36.9 C
India
Monday, May 6, 2024
More
    Home Blog Page 2

    Allu Arjun Voice : వివాదంలో అల్లు అర్జున్ ’వాయిస్’..!

    Allu Arjun voice
    Allu Arjun voice Over in Pushpa
    Allu Arjun voice : ‘పుష్ప: ది రైజ్’ హిందీ వెర్షన్ లో అల్లు అర్జున్ పాత్రకు డబ్బింగ్ చెప్పిన శ్రేయాస్ తల్పాడే ఇటీవల తన గుండెపోటుకు గురైన విషయాలను, కొవిడ్-19 కు తీసుకున్న వ్యాక్సిన్ వల్లనా? అనే విషయాలను పంచుకున్నారు.

    ఒక ఇంటర్వ్యూలో అతను తన ఆరోగ్య విషయాలను పంచుకున్నాడు. తాను స్మోక్ చేయనని, అధికంగా మద్యం తీసుకోనని, అప్పుడప్పుడు మాత్రమే మద్యం తాగుతానని చెప్పారు.

    తన ఆరోగ్య సంక్షోభం గురించి ప్రస్తావిస్తూ.. కొవిడ్ వ్యాక్సిన్ తన కార్డియాక్ అరెస్ట్ కు కారణం అయ్యే అవకాశం ఉందని. వ్యాక్సినేషన్ తర్వాత అలసట కలుగుతుందని, ఆయన బహిరంగంగా తన అభిప్రాయం తెలిపాడు.

    డయాబెటిస్ లేదు, రక్తపోటు లేదు, ఏమీ లేకపోయినా గుండె పోటు రావడానికి కారణం ఏమిటి?’ అని ఆయన అన్నారు.

    ‘నేను సిద్ధాంతాన్ని ఖండించను. కొవిడ్-19 వ్యాక్సిన్ తీసుకున్న తర్వాతే నాకు అలసట, ఆయాసం మొదలైంది. అది కొవిడ్ వల్ల కావచ్చు, లేదంటే వ్యాక్సిన్ వల్ల కావచ్చు, కానీ ఆ తర్వాత ఏదో జరిగింది.. ఇది దురదృష్టకరం ఎందుకంటే మన శరీరంలో ఏం జరుగుతుందో మనకు నిజంగా తెలియదు. మేము కంపెనీలను విశ్వసించాము.. వారు చెప్పిన విషయాలను అనుసరించాం. కొవిడ్ ముందు ఇలాంటి గుండెపోటు ఘటనలు ఎప్పుడూ వినలేదన్నారు.

    గత డిసెంబర్ లో వెల్ కమ్ 3 షూటింగ్ సమయంలో శ్రేయాస్ తల్పాడేకు గుండెపోటు వచ్చింది. ఓ సినిమా కోసం యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేసిన తర్వాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఎడమ చేయి నొప్పి వచ్చిందని వివరించారు.

    ఇటీవల విడుదలైన పుష్ప 2 హిందీ లిరికల్ సాంగ్ వీడియోలో అల్లు అర్జున్ కు తల్పాడే వాయిస్ డబ్బింగ్ చెప్పడం వినిపిస్తుంది.

    Godzilla x Kong : గాడ్జిల్లా x కాంగ్ కలెక్షన్ల వర్షం

    Godzilla x Kong
    Godzilla x Kong

    Godzilla x Kong : గాడ్జిల్లా మూవీకి కలెక్షన్ల వర్షం కురుస్తోంది. ది న్యూ ఎంపైర్ అనే సరికొత్త థీమ్ తో థియేటర్లలో విడుదల కాగా..  మార్చి 29న ఇండియా లో రీలీజైంది. ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. అయితే బాలీవుడ్ లో క్రూ చిత్రంలో పోటీ పడి మరీ కలెక్షన్లు రాబడుతోంది. క్రూ లో కరీనా కపూర్, కృతి సనన్, టబు లాంటి టాప్ హిరోయిన్లు నటించిన విషయం తెలిసిందే.

    2024 లో ఇండియాలో విడుదలైన ఈ గాడ్జిల్లా మూవీ దాదాపు 37.60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దీంతో ఇప్పటి వరకు దేశంలో ఒక హలీవుడ్ మూవీ సాధించిన కలెక్షన్లను రికార్డు బ్రేక్ చేసింది. భూమిని స్వాధీనం చేసుకోవాలని చూసే స్కార్ కింగ్ తో గాడ్జిల్లా, కింగ్ కాంగ్ కలిసి పోరాటం చేస్తాయి. అయితే గాడ్జిల్లా, కింగ్ కాంగ్ గతంలో లాగా ఒకరితో ఒకరు పోరాటం చేసుకోకుండా కలిసి స్కార్ కింగ్ ను ఓడించేందుకు ప్రయత్నం చేస్తాయి. అత్యంత క్రూరమైన స్కార్ షిమో మంచు టైటాన్ ను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత భూమిని ఆక్రమించుకోవచ్చని ప్లాన్ చేస్తుంది.

    గాడ్జిల్లా ఈ ముప్పును గ్రహించి కొత్త శక్తి కోసం ట్రై చేస్తుంది. కాంగ్ హోలో భూమిని అన్వేషిస్తూ రహస్య సామ్రాజ్యానికి దారి చూపే యువ కోతిని మీట్ అవుతుంది. ఈ మూవీలో  కొంతమంది ప్రీవియస్ సిరీస్ లో  నటించిన రోల్స్ నే కంటిన్యూ చేశారు. బ్రియాన్ టైరీ హెన్రీ, డాన్ స్టీవెన్స్, కేలీ హట్లే, అలెక్స్, ఫెర్న్స్, పాలా చెన్, రెబక్కా హాల్ అనే నటీనటులు తన పర్ఫామెన్స్ చూపించారు.

    ఈ మూవీ ఓటీటీ ప్లాట్ పాంలో ఎప్పుడు వస్తుందా అని హలీవుడ్ సినిమాలు చేసే ప్రేక్షకులు ఎదురు చూస్తుండగా.. మే 14 న రానున్నట్లు తెలుస్తోంది.  ఈ మూవీకి అడమ్ వింగార్డ్ డైరెక్షన్ చేయగా.. మాన్ స్టర్ ఫిల్మ్ ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ సినిమా దాదాపు ఇండియా కరెన్సీలో రూ. 4372 కోట్ల ను వసూలు చేసి చరిత్ర సృష్టించింది. దీని నిర్మాణానికి దాదాపు 135 మిలియన్ డాలర్లు ఖర్చు పెడితే.. రూ. 524 మిలియన్ డాలర్ల వరకు వసూళ్లు రాబట్టింది.

    Tantex Ugadi Celebrations : తెలుగుదనం ఉట్టిపడేలా.. టాంటెక్స్ ఉగాది సంబురాలు..

    Tantex Ugadi Celebrations
    Tantex Ugadi Celebrations

    Tantex Ugadi Celebrations : 2024, క్రోధినామ ఉగాది వేడుకలు ఫ్రిస్కో హై స్కూల్ లో ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం(టాంటెక్స్) ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగాయి. వేడుకల్లో ప్రవాస తెలుగు వారు భారీగా పాల్గొన్నారు. తన్మయీ రాయపాటి బృందం అమెరికా జాతీయ గీతాలాపన ప్రారంభమైంది. టాంటెక్స్ అధ్యక్షుడు సతీశ్ బండారు తెలుగు వారికి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వరదరాజన్ పంచాంగ శ్రవణం చేశారు.
    కల్చరల్ కమిటీ చైర్ పర్సన్ దీపికా రెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. ఫ్రిస్కో నగర కౌన్సిల్ సభ్యులు జాన్ కీటింగ్, ఏంజెలియ పెల్ హ్యాం, ఫ్రిస్కో ఐఎస్‌డీ బోర్డు ఆఫ్ ట్రస్టీ గోపాల్ పోణంగి చీఫ్ గెస్ట్ లుగా హాజరయ్యారు.

    దయాకర్ మాడా హాస్యవల్లరి స్కిట్ తో పాటు చిన్నారులు, మహిళలు ప్రదర్శించిన ‘మూషిక వాహన’ క్లాసికల్ డాన్స్, పల్లెల్లో ఉగాది రూపకం, శివభక్తిని ప్రతిభింబించే నృత్యాలు, అన్నమాచార్య కీర్తన ‘చక్కని తల్లికి’ క్లాసికల్ డాన్స్, గాయకులు మాళవిక, కారుణ్య గానం, మెహర్ చంటి లైవ్ బ్యాండ్, చంద్రిక యామిజాల రామాయణ బాలరూపకం, రోబో గణేశన్ ప్రదర్శనలు వీక్షకులను అలరించాయి.
    టీవీ సీరియల్స్ దర్శకుడు లింగాల సంజీవరెడ్డి, ‘హీల్’ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు డాక్టర్ కృష్ణబాబు చుండూరి, కూచిపూడి డ్యాన్సర్ కల్యాణి ఆవుల, ఇంజినీర్ సత్యం కళ్యాణ్ దుర్గ్, కథకుడు-పాటకుడు తనికెళ్ల శంకర్, తేజస్విని కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు తేజస్వి సుధాకర్ తదితరులను సత్కరించారు. రాజేష్ శొంఠి తెలుగు విందు భోజన ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు.

    తూపురాని రవి, మియపురం మైత్రేయి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈవెంట్ కోఆర్డినేటర్ దీప్తి సూర్యదేవర, టాంటెక్స్ సంస్థ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ ప్రసాద్ తోటకూర, టాంటెక్స్ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నరసింహారెడ్డి, సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, మూర్తి ములుకుట్ల, చిన్నసత్యం వీర్నాపు, డాక్టర్ పుదూరు జగదీశ్వరన్, లెనిన్ వేముల, దయాకర్ మాడా, కిరణ్మయి గుంట, బసాబత్తిన శ్రీనివాసులు, చంద్రశేఖర రెడ్డి పొట్టిపాటి, యర్రం శరత్ రెడ్డి, మాధవి లోకిరెడ్డి, ఉదయ్ కిరణ్ నిడిగంటి, ప్రవీణ్ బాలిరెడ్డి, సునీల్ సురపురాజు, లక్ష్మి నరసింహ పోపూరి, నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్ రాజేంద్రమాదాల, నాట్స్ అధ్యక్షుడు బాపు నూతి, సిలికానాంధ్ర వ్యవస్థాపకులు ఆనంద్ కూచిభొట్ల, ప్రసాద్ జోస్యుల పాల్గొన్నారు. 2024 బోర్డు ఆఫ్ ట్రస్టీస్ చైర్మన్ సురేష్ మండువ, ఉపాధ్యక్షుడు హరి సింగం అతిథులకు ధన్యవాదాలు తెలిపారు.

    Bernard Hill : ‘టైటానిక్’ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి

    Bernard Hill
    Titanic Actor Bernard Hill

    Bernard Hill : టైటానిక్, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన బ్రిటన్ నటుడు బెర్నార్డ్ హిల్ మృతి  చెందారు.  ఆదివారం తెల్లవారు జామున హిల్ మృతి చెందినట్లు ఆయన ఏజెంట్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆస్కార్  అవార్డు గెలుచుకున్న టైటానిక్ సినిమాలో బెర్నార్డ్ నౌక కెప్టెన్ గా నటించారు. ఇక లార్డ్ ఆఫ్ ది రింగ్స్ సినిమాలో రోహన్ రాజు థియోడెన్ గా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. లార్డ్ ఆఫ్ ది రింగ్స్కు పీటర్ జాక్సన్ దర్శకత్వం వహించారు.

    హిల్ కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో బీబీసీలో ప్రసారమైన బాయ్స్ ఫ్రం బ్లాక్స్ స్టఫ్ ఆయనకు గొప్ప గుర్తింపుతో పాటు అనేక అవార్డులు తెచ్చిపెట్టింది. నాటి తరానికి చెందిన క్లాసికల్ మూవీగా నిలిచింది. తాజాగా ఆయన మోర్గన్ ఫ్రీమెన్ తో కలిసి బీబీసీలో మరో టెలివిజన్ సిరీస్ లో నటించారు. స్థానిక కాలమానం ప్రకారం తొలి ఎపిసోడ్ ఆదివారం ప్రసారమైంది.

    Postal Ballot : ఏపీ లో పరేషాన్ చేస్తున్న పోస్టల్ బ్యాలెట్

    Postal Ballot
    Postal Ballot

    Postal Ballot : ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 13న ఎన్నికల నిర్వహణకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు పకడ్బందీగా చేయబోతోంది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు రాష్ట్రంలోని  ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్టుమెంట్ సంయుక్తంగా ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి 13న ఎన్నికల విధుల్లో పాల్గొంటారు. కాబట్టి ఆరోజు ఉద్యోగులు, పోలీసులు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ పోస్టల్ బ్యాలెట్ పద్దతి ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకునే విదంగా ఏర్పాట్లు చేసింది. ఆదివారం ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్ శాఖల వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటింగ్ లో పాల్గొని ఓటు వేశారు.. పోస్టల్ బ్యాలెట్ పద్దతిలో సుమారుగా ఐదు లక్షల మందికి పైగా పోలింగ్ లో పాల్గొని ఓటు వేశారు.

    రాష్ట్రం విభజన జరిగిన తరువాత అధికారం చేపట్టిన చంద్రబాబు ఉద్యోగులను పట్టించుకోలేదని, క్రమశిక్షణ పేరుతో కఠినంగా వ్యవహ రించారనే పేరు ఉంది. వేతనాల విషయంలో కూడా ఇబ్బంది పెట్టిన విషయాన్నీ నేటికీ మరచిపోలేదు. తిరిగి మరోసారి ఆయనే అధికారం చేపడితే తిప్పలు తప్పవనే భావం ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో ఉంది. అందుకని ఆదివారం నాటి పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ లో అత్యధికంగా వైసీపీ పార్టీ కే ఓట్లు వేసినట్టుగా అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకనే టీడీపీ కి ఓటు వేయడం ఇష్టం లేదని కూడా బాహాటంగానే ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాల్లో కొందరు చర్చించుకుంటున్నారు.

    జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే ఉద్యోగులకు గ్యారెంటెడ్ ఫెన్సన్ స్కీమ్ అమలు చేసారు. ఆ స్కీమ్ లాభసాటిగా ఉండటంతో వైసీపీ వైపే మొగ్గుచూపినట్టు తెలుస్తోంది. వైసీపీ అభ్యర్థులు కూడా పోస్టల్ బ్యాలెట్ పై ధీమాలో ఉన్నారు. జనసేన,బీజేపీ,టీడీపీ పార్టీలు కలిసి ప్రకటించిన మేనిఫెస్టో ఉద్యోగులకు ఏ మాత్రం ఉపయోగంగా లేదని బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. ఉద్యోగ,ఉపాధ్యాయ వర్గాలను సంతృప్తి పరిచేవిదంగా లేదంటూ ఆ వర్గాలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నాయి. కూటమి ప్రచారం చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల కోసం రాష్ట్ర బడ్జెట్ మొత్తం కేటాయించినా నిధులు సరిపోవని ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు.

    ATA Sayyandi Padam : ఉల్లాసంగా ఉత్సాహంగా ఆటా ‘సయ్యంది పాదం’

    ATA Sayyandi Padam
    ATA Sayyandi Padam

    ATA Sayyandi Padam :  వచ్చే నెల (జూన్) 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు అట్లాంటా అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో 18వ తెలుగు మహాసభలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగానే అమెరికా వ్యాప్తంగా ‘సయ్యంది పాదం’ పేరుతో డ్యాన్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రథమ, ద్వితీయ స్థానం నుంచి గెలుపొందిన ప్రవాస చిన్నారులు, యువతీ, యువకులకు ఆటా సభల  వేదికపై ఫైనల్స్ లో తలపడేందుకు అవకాశం కల్పిస్తామని అధ్యక్షురాలు బొమ్మకంటి మధు, కన్వీనర్ పాశం కిరణ్‌ తెలిపారు.
    లాస్ ఏంజలీస్, రాలీ, నాష్ విల్, అట్లాంటా, న్యూ జెర్సీ, డల్లాస్, ఆస్టిన్, ఫిలడెల్ఫియా, షార్లెట్, వాషింగ్టన్ డీసీ, చికాగో, తదితర నగరాల్లో పూర్తయిన ఈ పోటీలు మరిన్ని నగరాల్లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 7 నుంచి 13 సంవత్సరాల వారు జూనియర్ విభాగంలో, 14 సంవత్సరాలు ఆపై వారు సీనియర్ విభాగంలో క్లాసికల్, నాన్ క్లాసికల్, సోలో, గ్రూప్ వంటి పోటీల్లో సత్తా చాటుతున్నారు.

    ‘సయ్యంది పాదం’ ఛైర్ పర్సన్ శృతి చిట్టూరి, కోర్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీధర్ తిరుపతి, డైరెక్టర్ అనిల్ బొద్దిరెడ్డి, నేషనల్ కోఆర్డినేటర్ సాయి సూదిని, కో కోఆర్డినేటర్ ప్రశీల్ గూకంటి, కో కన్వీనర్ ప్రశాంతి ఆసిరెడ్డి, కో డైరెక్టర్ శ్రీనివాస్ శ్రీరామ, అడ్వయిజర్ రాజు కాకర్ల, కో చైర్ పర్సన్ వాణి గడ్డం, మెంబర్లు రజనీకాంత్ దాడి, గౌరీ కారుమంచి, చిట్టి అడబాల, అట్లాంటా నుంచి సందీప్ రెడ్డి, కిషన్ దేవునూరి, నీలిమ గడ్డమణుగు, ఉదయ ఈటూరి, మాధవి దాస్యం, జయచంద్రా రెడ్డి, శ్రావణి రాచకుళ్ల, నిరంజన్ పొద్దుటూరి, రాలీ నుంచి శృతి ఛామల, గణేష్ కాసం, రాధా కంచర్ల, అజిత చీకటి, కీర్తి ఎర్రబెల్లి, పవిత్ర రత్నావత్, శ్రీదేవి కటిక, రజని త్రిపురారి, షాలిని కల్వకుంట్ల, కిశోర్ గూడూరు, నరేంద్ర నూకల, సుశీల్ చండ, నాష్ విల్ నుంచి రామకృష్ణా రెడ్డి అల, క్రిష్ నూకల, లావణ్య నూకల, సాయిరామ్ రాచకొండ, బిందు మాధవి చండ, క్రాంతి ఏళ్ల, సునీత నూకల, షార్లెట్ నుంచి వెంకట రంగారెడ్డి సబ్బసాని తదితరులు పోటీల నిర్వహణకు సహకరించారు.

    PM Modi-Jagan : ఏపీ లో ప్రధాని జగన్ ను టార్గెట్ చేసేనా?

    PM Modi-Jagan
    PM Modi-Jagan

    PM Modi-Jagan : తెలుగు దేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ లు కూటమిగా ఏర్పడ్డాయి. కూటమి లక్ష్యం కేవలం జగన్ ను ఇంటిదారి పట్టించడమే. కూటమి తో పాటు కాంగ్రెస్ పార్టీ ని  అసెంబ్లీ లో అడుగుపెట్టకుండా ఉండటానికి ఒంటరి పోరాటం చేస్తున్నాడు. కానీ గత ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్ ను రెండోసారి అధికారంలోకి రానివ్వకుండా ఉండాలంటే పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్, చంద్రబాబు నాయుడి అనుభవం సరిపోవడంలేదు. ఈ నేపథ్యంలో ఓటర్లను ఆకట్టుకోడానికి సాక్షాత్తు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నే బాబు, పవన్ కళ్యాణ్ లి రంగం లోకి దింపారు. కానీ జగన్ ను టార్గెట్ చేస్తూ మోదీ ప్రసంగించే అవకాశాలు ఉన్నాయా అనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి. సోమవారం ఆంధ్ర ప్రదేశ్ లో మోదీ పర్యటన ఖరారు అయ్యింది. అనకాపల్లి, రాజుల పాలెం  బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. మోదీ వెంట చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కూడా ఉంటారు.

    మోదీ తన ప్రసంగంలో విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి నోరు మెదిపే అవకాశాలపై జనం ఆసక్తితో ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయబోమని సభ సాక్షిగా స్పష్టమైన హామీ ఇచ్చే ఆలోచన గురించి రాష్ట్రంలోని బీజేపీ పెద్దలు కూడా మౌనంగానే ఉన్నారు. ఇదే సభలో బీజేపీ తో వైసీపీ కి ఎలాంటి మిత్రబంధం లేదని చెప్పగలరా అని కూడ రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైనది. ఇటీవల చిలకలూరి పేటలో వైసీపీ పార్టీ గురించి కానీ, ఆ పార్టీ అధినేత జగన్ మోహన్ రెడ్డి గురించి కానీ పల్లెత్తు మాట అనలేదు. ఇప్పడు కూడా అదే బాటలో నడుస్తారా, లేదంటే సిద్ధంగా ఉన్న వైసీపీ తో యుద్ధం చేస్తామని ప్రకటిస్తారా అని కూడా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.అనకాపల్లి బహిరంగ సభ కూటమికి అనుకూలమా,  లేదంటే వైసీపీ కి అనుకూలంగా మోదీ సభను సద్వినియోగం చేనున్నారా అనే అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి.

    మోదీ తెలంగాణ లో కేసీఆర్,  రేవంత్ రెడ్డి లపై  దూకుడుగానే ప్రవర్తిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ తోపాటు కేసీఆర్ ను లక్ష్యముగా చేసుకొని ప్రచారం చేస్తున్నారు బీజేపీ పెద్దలు. ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అదే పద్దతిని అవలంబిస్తారా లేదా చూడాల్సిందే.

    ASI Murder : ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య

    ASI Murder
    ASI Murder

    ASI Murder : ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ఓ ఏఎస్సైని ట్రాక్టర్ తో తొక్కించి హత్య చేశారు. ఈ ఘటన బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ లోని షాదోల్ జిల్లా బదోలి గ్రామంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన ప్రకారం..

    ఏఎస్సై మహేంద్ర బాగ్రి ఒకరిని అరెస్టు చేసేందుకు ఇద్దరు సహోద్యోగులతో కలిసి వెళుతుండగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఒక ట్రాక్టర్ వారికి ఎదురైంది. ట్రాక్టర్ ను ఆపాలని డ్రైవర్ రాజ్ రావత్ కు సూచించినా వినకుండా ట్రాక్టర్ ను ఏఎస్సై మీదుగా పోనిచ్చాడు. దీంతో ఏఎస్సై బాగ్రి అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ట్రాక్టర్ డ్రైవర్ అక్కడి నుంచి పారిపోయాడు.

    Jagan Viral Video : సార్..సార్..ఏంటి సార్ ఇది..ఎక్కడ పట్టుకొస్తారండి ఇలాంటి ఆర్టిస్టులని..

    Jagan Viral Video
    Jagan Viral Video

    Jagan Viral Video : ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడికి లేని హావాభావాలు మన జగన్ రెడ్డి సొంతం. గతంలో ఓదార్పు యాత్రలో ప్రారంభమైన ఆయన కౌగిలింతలు, ముద్దులు, ఓదార్పులు, దీవెనలు..ఇంకా 2024 ఎన్నికల నాటికి కూడా పూర్తి కాలేదు. అసలు జగన్ మాటతీరు, ప్రవర్తించే తీరు ఏ నాయకుడికి లేదంటే నమ్మండి. చెప్పిన విషయాన్నే మళ్లీ మళ్లీ చెప్పడం ఆయనకే సొంతం. ఒకరి వ్యక్తిగత జీవితాన్ని పదే పదే వల్లె వేయడం ఆయనకే చెల్లు.. ఆడవారంటే గౌరవం లేకుండా మాట్లాడడం  ఆయనకే దక్కింది. ఇలా డిఫరెంట్ మాటతీరు, హావాభావాలు, ప్రవర్తనలో అగ్రస్థానంలో ఉంటారు సీఎం జగన్ రెడ్డి..

    జగన్ జనాల్లోకి వెళ్తున్నారంటే చాలు పెయిడ్ ఆర్టిస్టులను సిద్ధం చేస్తుంటారు. ఆయన వెళ్లడమే తరువాయి మహిళలు వచ్చి జగన్ కు కష్టాలు చెప్పుకున్నట్టు లేదంటే తమ కష్టాలను జగన్ రెడ్డే తీర్చినట్టు చెప్తూ జగన్ రెడ్డిని గట్టిగా కౌగిలించుకోవడం కాదు కొందరు వాటేసుకుని ముద్దు పెట్టుకుంటారు. ఇవన్నీ స్క్రిప్టెడ్ అని అంటుంటాయి ప్రతిపక్షాలు. స్క్రిప్ట్ అయినా రియల్ అయినా ఏంటండి ఈ బహిరంగంగా కౌగిలింతలు, ముద్దులు అంటారు మహిళోద్ధారకులు.

    తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది. సభలో ఓ మహిళ హఠాత్తుగా వచ్చి జగన్ రెడ్డిని గట్టిగా కౌగిలించుకోవడం, ఆమె నుదిటిని జగన్ రెడ్డి నిమరడం చూస్తే.. ఏంట్రా బాబూ ఎక్కడ నుంచి పట్టుకొస్తారా ఇలాంటి ఆర్టిస్టులని..అని అందరూ అనుకోవడం ఖాయం. ఇంకా కామెడీ ఏంటంటే ఈ వీడియోకు ఓ సినిమాలో రాజకీయ నాయకుడి పాత్రలో బ్రహ్మనందం ఓ ఘటన దగ్గరకు వెళ్తే అక్కడ ఓ మహిళ గట్టిగా అరుచుకుంటూ బ్రహ్మిని గట్టిగా వాటేసుంటు ఉంటుంది. ఆ సీన్ ను మనం తెగ ఎంజాయ్ చేస్తాం. ఇక ఈ వీడియోను జగన్ రెడ్డి వీడియోకు జత చేశారు. ఇక నవ్వులే నవ్వులు.

    Prabhas Kalki : ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’పై రాణా సంచలన కామెంట్.. వరల్డ్ వైడ్ గా ఏమవుతుందంటే?

    Prabhas Kalki : పురాణాలు, సైన్స్ ఫిక్షన్ అంశాలను మేళవించి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కల్కి 2898 ఏడీ’ ఇండియన్ సినిమాలో ఘనవిజయం సాధిస్తుంది. ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ప్రేక్షకులకు ఓ ఎపిక్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందిస్తుంది. రిలీజ్ కు చాలా వాయిదాల తర్వాత ఫైనల్ డేట్ జూన్ 27న ప్రకటించారు మేకర్స్.

    తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో ప్రభాస్ సన్నిహితుడైన హీరో రానా దగ్గుబాటి ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. నాగ్ అశ్విన్ తో తన చిరకాల స్నేహాన్ని బయటపెట్టిన దగ్గుబాటి ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందడం తనకు ఎగ్జయిటింగ్ ఉందని చెప్పారు. రానా దగ్గుబాటి మాట్లాడుతూ ‘నెక్ట్స్ బిగ్ మూమెంట్ కల్కి. భారతదేశం, భారతీయ, ప్రవాస భారతీయులే కాదు, ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ కల్కికి కనెక్ట్ అవుతారు.

    ఈ చిత్రాన్ని భారతీయ చలన చిత్ర పరిశ్రమ నుంచి వచ్చిన అద్భుతమైన ‘అవెంజర్స్ మూమెంట్’తో పోల్చాడు రానా. ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకులను ఆకర్షిస్తుందని ఆయన అన్నారు. అభిమానుల్లో ఆసక్తిని పెంచేందుకు కామిక్-కాన్ ఈవెంట్లలో మూవీ గురించి ప్రస్తావిస్తూ, ముఖ్యంగా కామిక్-కాన్ పాప్ సంస్కృతి, సూపర్ హీరో ఎంటర్‌టైన్‌మెంట్ కంటెంట్ తో ఎలా సంబంధం కలిగి ఉందో తెలుస్తుంది.

    ‘కల్కి 2898 ఏడీ’లో తనకు ఎలాంటి పాత్ర లేదని రానా స్పష్టం చేశారు. అయితే ప్రమోషనల్ ఈవెంట్స్ లో ఆయన కనిపించడం ప్రేక్షకులను మరింత ఎగ్జయిటింగ్ కు తీసుకెళ్తుంది.

    గురుగ్రామ్ లో జరిగిన ఓ కార్యక్రమంలో దర్శకుడు నాగ్ అశ్విన్ తో కలిసి రానా పాల్గొన్నారు. అక్కడ ఈ సినిమా గురించి మాట్లాడారు. మహాభారతం యుగం నుంచి మొదలై క్రీ.శ.2898లో ముగిసే ఈ చిత్రం 6000 సంవత్సరాల నిడివితో ఉంటుందని అశ్విన్ తెలిపారు.

    ‘కల్కి 2898 ఏడీ’లో దీపికా పదుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా, బిగ్ బీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నటి దిశా పటానీ కూడా ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపిస్తుంది.