33.2 C
India
Sunday, May 19, 2024
More
    Home Blog Page 4

    Tirumala Ghat Road : తిరుమల ఘాట్ రోడ్డులో తప్పిన ప్రమాదం

    Tirumala Ghat Road
    Tirumala Ghat Road

    Tirumala Ghat Road : తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో పెను ప్రమాదం తప్పింది. వాహనం అదుపు తప్పి చెట్టును ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పదిమంది భక్తులకు గాయాలయ్యాయి. స్వామివారి దర్శనం అనంతరం తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. తిరుమల నుండి తిరుపతికి వెళ్లే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసలు, విజిలెన్స్ సిబ్బంది ట్రాఫిక్ ను క్రమబద్ధీకరించారు.

    క్షతగాత్రులను 108 వాహనంలో తిరుపతిలోని రుయా హాస్పిటల్ కు తరలించగా చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో తేలకపాటి వర్షం కురుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడ్డ భక్తులు తమిళనాడుకు చెందినవారు. పదిమందికి స్వల్ప గాయాలు కావడంతో అంతా ఊపిరిపల్చుకున్నారు.

    AP Attacks : కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక..ఆ పార్టీ ఓడిపోతుందనే ప్రచారంతోనే దాడులు..

    Central Intelligence Agency
    AP Attacks

    AP Attacks : ఏపీలో ఎన్నికలు పూర్తయ్యే వరకు సుద్దపూసల్లాగా నీతులు పలికిన నేతలు ఎన్నికలు పూర్తికాగానే తమ అసలు స్వరూపాన్ని బయటకు తెస్తున్నారు. అల్లర్లు, దాడులు, విధ్వంసంతో ఏపీలో అరాచకం సాగుతోంది. ఇప్పుడే ఇలా ఉంటే ఎన్నికల ఫలితాల రోజున ఎలా ఉంటుందోనని ప్రజలు వణికిపోతున్నారు. కాగా, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా దాడులు జరిగే అవకాశం ఉందన్న కేంద్ర నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇంటెలిజెన్స్ వర్గాల హెచ్చరికలు వైసీపీ ఓటమి ఖాయమని జరుగుతున్న ప్రచారమే దీనికి కారణమా? అని ప్రజాస్వామికవాదులు ప్రశ్నిస్తున్నారు.

    అయితే కేంద్ర నిఘా వర్గాలు వైసీపీ ఓడిపోతుందనో, కూటమి అధికారం చేపడుతుందనో స్పష్టం చేయలేదు. కానీ ఎన్నికల ఫలితాల తర్వాత కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న హెచ్చరికలతో రాష్ట్రంలో ఎవరినీ విజయం వరిస్తుందనే విషయంపై రాజకీయ పండితులు ఒక అవగాహనకు వస్తున్నారు.

    ఇప్పటికే వైసీపీ నేతలు చాలా చోట్ల రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ తో పాటు రిగ్గింగ్ జరిగిందని ఆరోపణలు చేస్తుండడం వారిలో ఓటమి భయానికి సంకేతమనే అభిప్రాయాలు వినపడుతున్నాయి. తాజాగా కేంద్రం అల్లర్లు జరిగే అవకాశం ఉందని అప్రమత్తం చేసిందంటే.. వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని, ఆ ఓటమిని జీర్ణించుకోలేక ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు అల్లర్లకు తెగబడే చాన్స్ ఉందని హెచ్చరించి ఉండొచ్చని విశ్లేషణలు వస్తున్నాయి.

    అదే సమయంలో మరో వాదన కూడా వినిపిస్తోంది. వైసీపీ అధికారంలోకి వస్తుందని, ఆ తర్వాత టీడీపీ కార్యకర్తల అంతు చూద్దామనే భావనలో వైసీపీ శ్రేణులు ఉన్నాయని, అందుకే కేంద్ర నిఘా వర్గాలు ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఏపీలోని పలు ప్రాంతాల్లో దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించినట్టుగా మరికొందరు చెబుతున్నారు.

    Vijayashanthi-KCR : రాముల‌మ్మకు కేసీఆర్ గుర్తుకు వస్తున్నారా.. ఆ ట్వీట్ అర్థం ఏంటో?

    Vijayashanthi-KCR
    Vijayashanthi-KCR

    Vijayashanthi-KCR : బీఆర్ఎస్‌ పార్టీపై సినీ నటి, రాజకీయ నాయకురాలు  విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ ఇక ఉండదని అంటున్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అభిప్రాయం సమంజసం కాదన్నారు. ప్రాంతీయ భావోద్వేగాలు ప్రజా మనోభావాలను వారి ఆత్మాభిమానం వైపు నడిపిస్తూనే వస్తుండడం దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అంటూ విజయశాంతి వివరించారు.  తన ప్రకటనలో బీఆర్ఎస్ కు మద్దతు పలికారు విజయశాంతి. రాజకీయాలు అర్థం చేసుకోలేనివారు… దశాబ్దాలుగా కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, రామకృష్ణ హెగ్డే, జయలలిత నుంచి ఇప్పటి బీఆర్ఎస్, వైసీపీ వరకు ఇస్తున్న సమాధానాన్ని విశ్లేషించు కోవాల్సిన అవసరం ఉందన్నారు. బీఆర్‌ఎస్‌ కి సపోర్ట్‌ గా నిలిచారు. దక్షిణ భారత స్వీయ గౌరవ అస్థిత్వ సత్యం కాంగ్రెస్ అర్థం చేసుకున్నట్లు, బీజేపీ ఆలోచన చేయడం లేదన్నారు. కిషన్ రెడ్డికి ఈ విషయం తెలియాలన్నారు.

    కాంగ్రెస్ లో కొనసాగుతూ బీఆర్ఎస్ కు మద్దతుగా విజయశాంతి బీజేపీకి కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆమె చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. దక్షిణాది రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే స్థానిక ప్రజల మనోభావాలను అర్థం చేసుకుంటాయని బీఆర్ఎస్ పట్ల సానుకూల దృక్పథంతో విజయశాంతి తాజాగా ట్వీట్ చేసింది.  దక్షిణాదికి ప్రాంతీయ పార్టీలే ఊపిరి అన్నారు.  విజయశాంతి ట్వీట్ పై రాజకీయవర్గాల్లో కొత్త చర్చ నడుస్తోంది. కాంగ్రెస్ లో కొనసాగుతూ ప్రాంతీయ పార్టీలను ముఖ్యంగా బీఆర్ఎస్ పట్ల సానుకూల వైఖరితో మాట్లడటంపై ఆమె కాంగ్రెస్ ను వీడి కేసీఆర్ పార్టీలో చేరబోతున్నారా అనే ప్రచారం జరుగుతోంది.  అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీని వీడి కాంగ్రెస్ లో చేరారు విజయశాంతి. ఇక అప్పటి నుంచి సైలెంట్ గానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ ఎంపీ సీటు ఆశించారు. ఆమెకు టికెట్  రాకపోవడంతో పార్టీపై ఆసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆమె చేసిన ట్వీట్ విజయశాంతి తిరిగి గులాబీ గూటికి చేరనున్నారా..? అనే సందేహాలకు బలం చేకూర్చేలా ఉంది.

    Kidnap : కిడ్నాప్ చేసి.. 26 ఏళ్లు పొరుగింట్లోనే బంధించారు

    Kidnap
    Kidnap in Northern Algeria

    Kidnap : చంకలో బిడ్డనుంచుకొని ఊరంతా వెతికినట్లు పక్కింట్లో వ్యక్తిని పెట్టుకొని చనిపోడని అంతా అనుకున్నారు. ఈ ఘటన అల్జీరియాలో చోటు చేసుకుంది. ఉత్తర అల్జీరియాలోని డెజెల్ఫా అనే ఊళ్లో 1998లో ఒమర్ బిన్ ఒమ్రాన్ అనే 19 ఏళ్ల కుర్రాడు కిడ్నాప్ నకు గురయ్యాడు. ఆ సమయంలో కుటుంబ సభ్యులు అతడి ఆచూకీ కనుగొనేందుకు తీవ్రయం ప్రయత్నించారు. కేసు పెట్టినా అతడి జాడ లభించలేదు. ఒకరోజు ఒమ్రాన్ పెంపుడు కుక్క పొరుగింటి వద్ద వాసన చూస్తూ తిరిగింది. దీనిని ఆ కుటుంబ సభ్యులు అసలు పట్టించుకోలేది. కొద్ది రోజులకు ఆ కుక్క హఠాత్తుగా చనిపోయింది. ఆ దేశంలో అంతర్యుద్ధం జరుగుతుండటంతో ఒమ్రాన్ పై ఆ కుటుంబం ఆశలు వదులుకుంది. అలా 26 ఏళ్లు గడిచిపోయాయి. ఈ మధ్య కాలంలో 2013లో అతని తల్లి మృతిచెందింది.

    తాజాగా కిడ్నాపర్ సోదరుడి వరుస అయే వ్యక్తి సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టాడు. తన సోదరుడు ఓ కిడ్నాప్ చేశాడని పేర్కొన్నాడు. ఈ విషయాన్ని ఒమ్రాన్ కుటుంబం గ్రహించి అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అధికారులు పొరుగింటిపై దాడిచేసి గాలించగా గొర్రెల కొట్టం కింది సెల్లార్ లో ఒమ్రాన్ కనిపించాడు. పారిపోతున్న కిడ్నాపర్ ను అధికారులు అరెస్టు చేశారు. ఒమ్రాన్ పెంపుడు కుక్కను కిడ్నాపరే చింపేసినట్లు తెలుస్తోంది.

    Prabhas : కాబోయే భార్యను పరిచయం చేయబోతున్న ప్రభాస్.. ఇన్ స్టా పోస్టు వైరల్ 

    Prabhas
    Prabhas

    Prabhas : డార్లింగ్స్ ఫైనల్లీ సమ్ వన్ వెరీ స్పెషల్ పర్సన్ ఎంటర్ అవర్ లైఫ్ అంటూ ప్రభాస్ ఇన్ స్టాలో చేసిన పోస్టు తెగ వైరల్ అవుతోంది.  అసలు ఎవరీ స్పెషల్ పర్సన్ అంటూ సోషల్ మీడియా మొత్తం ట్రోల్స్ తో నిండిపోతుంది. ఆయన తన పెళ్లి గురించే ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని మన లైఫ్ లోకి నూతన వ్యక్తి రానున్నారని అర్థం వచ్చేలా పోస్టు చేశాడు.

    ప్రభాస్ తన జీవిత భాగస్వామి గురించే ఈ పోస్టు చేశాడని అందరూ అనుకుంటున్నారు. ప్రభాస్ కు 44 సంవత్సరాలు. పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత అందరూ ప్రభాస్ పెళ్లి గురించి ఎంతో మాట్లాడుకున్నారు. ప్రభాస్ అసలు ఎవరీని పెళ్లి చేసుకోనున్నారు.  గతంలో కూడా చాలా రూమర్స్  ప్రభాస్ పెళ్లి గురించి వచ్చినా.. అవన్నీ నిజం కావని తెలిసింది. ఏకంగా బాలకృష్ణ కూడా ఓ షోలో ప్రభాస్ నీ పెళ్లేప్పుడు బాబు అని ఆట పట్టించాడు.

    నేరుగా ప్రభాసే తన ఇన్ స్టా పోస్టు లో స్పెషల్ పర్సన్ లైఫ్ లో కి ఎంటర్ కానున్నారని చెప్పడంతో ఎవరా స్పెషల్ పర్సన్ అని నెట్టింట తెగ సెర్చ్ చేస్తున్నారు. ప్రభాస్ కు జంటగా ఎక్కువ సినిమాల్లో నటించి మెప్పించిన అనుష్క నే పెళ్లి చేసుకుంటాడని గతంలో రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఇప్పటి వరకు ఇద్దరూ స్పందించలేదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ అనుష్క జోడి సూపర్బ్ గా ఉంటుందని అంటున్నారు.

    ప్రభాస్ కు పాన్ ఇండియా లెవల్లో ప్యాన్స్ ఫాలోయింగ్ ఉంది. ఒక్క పోస్టు పెడితే చాలు అది ఎంత వైరల్ అవుతుందో ఈ రోజుతో తేలిపోయింది.  కానీ ప్రభాస్ కాబోయే భార్యనే పరిచయం చేయనున్నాడని అందుకే అలాంటి పోస్టు పెట్టాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ప్రభాస్ జీవిత భాగస్వామిగా రాబోయే ఆ లక్కీ గర్ల్ ఎవరో అని అందరిలో ఉత్కంఠ రేపుతోంది. ప్రభాస్ కూడా వెయిట్ అండ్ సీ అని చెప్పడంతో ఇంకా వెయిట్ చేయడమా అంటూ ఇక ఆగలేం అన్న చెప్పేయ్ వదిన పేరంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

    RCB : బెంగళూరు ప్లే ఆఫ్స్ చేరాలంటే.. 

    RCB
    RCB

    RCB : ఐపీఎల్ సీజన్ చివరకు దశకు చేరుకుంది. ప్లే ఆఫ్స్ కు మూడు జట్లు చేరిపోయాయి. ఇక మిగిలింది ఒక బెర్త్ మాత్రమే. దీని కోసం చెన్నైకు ఎక్కువ అవకాశాలు ఉండగా.. బెంగళూరు మాత్రం కాస్త పడాల్సి వస్తుంది. చెన్నై, బెంగళూరు మధ్య శనివారం జరగబోయే ఆఖరి లీగ్ పోరుకు చిన్న స్వామి స్టేడియం వేదిక కానుంది.

    ఈ పోరు ఆర్సీబీకి సొంత మైదానంలో జరగనుండటం కలిసి వస్తుండగా.. పాయింట్ల పట్టికలో చెన్నై మెరుగైన రన్ రేట్ తో ఉంది. దీంతో ఆర్సీబీ అసాధారణంగా ఆడితే తప్ప ప్లే ఆఫ్స్ కు వెళ్లడం  కష్టం. ఆర్సీబీ మొదటి బ్యాటింగ్ చేస్తే 200 పరుగులు చేస్తే చెన్నై ను కేవలం 181 పరుగుల లోపే అవుట్ చేయాల్సి ఉంటుంది. ఛేజింగ్ చేస్తే 18.1 ఓవర్ లోనే 200 పరుగులను కొట్టేయాలి. ఇలా ఆర్సీబీ ముందు పెద్ద టాస్కే ఉంది.  ఒక వేళ పది ఓవర్ల మ్యాచ్ సాగితే 130 పరుగులు గనక చేస్తే 8.1 ఓవర్లలోనే ఛేదించాలి.

    ఇలా ప్రతి ఒక్కటి ఆర్సీబీకి వ్యతిరేకంగా ఉన్నా.. ఈ సీజన్ లో ఆర్సీబీ టీం పుంజుకున్న తీరు చూసి ఇది అసాధ్యమేమీ అనిపించడం లేదు. వరుసగా ఆరు మ్యాచులు ఓడిపోయి రేసులో నుంచి వైదొలిగిన ఆర్సీబీ.. మళ్లీ పుంజుకుని వరుసగా అయిదు మ్యాచులు గెలిచి ప్లే ఆఫ్స్ రేసులో నిలిచింది. కానీ ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. ఒక వేళ వర్షం పడి ఒక్కో పాయింట్ వచ్చినా చెన్నై టీం ప్లే ఆఫ్స్ కు చేరుతుంది. బెంగళూరు టోర్నీ నుంచి వైదొలుగుతుంది.

    ప్రస్తుతం బెంగళూరు ఫుల్ ఫామ్ లోకి వచ్చేసింది. విరాట్ కొహ్లి, అద్భుతమైన ఫామ్ లో కొనసాగుతున్నాడు. కొహ్లి తన ఆటను మెరుగుపరుచుకుని మంచి స్ట్రైక్ రేట్ తో ఎదురు దాడి చేస్తున్నాడు. బౌలింగ్ లో స్వప్నిల్ సింగ్ పవర్ ప్లే లో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్లను దెబ్బతీస్తున్నాడు. సిరాజ్ కూడా బౌలింగ్ లో ఫామ్ లోకి వచ్చాడు.

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై రష్మిక మందన్న ప్రశంసలు.. మోదీకి ఫ్లస్ 

    Rashmika Mandanna
    Rashmika Mandanna-Atal Setu

    Rashmika Mandanna : ముంబయి అటల్ సేతు పై హిరోయిన్  రష్మిక మందన్న ప్రశంసల వర్షం కురిపించింది. రష్మిక తన ఎక్స్ ట్విట్టర్ లో అటల్ సేతు గురించి ఓ వీడియో పోస్టు చేసింది. అందులో అటల్ సేతు పై ప్రయాణం చేస్తుంటే ఎంతో మధురానుభూతి కలిగిందని చెప్పింది. ఇది కేవలం ఏడు సంవత్సరాల్లో పూర్తి కావడం ఎంతో గర్వకారణమన్నారు. ముంబైలో నిర్మించిన బ్రిడ్జి దేశంలోనే అతి పెద్దదని ఆమె చెప్పుకొచ్చింది.

     అటల్ సేతు 22 కిలోమీటర్ల పొడవు.. ఆరు లైన్లు విస్తరించి ఉంటుంది. ముంబై లోని సేవ్రీ నుంచి నౌవా వరకు దీన్ని నిర్మించారు. ఈ రెండు ప్రాంతాల మధ్య రాకపోకలు సాగించడానికి గతంలో రెండు గంటల సమయం పట్టేది. కానీ ఈ బ్రిడ్జి నిర్మాణంతో 20 నిమిషాల్లోనే సేవ్రీ నుంచి నౌవా వరకు చేరుకోవచ్చు. 22 కిలోమీటర్లు సముద్రం మధ్యలో నిర్మించడమంటే మామూలు విషయం కాదు. ఇలాంటివి భారత్ లో  నిర్మించడం చాలా మంది అసాధ్యమనుకుంటారు. కానీ కేంద్ర ప్రభుత్వం దీన్ని చేసి చూపించింది.

    ఈ వంతెన నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం దాదాపు 17,840 కోట్ల రూపాయలు వెచ్చించింది.  ఈ బ్రిడ్జి ద్వారా ముంబై పోర్టు, కొలాబా, వడాలా లాంటి  ప్రాంతాలకు కనెక్టివిటీ కల్పించారు. ఈ బ్రిడ్జి ద్వారా ముంబయి నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు కల్పించేలా కనెక్టివిటీ కల్పించడంతో చాలా సౌకర్యవంతంగా మారింది.

    అయితే మే 20 సార్వత్రిక ఎన్నికల్లో అయిదో విడత పోలింగ్ జరగనుంది. ఈ సందర్భంగా రష్మిక మందన్న చేసిన పోస్టు కూడా బీజేపీకి కలిసి వస్తుందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా రాష్ట్రాల్లో 49 ఎంపీ స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడతలో రాయ్ బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కేంద్ర మాజీ మంత్రి స్మృతి ఇరానీ పోటీ చేస్తున్నారు.

    Pawan Kalyan : పవన్ కళ్యాణ్ బాడీగార్డు ఇంటిపై దాడి

    Pawan Kalyan
    Pawan Kalyan

    Pawan Kalyan : హైదరాబాద్ మీర్ పేటలోని లెనిన్ నగర్ లో నటుడు పవన్ కళ్యాణ్ బాడీగార్డు వెంకట్ ఇంటిపై పలువురు దాడి చేశారు. ఇంటిపైన రాళ్లు, రాడ్లు, కత్తులతో దాడిచేసి సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. పాత కక్షల నేపథ్యంలో రాజు అనే వ్యక్తి వెంకట్ ఇంటి ముందు ఉన్న బైక్ ను తగులబెట్టి ఇంటిపై రాళ్లతో దాడిచేశారు. వెంకట్ పై దాడి చేయడానికి యత్నిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు.

    వెంకట్ తన కుటుంబంతో కలిసి ఐదు సంవత్సరాలుగా ఇద్దరు పిల్లలతో కలిసి లెనిన్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటి ఎదురుగా ఉండే రాజు వాళ్ల బంధువులు పాత గొడవల నేపథ్యంలో మే 15న రాత్రి వెంకట్ కూతురు పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో వెంకట్ భార్య సరిత అబ్బాయిని కొట్టింది. దీంతో రాజు బంధువు వెంకట్ ఇంటిపై కర్రలు, ఇటుకలు, ఇనుప రాడ్లతో దాడిచేసి ఇంట్లో ఉన్న సీసీ కెమెరాలు ధ్వంసం చేశారు. వెంకట్ కుటుంబ సభ్యులపై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై మీర్ పేట పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.

    Urvashi Rautela : పింక్ డ్రెస్ లో ఊర్వశి రౌతేలా.. కేన్స్ 2024లో సందడి చేసిన గ్లామర్ క్వీన్..

    Urvashi Rautela
    Urvashi Rautela

    Urvashi Rautela : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో మరోసారి తన బెస్ట్ ఫ్యాషన్ స్టైల్ చూపించింది ఊర్వశి రౌతేలా. స్లిట్ స్కర్ట్ తో వచ్చిన ఫుచ్సియా కార్సెట్ దుస్తులను మాజీ పోటీ రాణి ఎంచుకుంది. వృత్తాకార హాలో లాంటి దుస్తులను ధరించడం ద్వారా ఆమె అందం మరింత బయటకు వచ్చింది. రౌతేలా తన జుట్టును జువెలరీ హెడ్ బ్యాండ్ తో డిజైన్ చేసి, తన ట్యూబ్-స్టైల్ టాప్ తో సరిపోయే అప్డోలో తన జుట్టును ఉంచింది. ఈ లుక్ కోసం ఆమె సిల్వర్ గాజులతో కూడిన లేస్ గ్లౌజులు ధరించింది. ఆమె వెండి చెవిపోగులు మరింత అందం తెచ్చిపెట్టాయి.

    రౌతేలా దుస్తులను లెబనాన్ లోని బీరుట్ లో ఉన్న హౌట్ కౌచర్ ఫ్యాషన్ హౌస్ ఖలీద్ అండ్ మార్వాన్ రూపొందించింది. ‘ఫెస్టివల్ ది కేన్స్-2024 ఓపెనింగ్ వేడుక విత్ మై అల్టిమేట్ ఫావ్ మెరిల్ స్ట్రీప్’ అంటూ 30 ఏళ్ల నటి తన ఇన్ స్టాలో క్యాప్షన్ పెట్టింది.
    లవ్ డోస్ నటుడు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ కు రావడం కొత్తేమీ కాదు. 2022లో తన తమిళ డెబ్యూ మూవీ ది లెజెండ్ పోస్టర్ లాంచింగ్ కు హాజరైన ఆమె తొలిసారి కేన్స్ అరంగేట్రం చేసింది. మరుసటి సంవత్సరం, ఆమె ఫెస్టివల్ కు తిరిగి వచ్చింది, ఇండియానా జోన్స్, ది డయల్ ఆఫ్ డెస్టినీ ప్రీమియర్ కు హాజరైంది.

    మెక్సికన్ నటి మారియా ఫెలిక్స్ కోసం 1975లో ప్రత్యేకంగా తయారు చేసిన కార్టియర్ రూపొందించిన ఐకానిక్ ‘అలిగేటర్ నెక్లెస్’ ధరించినందుకు ప్రముఖ ప్రైవేట్ జ్యువెలరీ షాపింగ్ కన్సల్టెంట్ అరుంధతి డీ-సేథ్ గతేడాది ఊర్వశి రౌతేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
    అరుంధతీ డి-సేథ్ తన ఇన్ స్టాలో ఒరిజినల్ నెక్లెస్ ఫోటోను షేర్ చేస్తూ, ‘కార్టియర్ యొక్క స్వస్థలమైన ఫ్రాన్స్ లోని కేన్స్కు వెళ్లి, ఆపై ఒక చారిత్రాత్మక దాని స్థానంలో నాసిరకం, విచారకరమైన, వికృతమైన దాన్ని ధరించారు. మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అసలు వస్తువు ధరించినట్లు నటిస్తున్నారు. రౌతేలా టీమ్ ను ట్యాగ్ చేస్తూ ‘మీరు ఎలాంటి హోంవర్క్ చేయలేదని తెలుస్తోంది. దానికి బదులుగా ఆమె ధరించగలిగే అత్యంత ప్రత్యేకమైన సంపదలు, ఆభరణాలు ఉన్న దేశం మనది; ఇది చాలా బాధాకరం మరియు విచారకరం.’

    ఊర్వశి రౌతేలా బృందం ఆ నెక్లెస్ నకిలీదా, నిజమైనదా అనే విషయాన్ని స్పష్టం చేయలేదు. బ్రూట్ ఇండియాతో మాట్లాడుతూ, రౌతేలా విమర్శకులను తోసిపుచ్చుతూ, నెక్లెస్ నిజమైనదని సూచించింది. ‘ఈ విషయం నాకు తెలియదు, కానీ ఇది 2006 లో కేన్స్ లో మోనికా బెలూచి ధరించినట్లు నాకు తెలిసింది. దాని గురించి నాకు అస్సలు తెలియదు.’ అని చెప్పింది.

    Jr NTR : ఆలయానికి భారీ విరాళం అందించిన యంగ్ టైగర్.. ఎంతంటే?

    Jr NTR
    Jr NTR

    Jr NTR : కోట్లాది మంది అభిమానుల చేత ‘మ్యాన్ ఆఫ్ మాస్’ గా పిలుచుకునే ఎన్టీఆర్ కు ఎన్టీఆర్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రస్తుతం ‘దేవర: పార్ట్ 1’ చిత్రంలో నటిస్తున్నారు. తన వ్యక్తిత్వం ఎంత పెద్దదైనా ఎన్టీఆర్ చాలా వినయంగా, నిజాయతీగా ఉంటారని ఆయన అభిమానులు ఆరాధించే లక్షణాలు ఆయనలో ఉన్నాయని చెప్పవచ్చు. తాజాగా ఆయన ఓ మంచి కార్యక్రమానికి మద్దతు ప్రకటించారు. చెయ్యేరులోని ప్రసిద్ధ ‘శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి ఆలయానికి’ రూ.12.5 లక్షల భారీ మొత్తాన్ని విరాళంగా అందజేశారు.

    ఈ విషయాన్ని జూనియర్ ఎన్టీఆర్ ఓ ఫ్యాన్ పేజ్ సోషల్ మీడియాలో వెల్లడించింది. ‘శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వారి అలయానికి తారక్ రూ.12,50,000 విరాళం ఇచ్చారు’ అని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు.

    వరద బాధితులను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.25 లక్షలు, పరిశ్రమలో రోజువారీ కూలీలను ఆదుకునేందుకు కరోనా క్రైసిస్ ఛారిటీకి మరో రూ.25 లక్షలు విరాళంగా ఇవ్వడంతో పాటు పలు కీలక కార్యక్రమాలకు కూడా ఎన్టీఆర్ విరాళాలు అందజేశారు.

    కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ డ్రామా ‘దేవర: పార్ట్ 1’ అక్టోబర్ 10న దేశవ్యాప్తంగా విడుదల కానుంది.

    రాబోయే రోజుల్లో హిందీ సినిమాల్లో తన కెరీర్ ను విస్తరించుకోవాలని జూనియర్ ఎన్టీఆర్ పావులు కదుపుతున్నట్లు సమాచారం. అతను ముంబైకి మకాం మార్చే అవకాశం లేకపోలేదని టాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి. ఇది అతని కెరీర్ ఎంపికలో మార్పును సూచిస్తుంది. తన బాలీవుడ్ వెంచర్ కు ప్రాధాన్యమివ్వడానికి ఆయన తన సౌత్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అన్నీ రీషెడ్యూల్ చేసినట్లు సమాచారం. ముంబైకి మకాం మార్చి బాలీవుడ్ లో తన ప్రాబల్యాన్ని పెంచుకోవాలని అనుకుంటున్నట్లు సమాచారం.

    ‘దేవర-పార్ట్ 1’ 2024, అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ‘ఆర్ఆర్ఆర్’ నటుడితో పాటు సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ వంటి నటులు నటించారు. ఎన్టీఆర్ భార్య పాత్రలో మరాఠీ నటి శ్రుతి మరాఠేను ఎంపిక చేశారు. స్టార్ మీడియా మరాఠీ పోర్టల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శ్రుతి ఈ విషయాన్ని ధృవీకరించింది. గతంలో దేవర సినిమాలో ఓ కీలక పాత్ర కోసం బార్డ్ ఆఫ్ బ్లడ్ నటిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి కానీ ఆ వార్తను ధృవీకరించలేదు. ఇప్పుడు ఈ వార్తను ధృవీకరించడంతో శ్రుతి అభిమానులు ఈ కొత్త పాత్ర గురించి ఆమెపై మండిపడుతున్నారు. ఈ పాన్ ఇండియా మూవీలో ఆమె నటనా కౌశలాన్ని చూడాలని చూస్తున్నారు.