Home POLITICS ANDHRA PRADESH Chandrababu Sensational Decision : తెలంగాణలో పోటీ చేయడం లేదు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

Chandrababu Sensational Decision : తెలంగాణలో పోటీ చేయడం లేదు.. చంద్రబాబు సంచలన నిర్ణయం!

10
Chandrababu Sensational Decision
Chandrababu Sensational Decision

Chandrababu Sensational Decision : అనుకున్నదే అయింది.. షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి పోటీ చేస్తుందా? చేయదా? అన్న పెద్ద ప్రశ్నకు దాదాపు జవాబు దొరికినట్లయ్యింది. ముందు నుంచి తెలంగాణలో టీడీపీ పోటీ చేస్తుందని అందుకు అన్నీ సమకూర్చుకుంటుందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ చెప్తూ వచ్చారు. ఇప్పటికే దాదాపు 80కి పైగా దరఖాస్తులు ఉన్నాయని పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి అనుమతిస్తే వెంకటే ప్రకటించి ప్రచారం కూడా చేపడతామని చెప్పారు. అయితే చంద్రబాబుతో ములాఖాత్ తర్వాత పూర్తి క్లారిటీ వస్తుందని చెప్పారు.

తెలంగాణ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర అలజడి నెలకొంది. హైదరాబాద్ తో పాటు చాలా నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్నారు. వీరు టీడీపీని బాగా ఆదరిస్తున్నారని గత ఎన్నికల ఓటింగ్ చూస్తే అర్థం అవుతుంది. అయితే గతంలో టీడీపీ గెలవదని తెలిసినా ఓటు మాత్రం టీడీపీకే వేస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ సారి ఓటు ఎవరికి వేస్తారన్న ఆలోచనలో పడిపోయాయి ఇక్కడి బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు. గతంలో ఓటు ఎక్కువగా చీలి బీఆర్ఎస్ కు కిలిసిన వచ్చినట్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో కాసాని జ్ఞానేశ్వర్ తో ములాఖాత్ అయిన చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయవద్దని ఆదేశించినట్లు తెలుస్తుంది. ఈ సారి పరిస్థితుల దృష్ట్యా తెలంగాణ అసెంబ్లీకి పోటీ చేయలేమని, కానీ పార్లమెంట్ కు మాత్రం పోటీ చేసి తీరుతామని ఆయన జ్ఞానేశ్వర్ కు చెప్పినట్లు తెలుస్తోంది. ఏపీలో టీడీపీ+జనసేన పొత్తులో ఉన్నాయి. కాబట్టి జనసేన+బీజేపీతో తెలంగాణలో పొత్తుపెట్టుకుంటే సెటిలర్లు ఓట్లు బీజేపీ వైపు మళ్లే అవకాశం ఉంది. అందుకే చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

ఏది ఏమైనా చంద్రబాబు తెలంగాణలో పోటీ చేయకపోవడం పెద్ద వ్యూహంలాగే చూడాలని పొలిటిక్స్ అనలిస్ట్ లు భావిస్తున్నారు.