US Student Visas : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికా వెళ్లాలని ఎదురుచూస్తున్నభారతీయ విద్యార్థులకు కాన్సులేట్ తీపి కబురు చెప్పింది. మే రెండో వారంలో స్టూడెంట్ వీసా స్లాట్లు ప్రారంభించనున్నట్లు తెలిపింది. అమెరికాలో ఫాల్ సీజన్ లో చదువులకు సంబంధించిన సెమిస్టర్ ఆగస్టు, సెప్టెంబర్ లలో మొదలవుతుంది.ఈ ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్థులు అమెరికా వెళ్తారు.
భారతీయ విద్యార్థులకు సేవలు అందించేందుకు కాన్సులేట్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్-అమెరికా ప్రజల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా భారత విద్యార్థులకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కాన్సులేట్ వర్గాలు తెలిపాయి. 2023లో రికార్డు స్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీ చేశారు. దాదాపు 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి కోసం ఇచ్చే హెచ్1బీ వీసాలను కూడా జారీచేశారు.