36.9 C
India
Monday, May 6, 2024
More
    Home Blog Page 3

    Mumbai Indians : సన్ రైజర్స్ ను ముంబయి ఇండియన్స్ అడ్డుకునేనా?

    Mumbai Indians
    Mumbai Indians VS SRH

    Mumbai Indians : ముంబయి ఇండియన్స్, సన్ రైజర్స్ మధ్య సోమవారం సాయంత్రం వాంఖడే మైదానంలో హై హోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ ఐపీఎల్ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ ముంబయి ఇండియన్స్ పై ఉప్పల్ స్టేడియంలో 276 పరుగులు చేసి రికార్డు సృష్టించింది. అయితే ముంబయి ఇండియన్స్ కూడా ధీటుగానే జవాబిచ్చినా 246 పరుగుల వద్ద ఆగిపోయింది.

    ముంబయి బౌలర్లపై హెడ్, అభిషేక్ శర్మలు సిక్సులతో విరుచుకుపడ్డారు. ముంబయి బౌలర్లలో జస్ ప్రీత్ బుమ్రా ఒక్కడే ఫామ్ లో ఉన్నాడు. మిగతా బౌలర్లు దారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారు. ముంబయి బ్యాటింగ్ లో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, సూర్య కుమార్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్నారు. స్థాయికి తగ్గ ప్రదర్శన ఇవ్వలేక చతికిలపడుతున్నారు. ఇషాన్ కిషన్ నుంచి గొప్ప ఇన్సింగ్స్ ను ముంబయి టీం కోరుకుంటోంది. ముంబయి పాయింట్ల పట్టికలో 11 మ్యాచుల్లో 3 గెలిచి చివరి స్థానంలో ఉంది. ఇంకా మూడు మ్యాచులు గెలిచినా ఒరిగేది ఏమీ లేదు.

    సన్ రైజర్స్ హైదరాబాద్ మాత్రం రాజస్థాన్ పై థ్రిల్లింగ్ విక్టరీతో మళ్లీ ఫామ్ అందుకుంది. కీలక సమయాల్లో నితీశ్ రెడ్డి, క్లాసెన్ రాణించడంతో రాజస్థాన్ రాయల్స్ పై బ్యాటింగ్ లో 200 పరుగులు చేయగలిగారు. బౌలింగ్ లో భువనేశ్వర్ కుమార్ ఫామ్ లోకి రావడం సన్ రైజర్స్ కు శుభ పరిణామం.

    నటరాజన్ పర్పుల్ క్యాప్ తో అదరగొట్టేస్తున్నాడు. ప్రతి మ్యాచులో వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్ల బ్యాట్స్ మెన్ లను ఇబ్బంది పెడుతున్నారు. సన్ రైజర్స్ 10 మ్యాచులు ఆడి ఆరు విజయాలతో 12 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతుంది.  ఈ మ్యాచ్ లో గెలిస్తే ప్లే ఆఫ్ అవకాశాలు మెరుగుపడతాయి. లేకపోతే రాబోయే మూడు మ్యాచుల్లో తప్పకుండా గెలవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ప్యాట్ కమిన్స్ ఈ సారి ఎలాంటి ప్లాన్ తో ముందుకు రానున్నడో వాంఖడేలో తెలిసిపోనుంది. ఈ మ్యాచ్ లో ఇప్పటికైతే సన్ రైజర్స్ హైదరాబాద్ ఫేవరేట్ టీం అని అందరూ అనుకుంటున్నారు.

    IPL 2024 : ఐపీఎల్ 2024: సీఎస్‌కే vs పీబీకేఎస్ మ్యాచ్ లో మతీషా పతిరానా ఆడలేదు.. కారణం ఇదే..!

    IPL 2024
    IPL 2024

    IPL 2024 : ధర్మశాలలోని హెచ్‌పీసీఏ స్టేడియంలో పంజాబ్ కింగ్స్ (పీబీకేఎస్)తో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) తలపడింది. గత మ్యాచ్ నుంచి తమ 11 మందిలో ఎలాంటి మార్పు లేదని సామ్ కరన్ ప్రకటించడంతో, సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కీలక పేసర్లు ముస్తాఫిజుర్ రెహ్మాన్, మతీషా పతిరానా లేకుండా తమ జట్టు మ్యాచ్ ఆడుతుందని చెప్పారు.

    ‘మేం బౌలింగ్ చేస్తాం. డే గేమ్, అది ఎలా ఆడుతుందో చూడండి. మాది ఒకే జట్టు. ఒకే జట్టుతో రెండు విజయాలు సాధించాం. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో పరిస్థితులు మెరుగ్గా ఉండాలి’ అని కరన్ చెప్పుకొచ్చాడు.

    2024 T20 వరల్డ్ కప్ సన్నాహకాల అనంతరం రెహ్మాన్ స్వదేశానికి తిరిగి రాగా, గాయం కారణంగా పతిరానా ఆటకు దూరమయ్యాడు. గాయం కారణంగా శ్రీలంక ఆటగాడు స్వదేశానికి తిరిగి వచ్చాడని సీఎస్కే తెలిపింది. చెన్నై సూపర్ కింగ్స్ పేసర్ మతీషా పతిరానా తొడ కండరాల గాయంతో బాధపడుతున్నాడని, కోలుకోవడానికి శ్రీలంకకు వెళ్తాడని సీఎస్కే ఒక ప్రకటనలో తెలిపింది.

    హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ సామ్ కరన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. సీఎస్కే కేప్టెన్ గా గైక్వాడ్ ఆడిన చివరి 11 మ్యాచ్ లలో ఓడిపోవడం ఇది పదోసారి. ప్లేఆఫ్స్ రేసు కొనసాగుతోందని, మిడ్ టేబుల్ స్థానాల్లో ఉన్న అన్ని జట్లు అర్హత సాధించాలంటే చేతిలో ఉన్న ప్రతి మ్యాచ్ లోనూ విజయం సాధించాల్సి ఉంటుందన్నారు.

    Viral Poster : నోటి దురుసు నాయకులను ఓడిద్దాం – సోషల్ మీడియాలో వైరల్

    Viral Poster
    Viral Poster

    Viral Poster : బూతులు, నోటి దురుసు నాయకులను ఓడించాలని ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ బ్యాచ్ లో ఉన్న ప్రతి ఒక్కడిని తుక్కుతుక్కుగా ఓడించి సమాజంలో మెరుగైన నాయకులను ఓడించాలని, సరికొత్త రాజకీయాన్ని మనమే తయారు చేసుకొందామని పోస్టర్ లో మెసేజ్ ఉంది.

    ఇంకా ఆదర్శ నాయకులే కావాలి, మన ఓటు అనే వజ్రాయుధం ద్వారా కళ్లు తెరిపిద్దాం అనే సందేశం ఉండడంతో పాటు ఈ మెసెజ్ ను అందరికీ షేర్ చేయాలనే రిక్వెస్ట్ కూడా ఉంది. సో.. ఈ మెసెజ్ ను మనం కూడా ఫాలో అయి ఈ పోస్టర్ ను ఇతరులకు షేర్ చేద్దాం.

    Uttar Pradesh : స్టేషన్ మాస్టర్ నిద్రలో.. అరగంట నిలిచిన రైలు

    Uttar Pradesh
    Uttar Pradesh

    Uttar Pradesh : ఓ స్టేషన్ మాస్టర్ నిద్ర  ఓ ఎక్స్ ప్రెస్ రైలును అరగంట నిలిపివేసింది. ఇది నిజం.. ఉత్తరప్రదేశ్ లో ఇటావా సమీపంలోని ఉడిమోర్ జంక్షన్ వద్ద ఈ ఘటన జరిగింది. పాట్నా-కోటా మధ్య రాకపోకలు సాగించే ఎక్స్ ప్రెస్ రైలు మే 3న ఉడిమోర్ జంక్షన్ కు చేరుకుంది. అయితే, అక్కడున్న స్టేషన్ మాస్టర్ నిద్రలోకి జారుకోవడంతో గ్రీన్ సిగ్నల్ లేకపోవడంతో రైలును లోకోపైలట్ అక్కడే నిలిపివేశాడు. అనేక సార్లు హారన్ కొట్టినా ఫలితం లేకపోయింది. అరగంట తర్వాత మేల్కొన్న స్టేషన్ మాస్టర్ గ్రీన్ సిగ్నలు ఇచ్చాడు.

    విధుల్లో నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన ఆగ్రా డివిజన్ రైల్వే అధికారులు వివరణ కోరారు. అనంతరం తగు క్రమ శిక్షణా చర్యలు తీసుకుంటామని ఆగ్రా రైల్వే డివిజన్ పీఆర్ వో ప్రశస్తి శ్రీవాస్తవ ఓ వార్తా సంస్థకు తెలిపారు. స్టేషన్ మాస్టర్ తన తప్పును అంగీకరించాడని, తప్పిదానికి క్షమాపణ చెప్పినట్లు తెలిసింది.

    CM Revanth : ‘దానం’ను కేంద్రమంత్రి చేస్తా..: సీఎం రేవంత్

    CM Revanth
    CM Revanth

    CM Revanth : బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎమ్మెల్యే దానం నాగేందర్ ను కేంద్ర మంత్రిని చేసే బాధ్యత తనదే అని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం దానం నాగేందర్ తరపున సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో పీఎం నరేంద్రమోదీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో ఉన్న మోదీ, రాష్ట్రంలో ఉన్న కేడీ ఇద్దరూ తెలంగాణకు ఏం చేయలేదంటూ ఆరోపించారు.

    జంట నగరాల అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిన అవసరం ఉన్నదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. యూనివర్సిటీ భూములను కబ్జా చేసి ఇండ్లు కట్టుకున్నారని, వారందరి పని దానం నాగేందర్ చూస్తాడని అన్నారు. అనిల్ కుమార్ యాదవ్ ను రాజ్యసభకు పంపామని, పార్టీ కోసం కష్టపడ్డ ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ను ఎమ్మెల్సీని చేశామని గుర్తు చేశారు.

    Bangla Lakshmikanth Reddy : డీకే అరుణను గెలిపిస్తే.. విమానంలో అయోధ్యకు తీసుకెళ్తా – కార్యకర్తలతో బీజేపీ నేత బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి

    Bangla Lakshmikanth Reddy
    Bangla Lakshmikanth Reddy

    Bangla Lakshmikanth Reddy : బీజేపీ రాష్ట్ర కార్యవర్త సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి పార్టీ కార్యకర్తలు బంపర్ ఆఫర్ ప్రకటించారు. మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న డీకే అరుణను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ఆమె గెలుపే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని చెప్పారు.

    ఎంపీ ఎన్నికల్లో అరుణ గెలిచాక మక్తల్ నియోజకవర్గంలోని ఆయా మండలాల అధ్యక్షులను, బూత్ అధ్యక్షులను విమానంలో అయోధ్యకు తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. తన సొంత ఖర్చులతో నాయకులందరినీ అయోధ్యకు విమానంలో తీసుకెళ్లి రామయ్య దర్శనం చేయిస్తానని లక్ష్మీకాంత్ రెడ్డి వారికి ఆఫర్ చేశారు. ఈ వారం రోజులు అవిశ్రాంతంగా కృషి చేయాలని మహబూబ్ నగర్ గడ్డపై కాషాయ జెండా ఎగురవేయడానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

    Free Villa : 42 ఎకరాల్లో పెద్ద విల్లా..ఉచితంగా ఇస్తారట త్వరపడండి మరి!

    Free Villa
    Free Villa

    Free Villa : నగరాల్లో ఏ చిన్న ఇల్లు కొనాలన్నా లక్షల్లో మాటే. ఇక  విల్లా మాట దేవుడెరుగు.. కోట్లు ఖర్చు చేస్తే కాని దొరకదు. ఇండ్లకు ఉన్న డిమాండ్ అది. నగరాల్లోనే కాదు ఇప్పుడు పల్లెల్లో సైతం ఇండ్లకు ఫుల్ డిమాండ్ ఉంటోంది. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అన్నట్టుగా మారిపోయింది ప్రస్తుత సమాజం. ఇలాంటి పరిస్థితుల్లో ఓ ప్రభుత్వం ఓ విల్లాను ఉచితంగా ఇస్తామని ప్రకటించింది. విల్లా అంటే అర ఎకరమో, ఎకరమో కాదు..ఏకంగా 42 ఎకరాల్లో ఉన్న విల్లాను పూర్తిగా ఉచితంగా ఇస్తామని వెల్లడించింది. అసలు ఈ విల్లా కథెంటో చదవండి మరి..

    జర్మనీ నియంత హిట్లర్ గురించి తెలియని వారు ఉండరు. ఆయనకు అత్యంత సన్నిహితుల్లో ఒకరు జోసెఫ్ గోబెల్స్. ఈయన నాజీ పార్టీకి ప్రధాన ప్రచారకుడిగా పని చేశాడు. అప్పట్లో పత్రికలు, రేడియోలు, సినిమాల ద్వారా నాజీ భావజాలాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. జర్మనీ రాజధాని బెర్లిన్ కు 25 మైళ్ల దూరంలో ఈయనకు ఒక పెద్ద విల్లా ఉంది. దీన్ని 1936లో కట్టారు. సుమారు 42 ఎకరాల్లో చాలా విశాలంగా అద్భుతంగా కట్టారు. గోబెల్స్ ఈ విల్లాను అనేక అవసరాలకు వాడుకున్నాడు. అందులో పలువురు సినిమా హీరోయిన్లతో రొమాన్స్ బాగానే చేశాడని అంటారు.

    హిట్లర్ కాలం అంతమైపోయిన తర్వాత గోబెల్స్ కూడా తన కుటుంబంతో కలిసి ఈ విల్లాలోనే ఆత్మహత్య చేసుకున్నాడని చెబుతుంటారు. అప్పటి నుంచి ఈ విల్లా జర్మనీ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఉంది. అయితే దీని నిర్వహణ ఖర్చు ప్రభుత్వానికి భారంగా ఉండడంతో నాజీ పాలనకు చెందిన విల్లా కావడంతో దీన్ని ఎలాగైనా వదిలించుకోవాలని చూస్తోంది. అయితే ఎవరూ ముందుకు రాపోవడంతో ఇక ఉచితంగా బహుమతి రూపంలో ఇవ్వాలని సంకల్పించింది. గోబెల్స్ తన భార్య, ఆరుగురు పిల్లలతో కలిసి ఆ ఇంట్లోనే ఆత్మహత్య చేసుకోవడంతో భయంతో ఉచితంగా కూడా తీసుకోవడానికి ముందుకు రావడం లేదని తెలుస్తోంది.

    Nurse Jailed : నర్సుకు 700 ఏళ్ల జైలు శిక్ష: మానవ రూపంలో రాక్షసురాలు ఆమె.. 17 మందిని చంపిన హీథర్ ప్రెస్డీ

    Nurse Jailed
    Nurse Jailed for 700 years

    Nurse Jailed : రోగుల ప్రాణాలను కాపాడడం ఆమె వృత్తి. కానీ ఆమె మాత్రం రోగులను హతమార్చింది. అది కూడా ఉద్దేశపూర్వకంగానే.. ఇలా 17 మంది రోగులను చంపింది. 2020 మరియు 2023 మధ్య 5 వేర్వేరు హాస్పిటల్స్ లలో పని చేసింది అన్ని చోట్ల హత్యలు చేసింది. కోర్టులో ఆమెపై వచ్చిన ఆరోపణలకు ఆమె అంగీకరించింది.

    పెన్సిల్వేనియాకు చెందిన 41 ఏళ్ల నర్సు హీథర్ ప్రెస్డీ గత 3 సంవత్సరాలలో 22 మంది రోగులకు అధిక మోతాదులో ఇన్సూలిన్ ఇచ్చిందని ఆరోపించింది. చాలా సందర్భాల్లో ఆమె హాస్పిటల్ ఖాళీగా ఉన్నప్పుడు అర్థరాత్రి ఇన్సులిన్‌ను అధిక మోతాదులో తీసుకునేది. అదనంగా, మధుమేహంతో బాధపడని రోగులకు కూడా నర్సు ఇన్సులిన్‌ను అధిక మోతాదులో ఇచ్చింది.

    ఎక్కువ మోతాదులో ఇన్సులిన్ తీసుకోవడం వల్ల గుండె వేగం పెరిగి గుండెపోటు వస్తుంది. గతేడాది మేలో నర్సు పట్టుబడింది. పోలీసులు విచారణ జరిపి నర్సుపై మరిన్ని కేసులు పెట్టారు.

    విచారణలో, నిందితురాలు నర్సు తన తల్లికి పంపిన టెక్స్ట్ సందేశాలలో ఆసుపత్రిలోని రోగులు, సహచరులు, రెస్టారెంట్లలో కలుసుకున్న వ్యక్తుల పట్ల కూడా తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు పోలీసుల విచారణలో తెలిసింది. వారికి హాని చేయాలనే కోరికను కూడా వ్యక్తం చేసింది.

    సాక్షులను విచారించిన యూఎస్ కోర్టు అమెరికన్ నర్సు హీథర్ ప్రెస్డీ రోగులకు అధిక మోతాదులో ఇన్సులిన్‌ ఇచ్చి చంపినందుకు దోషిగా నిర్ధారించింది. ఆమెకు 380 నుంచి 760 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.

    US Student Visas : మే రెండో వారంలో.. యూఎస్ స్టూడెంట్ వీసాలు

    US Student Visas
    US Student Visas

    US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని ఎదురుచూస్తున్నభారతీయ విద్యార్థులకు కాన్సులేట్ తీపి కబురు చెప్పింది. మే రెండో వారంలో స్టూడెంట్ వీసా స్లాట్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికాలో ఫాల్ సీజన్ లో చదువులకు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు, సెప్టెంబర్ లలో మొదలవుతుంది.ఈ ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు అమెరికా వెళ్తారు.

    భారతీయ విద్యార్థులకు సేవలు అందించేందుకు కాన్సులేట్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.  భారత్-అమెరికా ప్రజల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా భారత విద్యార్థులకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కాన్సులేట్ వర్గాలు తెలిపాయి.  2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీ చేశారు. దాదాపు 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి కోసం ఇచ్చే హెచ్1బీ వీసాలను కూడా జారీచేశారు.

    AP Elections 2024 : ‘వామ్మో వీడు మళ్లీ రాకూడదు’ ఏపీ అంతా ఇదే అంటుందా?

    AP Elections 2024
    AP Elections 2024

    AP Elections 2024 : ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ కు దాదాపు వారం మాత్రమే గడువు ఉంది. ఈ సారి అసెంబ్లీతో పాటు పార్లమెంట్ కు కూడా పోలింగ్ జరగనుంది. దీంతో రాష్ట్రం ఇప్పటికే రాజకీయ నాయకుల అస్త్రాలు, శస్త్రాలతో ఆగం ఆగం అవుతోంది. ఇటు మహా కూటమి (టీడీపీ + జనసేన + బీజేపీ) అటు వైసీపీ నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ మరింత హీట్ పెంచుతున్నారు.

    వీరి హీట్ కు తోడు సోషల్ మీడియా కూడా మరింత అగ్గి రాజేస్తుంది. ఒక పార్టీపై మరో పార్టీ మీమ్స్, వైరల్ వీడియోలు పోస్ట్, షేర్ చేస్తూ అటెన్షన్ గ్రాబ్ చేస్తున్నారు. అయితే వైసీపీపై ఈ వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి. చిన్న చిన్న కొటేషన్లలో అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు నాయకులు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవి కాస్తా జగన్ ప్రభుత్వానికి చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.

    ఏపీలో ఐదేళ్ల జగన్ పాలన చూసిన ప్రజలు ఈ సారి జగన్మోహన్ రెడ్డి సీఎం కావద్దని అనుకుంటున్నారంటూ కేవలం కొటేషన్ రూపంలో ఫొటో మీమ్ వదలారు. ఎలాంటి హింట్ ఇవ్వకుండా కేలవం ‘అమ్మో వీడు మళ్లీ రాకూడదు’ అంటూ పెట్టారు. ఇది ప్రస్తుతం వైరల్ గా మారింది.