AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. రెండు ఎన్నికలకు కలిసే నిర్వహించేలా అధికారులు కూడా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్వే సంస్థలు ఫుల్ యాక్టివ్ అయ్యాయి. వారి సర్వేల్లో రోజు రోజుకు సంచలన విషయలు వెల్లడవుతున్నాయి. ఇందులో భాగంగా ‘పయనీర్ పోల్ స్ట్రాటజీస్’ అనే సంస్థ ఒక సర్వే నిర్వహించింది. దీని ఫలితాలను ఇటీవల విడుదల చేసింది.
ఫిబ్రవరి 15 నుంచి 29వ తేదీల మధ్య సర్వే కొనసాగింది. ఏపీలోని 175 నియోజకవర్గాల్లో 53,000 మంది అభిప్రాయాలను సేకరించింది. ఇందులో 54 శాతం పురుషులు, 46 శాతం మహిళలు వారి అభిప్రాయలను షేర్ చేసుకున్నారు. ఈ నేపథ్యలో వారు అభిప్రాయాలను పరిగణలోని తీసుకొని జిల్లాల వారీగా వెల్లడించింది. టీడీపీ+జనసేన కూటమి 51.4 శాతం ఓట్లతో 104 సీట్లను దక్కించుకుంటుందని స్పష్టం చేసింది. 42.6 శాతం ఓట్లతో వైసీపీ 49 సీట్లకే పరిమితం కానుందని వెల్లడైంది. ఇక, 22 నియోజకవర్గాల్లో పోటీ టఫ్ గా మారుతుందని చెప్పింది. ఎంపీ స్థానాలను పరిశీలిస్తే కూటమి 18, వైసీపీకి కేవలం 7 స్థానాలు మాత్రమే వస్తాయని పేర్కొంది.
పార్లమెంట్ ఫలితాలను కూడా వెల్లడించింది. శ్రీకాకుళం లోక్‌సభ స్థానానికి సంబంధించి శ్రీకాకుళం, టెక్కలి, ఇచ్చాపురం, పాతపట్నం ఆమదాలవలసలో టీడీపీ+జనసేన విజయం సాధిస్తుందని చెప్పింది. పలాసలో వైసీపీ గెలుస్తుందని, నరసన్నపేటలో ఫైట్ హోరా హోరీగా ఉంటుందని స్పష్టం చేసింది.
విజయనగరం లోక్‌సభ స్థానానికి సంబంధించి బొబ్బిలి, ఎచ్చెర్ల, విజయనగరంలో కూటమి, చీపురుపల్లి, గజపతినగరంలో వైసీపీ గెలుపొందే ఛాన్స్ కనిపిస్తుంది. రాజాం, నెల్లిమర్లలో టఫ్ ఫైట్ ఉంటుంది.
అరకు ఎంపీ స్థానం పరిధిలో అన్ని నియోజకవర్గాలు వైసీపీ తన ఖాతాలో వేసుకునే ఛాన్స్ ఉంది. పాలకొండ, పార్వతీపురం, కురుపాం, సాలూరు, రంపచోడవరంలో వైసీపీ గెలుస్తుంది. అరకు లోయ కూటమి గెలుచే ఛాన్స్ ఉంది. పాడేరులో గట్టి ఫైట్ ఉంటుంది.
విశాఖపట్నం ఎంపీ స్థానంలో అన్నింటిని కూటమి గెలుచుకోనుంది. విశాఖ నగరంలోని 4 నియోజకవర్గాలతో పాటు గాజువాక, భీమిలి, ఎస్ కోటలో టీడీపీ+జనసేన అభ్యర్థులు గెలవనున్నారు.
అనకాపల్లి ఎంపీ స్థానంలో చోడవరం, అనకాపల్లి, పెందుర్తి, యలమంచిలి, నర్సీపట్నం నియోజకవర్గాల పరిధిలో టీడీపీ+జనసేన అభ్యర్థులు గెలవనున్నారు. మాడుగులలో వైసీపీ గెలవనుంది. పాయకరావుపేటలో గట్టి ఫైట్ ఉండబోతోంది.
కాకినాడ ఎంపీ స్థానం పరిధిలో పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, జగ్గంపేటలో టీడీపీ+జనసేన కూటమి గెలుస్తుంది. తునిలో వైసిపి గెలిచే ఛాన్స్ ఉంది. ప్రత్తిపాడు లో ఫైట్ టఫ్ గా ఉంటుంది.
రాజమండ్రి ఎంపీ స్థానం పరిధిలో రాజమండ్రి సిటీ, రాజానగరం, రాజమండ్రి రూరల్, నిడదవోలు, గోపాలపురం నియోజకవర్గాల్లో కూటమి విజయం సాధిస్తుంది. అనపర్తి లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉంది. కొవ్వూరులో ఫైట్ నువ్వా నేనా అన్నట్లు ఉంటుంది.
అమలాపురం ఎంపీ స్థానంలో దాదాపు అన్ని స్థానాలు టీడీపీ+జనసేన విజయం సాధించే అవకాశం ఉంది. రామచంద్రపురంలో టఫ్ ఫైట్ ఉంటుంది. ముమ్మిడివరం, రాజోలు, అమలాపురం, పీ గన్నవరం, కొత్తపేట, మండపేటలో కూటమి ఏకపక్ష విజయాన్ని దక్కించుకోనుంది.
నరసాపురం ఎంపీ స్థానం పరిధిలో అచంట, నరసాపురం, రాజోలు, భీమవరం, తనుకు, ఉండి, తాడేపల్లిగూడెంలో కూటమి అభ్యర్థులు విజయం సాధించనున్నారు.
ఏలూరు.. ఎంపీ స్థానం పరిధిలో ఉంగటూరు, దెందులూరు, పోలవరం, చింతలపూడి, కైకలూరులో కూటమి గెలువనుంది. ఏలూరు, నూజివీడులో మాత్రం ఫైట్ గట్టిగా ఉంటుంది.
విజయవాడ స్థానం పరిధిలోని.. మైలవరం, జగ్గయ్యపేట, నందిగామ, విజయవాడ పశ్చిమ, తూర్పు, సెంట్రల్ నియోకవర్గాల్లో కూటమి, తిరువూరులో వైసీపీ అభ్యర్థి విజయం సాధించే అవకాశం ఉంది.
మచిలీపట్నం స్థానం పరిధిలో గన్నవరం, మచిలీపట్నం, పెడన, పెనమలూరు, అవనిగడ్డలో కూటమి అభ్యర్థులు.. గుడివాడలో మాత్రం వైసీపీ విజయం సాధిస్తారు. పామర్రులో గట్టి ఫైట్ ఉంటుంది.
గుంటూరు ఎంపీ స్థానం పరిధిలో అన్ని నియోజకవర్గాలను కూటమి కైవసం చేసుకుంటుంది. తాడికొండ మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, తెనాలి, గుంటూరు తూర్పు, గుంటూరు పశ్చిమలో కూటమి గెలుస్తుంది.
నరసరావుపేటలో పెదకూరపాడు, సత్తెనపల్లి, చిలకలూరిపేట, వినుకొండలో కూటమి గెలుస్తుంది. నరసరావుపేట, మాచర్ల, గురజాలలో ఫైట్ ఉంటుంది.
బాపట్ల పరిధిలో వేమూరు, పర్చూరు, రేపల్లె, అద్దంకి, చీరాల్లో కూటమి విజయం సాధించ్చు. బాపట్లలో వైసీపీ విజయం ఖాయం. సంతనూతలపాడులో ఫైట్ ఉంటుంది.
ఒంగోలు పరిధిలో దర్శి, మార్కాపురం, ఒంగోలు, గిద్దలూరు, కనిగిరిలో కూటమి అభ్యర్థులు గెలుపొందుతారు.. ఎర్రగొండపాలెంలో మాత్రం ఫైట్ టప్ గా ఉంటుంది.
నెల్లూరులో పరిధిలో కావలి, నెల్లూరు సిటీ, ఆత్మకూరు, నెల్లూరు రూరల్ లో కూటమి, కందుకూరు, ఉదయగిరిలో వైసీపీ విజయం సాధించవచ్చు. కోవూరులో గట్టి ఫైట్ ఉంటుంది.
తిరుపతి స్థానం పరిధిలో సర్వేపల్లి, సూళ్లూరుపేట, గూడూరు, వెంకటగిరి, సత్యవేడులో వైసీపీ వివజయం సాధించే ఛాన్స్ ఉంది. తిరుపతి, శ్రీ కాళహస్తిలో కూటమి విజయం సాధిస్తుంది.
చిత్తూరు ఎంపీ స్థానం పరిధిలో చంద్రగిరి, జీడీ నెల్లూరు, పూతలపట్టులో వైసీపీ.. నగరి, కుప్పం, పనమలేరులో కూటమి గెలుపొందుతుంది. చిత్తూరులో ఫైట్ గట్టిగా ఉంటుంది.
రాజంపేట పరిధిలో రాజంపేట, కోడూరు, రాయచోటి, పుంగనూరు, మదనపల్లిలో వైసీపీ, పీలేరు, తంబళ్లపల్లెలో కూటమి విజయం సాధిస్తుంది.
కడప పరిధిలో అన్ని నియోజకవర్గాలను వైసీపీ గెలుచుకుంటుంది. బద్వేలు కడప, పులివెందుల, జమ్మలమడుగు, కమలాపురం, మైదుకూరు, ప్రొద్దుటూరులో వైసీపీ అభ్యర్థులే విజయం సాధిస్తారు.
నంద్యాల స్థానంలోని ఆళ్లగడ్డ, నందికొట్కూరు, శ్రీశైలం, పాణ్యం, బనగానపల్లె, డోన్లలో వైసీపీ విజయం సాధిస్తుంది. నంద్యాలలో మాత్రం ఫైట్ గట్టిగా ఉంటుంది.
కర్నూలు ఎంపీ స్థానం పరిధిలో పత్తికొండ, ఎమ్మిగనూరు, కోడుమూరు, ఆదోని, ఆలూరులో వైసీపీ విజయం సాధిస్తుంది. మంత్రాలయంలో మాత్రం కూటమి గెలుస్తుంది.
అనంతపూర్ లో రాయదుర్గం, గుంతకల్లు, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం, కళ్యాణదుర్గంలో కూటమి విజయం సాధిస్తుంది. సింగనమలలో వైసీపీ విజయం సాధిస్తుంది.
హిందూపురం పార్లమెంట్ స్థానం పరిధిలో హిందూపురం, రాప్తాడు, పెనుకొండ, కదిరి, ధర్మవరంలో కూటమి గెలుస్తుంది. మడకశిరను మాత్రం వైసీపీ దక్కించుకుంటుంది. పుట్టపర్తిలో మాత్రం గట్టి ఫైట్ ఉంటుంది.