33.2 C
India
Sunday, May 19, 2024
More
    Home Blog Page 1550

    అమెరికా వీసా మరింత ఆలస్యం

    us-visa-is-more-delayed
    us-visa-is-more-delayed
    us-visa-is-more-delayed
    us-visa-is-more-delayed

    అమెరికా వెళ్లాలని అనుకుంటున్న వాళ్లకు తీవ్ర శరాఘాతం అనే చెప్పాలి ఈ వార్త ఎందుకంటే …….. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వాళ్లకు ఇప్పట్లో వీసా వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అమెరికా వీసా కోసం ప్రయత్నించే వాళ్ళు 500 రోజులకు పైబడి ఎదురు చూడాల్సి వస్తోంది. ఢిల్లీ లోను అలాగే ముంబై లోను 500 రోజులకు పైగా సమయం పడుతుందని వెల్లడిస్తున్నారు వీసా అధికారులు.

    కరోనా ఉదృతి తగ్గిన తర్వాత పర్యాటకుల సంఖ్య గణనీయంగా పెరిగిందని , అలాగే ఉన్నత చదువుల నిమిత్తం అమెరికాకు వెళ్లే వాళ్ళ సంఖ్య పెద్ద ఎత్తున పెరిగింది. దాంతో ఈ తాకిడి ఎక్కువ అయినట్లు చెబుతున్నారు అధికారులు. క్రిస్మస్ వేడుకలకు వెళ్లాలని ఇప్పుడు వీసా కోసం ప్రయత్నం చేస్తే బహుశా వచ్చే ఏడాది మాత్రమే క్రిస్మస్ వేడుకలకు వెళ్లే ఛాన్స్ ఉందని , ఈ ఏడాది వీసాలు మంజూరు కావడం కష్టమే అని తేల్చి చెబుతున్నారు. ఒక్క అమెరికాలోనే వీసాల సమస్య తలెత్తడం లేదు . కెనడా , యూకే లాంటి దేశాల్లో కూడా వీసాల సమస్య ఉందని అంటున్నారు. 

    నారాయణ కాలేజ్ లో దారుణం

    రామంతాపూర్  నారాయణ కాలేజ్ లో దారుణం చోటు చేసుకుంది. నారాయణ స్వామి అనే ఇంటర్ విద్యార్థి 16 వేలు ఫీజు బకాయి పడ్డాడు. అతడు ఇంటర్ పూర్తి చేసుకొని ఇంజినీరింగ్ చేయడానికి నారాయణ కాలేజ్ నుండి టీసీ ఇవ్వమని కోరాడు నారాయణ స్వామి అనే స్టూడెంట్. అయితే తన వెంట తండ్రి తో పాటుగా స్టూడెంట్ ఆర్గనైజేషన్  లీడర్స్ కూడా వచ్చారు.

    అయితే 16 వేలు బకాయి పడినప్పటికీ మేము పరీక్ష రాసేలా చూశామని , ఇక టీసీ ఇవ్వాలంటే మాత్రం బకాయి ఉన్న డబ్బులు కడితేనే ఇస్తామని స్పష్టం చేసాడట. దాంతో కొంత వాగ్వాదం చోటు చేసుకుంది. గొడవ ఎక్కువ కావడంతో స్టూడెంట్ లీడర్ సందీప్ పెట్రోల్ తీసుకొని పోయడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దాంతో సందీప్ తో పాటుగా కాలేజ్ ప్రిన్సిపాల్ సుధాకర్ రెడ్డి , ఏవో అశోక్ రెడ్డి లకు గాయాలయ్యాయి. అలాగే అక్కడే ఉన్న మరికొంతమందికి కూడా గాయాలు అయ్యాయి. గాయాలైన వాళ్ళని వెంటనే ఆసుపత్రికి తరలించారు.

    RAMYA KRISHNA- MAHESH BABU:మహేష్ బాబుకు అత్తగా రమ్యకృష్ణ

    ramya-krishna-mahesh-babu-ramya-krishna-is-the-aunt-of-mahesh-babu
    ramya-krishna-mahesh-babu-ramya-krishna-is-the-aunt-of-mahesh-babu

    ramya-krishna-mahesh-babu-ramya-krishna-is-the-aunt-of-mahesh-babu
    ramya-krishna-mahesh-babu-ramya-krishna-is-the-aunt-of-mahesh-babu

    సూపర్ స్టార్ మహేష్ బాబు తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. మహేష్ బాబు పై యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు దర్శకులు త్రివిక్రమ్. ఈ చిత్రంలో హీరోయిన్ గా బుట్టబొమ్మ పూజా హెగ్డే నటిస్తోంది.

    ఇక ఈ చిత్రంలో కీలక పాత్రలో హాట్ భామ రమ్యకృష్ణ నటించనున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ రమ్యకృష్ణ పోషించనున్న పాత్ర ఏంటో తెలుసా ……. మహేష్ బాబుకు అత్త పాత్రలో. అవును సీనియర్ హీరోయిన్ లను తన చిత్రాల్లో కీలక పాత్రల్లో నటింపజేయడం త్రివిక్రమ్ కున్న అలవాటు. ఇప్పటి వరకు టబు , నదియా , కుష్భు , పవిత్రా లోకేష్ ఇలా తదితరులను అమ్మ, అత్త పాత్రలోకి తీసుకున్నాడు.

    ఇక అదే కోవలో తాజాగా సీనియర్ భామ రమ్యకృష్ణ ను మహేష్ బాబుకు అత్తగా తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఒకే స్క్రీన్ పై మహేష్ బాబు – రమ్యకృష్ణ లు కనిపిస్తే ఆ మజానే వేరు. పైగా అత్తా – అల్లుడు పాత్రల్లో అంటే మరింత రంజుగా ఉండటం ఖాయం. మహేష్ బాబు – త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో అతడు , ఖలేజా వంటి చిత్రాల తర్వాత వస్తున్న చిత్రం అవడంతో ఈ సినిమా తప్పకుండా భారీ హిట్ కొట్టాలనే కసితో ఉన్నారు. 

    VIJAY DEVARAKONDA- LIGER- PUNEET RAJKUMAR:పునీత్ రాజ్ కుమార్ కు రౌడీ హీరో నివాళి

    vijay-devarakonda-tribute-to-puneet-rajkumar
    vijay-devarakonda-tribute-to-puneet-rajkumar
    vijay-devarakonda-tribute-to-puneet-rajkumar
    vijay-devarakonda-tribute-to-puneet-rajkumar

    దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు బెంగుళూర్ వెళ్ళాడు విజయ్ దేవరకొండ. తన వెంట హీరోయిన్ అనన్య పాండే , దర్శకులు పూరీ జగన్నాథ్ , ఛార్మి తదితరులు ఉన్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది.

    ఆ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ప్రచారం కోసం బెంగుళూర్ వెళ్లారు. దాంతో పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకున్నాడు విజయ్ దేవరకొండ. కన్నడ నాట తిరుగులేని స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సమయంలో విజయ్ దేవరకొండ వెళ్ళలేదు. దాంతో ఇప్పుడు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించాడు విజయ్ దేవరకొండ.

    లైగర్ చిత్రంపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పూరీ జగన్నాథ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో చాలా టెన్షన్ గా ఉన్నాడు పూరీ. సినిమా తేడా కొడితే చాలా నష్టపోతాడు. అందుకే టెన్షన్ పడుతున్నాడట. థియేటర్ లలో భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓటీటీ కి భారీ ఆఫర్ వచ్చినప్పటికీ విడుదల చేయలేదని అంటున్నాడు పూరీ. మరి అతడి నమ్మకం ఏమౌతుందో ఈనెల 25 న తేలనుంది. 

    కాలిఫోర్నియాలో ఢీకొన్న విమానాలు

    planes-crash-in-california
    planes-crash-in-california
    planes-crash-in-california
    planes-crash-in-california

    అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. దాంతో పలువురు ప్రయాణీకులు మరణించారు. అయితే మరణించిన వారి సంఖ్య ఇంకా తెలియరాలేదు. ఈ సంచలన సంఘటన ఈరోజు కాలిఫోర్నియాలో జరిగింది. వాట్సాన్ విల్లే లోని మున్సిపల్ విమానాశ్రయంలో రెండు చిన్న విమానాలు ల్యాండ్ అయ్యేందుకు ప్రయత్నించాయి.

    అయితే రెండు కూడా ల్యాండ్ అయ్యే సమయంలోనే ఢీకొన్నాయి. దాంతో రెండు విమానాలు కూడా బలంగా ఢీకొనడంతో భారీగా దెబ్బతిన్నాయి. మంటలు కూడా వ్యాపించాయి. దాంతో పలువురు ప్రయాణీకులు మరణించారు. అయితే మరణించిన వారు ఎవరు ? ఎంతమంది మరణించారు ? అన్నది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

    BIMBISARA- NANDAMURI KALYAN RAM:70 కోట్ల క్లబ్ లో కళ్యాణ్ రామ్ బింబిసార

    bimbisara-nandamuri-kalyan-ram-kalyan-ram-bimbisara-in-70-crore-club
    bimbisara-nandamuri-kalyan-ram-kalyan-ram-bimbisara-in-70-crore-club
    bimbisara-nandamuri-kalyan-ram-kalyan-ram-bimbisara-in-70-crore-club
    bimbisara-nandamuri-kalyan-ram-kalyan-ram-bimbisara-in-70-crore-club

    నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసార 70 కోట్ల క్లబ్ లో చేరింది. ఆగస్టు 5 న విడుదలైన ఈ చిత్రం ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏమాత్రం అంచనాలు లేకుండా ఆగస్టు 5 న విడుదలైంది. జూన్ , జూలై రెండు నెలల పాటు టాలీవుడ్ లో వచ్చిన పలు చిత్రాలు ఘోర పరాజయం పొందాయి. దాంతో టాలీవుడ్ చతికిలబడింది.

    సరిగ్గా అలాంటి సమయంలోనే విడుదలైన బింబిసార టాలీవుడ్ కు ఊపిరిలూదింది. కేవలం ఈ సినిమాని 16 కోట్లకు మాత్రమే అమ్మారు. ఈ సినిమాని కొన్న బయ్యర్లకు ఇప్పటికే 35 కోట్ల లాభం వచ్చింది, అంటే పెట్టిన డబ్బులకు డబుల్ కంటే ఎక్కువగా వచ్చాయి. దాంతో ఇంత భారీ లాభాలు చవిచూసిన సినిమా గతకొంత కాలంగా ఏది లేదంటే నమ్మండి. బింబిసార భారీ లాభాలను తెచ్చి పెట్టడంతో బయ్యర్లు చాలా సంతోషంగా ఉన్నారు.

    ప్రపంచ వ్యాప్తంగా 70 కోట్ల గ్రాస్ ని 35 కోట్లకు పైగా షేర్ ని కలెక్ట్ చేసింది బింబిసార. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో దర్శకుడు వశిష్ఠకు పెద్ద ఎత్తున అవకాశాలు వచ్చి పడుతున్నాయి. ఏకంగా నటసింహం నందమూరి బాలకృష్ణ తో సినిమా చేసే ఛాన్స్ లభించింది వశిష్ఠకు. బాక్సాఫీస్ దగ్గర మరిన్ని వసూళ్లు సాధించేలా కనబడుతోంది. లాంగ్ రన్ లో మరో 10 కోట్ల కు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టే ఛాన్స్ ఉన్నట్లు కనబడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

    DONALD TRUMP:భారత్ లో డోనాల్డ్ ట్రంప్ టూర్ కు ఖర్చు ఎంతయ్యిందో తెలుసా ?

    do-you-know-the-cost-of-donald-trumps-tour-in-india
    do-you-know-the-cost-of-donald-trumps-tour-in-india
    do-you-know-the-cost-of-donald-trumps-tour-in-india
    do-you-know-the-cost-of-donald-trumps-tour-in-india

    2020 ఫిబ్రవరిలో అప్పటి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారత్ పర్యటించిన విషయం తెలిసిందే. భారత్ లో తన భార్య మెలానియా , కూతురు ఇవాంక ట్రంప్ , అల్లుడు కుశ్నర్ లతో పాటుగా అమెరికా ఉన్నతాధికారులతో కలిసి ట్రంప్ పర్యటించారు. కాగా ఆ పర్యటనకు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పాలని కోరుతూ ఓ వ్యక్తి ఆర్టీఐ ని కోరగా దానికి ఎలాంటి సమాధానం లభించలేదు.

    దాంతో ఆర్టీఐ కమీషన్ ని సంప్రదించగా ఎట్టకేలకు ట్రంప్ పర్యటనకు అయిన ఖర్చు తెలిపారు. ఇంతకీ ట్రంప్ పర్యటనకు భారత్ వెచ్చించిన ఖర్చు ఎంతో తెలుసా ……. 38 లక్షలు. భోజనానికి , ఇతర సౌకర్యాలకు , విడిదికి అలాగే ట్రాన్స్ పోర్ట్ కు మొత్తంగా 38 లక్షలు ఖర్చు చేసిందట కేంద్ర ప్రభుత్వం. 

    PRABHAS: భయపడుతున్న ప్రభాస్ నిర్మాత

    prabhas-producer-prabhas-who-is-scared
    prabhas-producer-prabhas-who-is-scared
    prabhas-producer-prabhas-who-is-scared
    prabhas-producer-prabhas-who-is-scared

    అగ్ర నిర్మాత డివివి దానయ్య ప్రభాస్ తో ఓ సినిమా చేయాలని అనుకున్నాడు. అయితే ఆ దర్శకుడు సరిగ్గా తీయగలడా ? అనే భయం పట్టుకుందట. దాంతో ప్రభాస్ నిర్మాత చాలా భయపడుతున్నాడట. అంతేకాదు నాకు ఈ సినిమా ఏమి వద్దు …… ఎవరైనా ముందుకు వస్తే వాళ్లకు ఆ ప్రాజెక్ట్ అప్పగిస్తానని చూస్తున్నాడట.

    ఆర్ ఆర్ ఆర్ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ని నిర్మించాడు డివివి దానయ్య. ఆ సినిమా ఇచ్చిన జోష్ తో ప్రభాస్ తో సినిమా చేయాలని అనుకున్నాడు. అంతేకాదు 50 కోట్ల అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఇక ప్రభాస్ తో చేసే సినిమాకు మారుతి దర్శకుడు అని అనుకున్నాడట. ఓ హర్రర్ కథ చెబితే తక్కువ రోజుల్లోనే అయిపోతుంది కదా ! అని ఒప్పుకున్నాడట. అయితే మారుతి దర్శకత్వంలో వచ్చిన ” పక్కా కమర్షియల్ ” డిజాస్టర్ అయ్యింది. దాంతో దానయ్య పునరాలోచనలో పడ్డాడట.

    అసలే ప్రభాస్ నటించిన కొన్ని చిత్రాలు ఇటీవల ఘోర పరాజయం పొందాయి. అయినా మంచి మార్కెట్ ఉంది కాబట్టి ధైర్యం చేయచ్చు అనుకుంటే మారుతి ట్రాక్ రికార్డ్ ఏమి బాగోలేకపోవడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని చూస్తున్నాడట. ఎవరైనా నిర్మాత ముందుకు వస్తే ఈ ప్రాజెక్ట్ ని వాళ్లకు అప్పగించి నా డబ్బులు నేను తీసుకుంటాను అని చూస్తున్నాడట. మరి ఏమౌతుందో ……. ఏంటో పాపం.

    శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఆ కష్టాలకు చెక్

    check-for-those-difficulties-at-shamshabad-airport
    check-for-those-difficulties-at-shamshabad-airport
    check-for-those-difficulties-at-shamshabad-airport
    check-for-those-difficulties-at-shamshabad-airport

    శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఈరోజు నుండి పలు కష్టాలకు తెర పడనుంది. ఇంతకీ ఈరోజు నుండి ప్రారంభం కాబోయే వెసులుబాటు ఏంటో తెలుసా …… డిజి యాత్ర యాప్ . సాధారణంగా విమానాల్లో ప్రయాణించే ప్రయాణీకులకు రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. టికెటింగ్ దగ్గర , లగేజీ దగ్గర , డాక్యుమెంట్స్ అన్నీ పరిశీలించడానికి ప్రయాణీకులు ఎక్కువ సేపు క్యూలో నిల్చోవాల్సి వస్తోంది. దాంతో ఇలా క్యూలో ఎక్కువ సేపు నిలబడే అవకాశం లేకుండా డీజీయాప్ ని అందుబాటులోకి తెచ్చింది.

    డీజీ యాప్ ని డౌన్ లోడ్ చేసుకున్న వాళ్ళు నేరుగా నిర్మినల్ కు వెళ్లి ఫేస్ రికగ్నిషన్ చేసుకొని హాయిగా విమానంలోకి వెళ్లొచ్చు. డీజీ యాప్ డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల అందులో సంబంధింత వ్యక్తి ఆధార్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ తో అనుసంధానం చేయడం ద్వారా డీజీ యాప్ ప్రయాణీకులకు మెరుగైన సౌలభ్యం అందించనుంది. ఈ డీజీ యాప్ ఇన్నాళ్లు ఢిల్లీ , బెంగుళూర్ , ముంబై లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఇక ఈరోజు నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కూడా అందుబాటులోకి రానుంది.

    KARTHIKEYA 2 – NIKHIL :బాలీవుడ్ లో దుమ్మురేపుతున్న కార్తికేయ 2

    karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood
    karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood
    karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood
    karthikeya-2-nikhil-karthikeya-2-is-making-dust-in-bollywood

    నిఖిల్ హీరోగా నటించిన కార్తికేయ 2 బాలీవుడ్ లో దుమ్ము రేపుతోంది. హిందీలో కేవలం ఈ చిత్రాన్ని మొదట 50 స్క్రీన్ లలో మాత్రమే విడుదల చేసారు. ఆ తర్వాత స్పందన బాగుండటంతో మెల్లిగా 100 స్క్రీన్ లకు పెంచారు. ఆ తర్వాత 300 స్క్రీన్ లు ఇక ఇప్పుడేమో ఏకంగా 1000 కి పైగా స్క్రీన్ లలో రన్ అవుతోంది కార్తికేయ 2.

    దాంతో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కేవలం 50 స్క్రీన్ లలో సరదాగా వేద్దామని అనుకున్న అల్లు అరవింద్ కు ఈ సినిమా భారీ ఎత్తున లాభాలు తెచ్చిపెడుతోంది. గతకొంత కాలంగా తెలుగు సినిమా యావత్ భారత్ సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేస్తోంది. ఆ కోవలోనే ఇప్పుడు కార్తికేయ 2 కూడా సంచలనం సృష్టిస్తోంది.

    చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన కార్తికేయ 2 తెలుగులోనే కాకుండా విడుదలైన అన్ని భాషల్లో భారీ వసూళ్ళని సాధిస్తోంది. అమీర్ ఖాన్ , అక్షయ్ కుమార్ లాంటి సూపర్ స్టార్ హీరోల సినిమాలను కూడా పక్కన పెట్టి కార్తికేయ 2 కు బ్రహ్మరథం పడుతున్నారు ప్రేక్షకులు. కృష్ణతత్వం గురించి గొప్పగా చెప్పారని ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. నిఖిల్ – అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించగా కీలక పాత్రల్లో అనుపమ్ ఖేర్ , శ్రీనివాస్ రెడ్డి తదితరులు నటించారు.