోడల్స్, నటీనటులు అరెస్టు?

    Banglore Rave Party : బెంగళూరులో రేవ్ పార్టీ లో తెలుగు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    BRS : వద్దన్నా వినలేదు..అందుకే రావట్లేదు

    BRS : వరంగల్, నల్లగొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం వాస్తవానికి ...

    Congress : కాంగ్రెస్ నాయకులకు సోకిన ఎన్నికల జ్వరం 

    Congress : తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ నాయకులకు పార్లమెంట్ ఎన్నికల జ్వరమే...

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలుస్తాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

    Kishan Reddy : రెండంకెల ఎంపీ స్థానాలు గెలిచి తెలంగాణలో బీజేపీ...

    KCR : కేంద్రంలో వచ్చేది ఆ ప్రభుత్వమే..: కేసీఆర్

    KCR : కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో బీఆర్ఎస్...