దివంగత కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కు నివాళులు అర్పించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. ఈరోజు బెంగుళూర్ వెళ్ళాడు విజయ్ దేవరకొండ. తన వెంట హీరోయిన్ అనన్య పాండే , దర్శకులు పూరీ జగన్నాథ్ , ఛార్మి తదితరులు ఉన్నారు. లైగర్ సినిమా పాన్ ఇండియా చిత్రం కావడంతో ఆగస్టు 25 న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అవుతోంది.
ఆ సినిమా విడుదలకు సిద్ధం కావడంతో ప్రచారం కోసం బెంగుళూర్ వెళ్లారు. దాంతో పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకున్నాడు విజయ్ దేవరకొండ. కన్నడ నాట తిరుగులేని స్టార్ గా ఓ వెలుగు వెలిగిన పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. అయితే పునీత్ రాజ్ కుమార్ మరణించిన సమయంలో విజయ్ దేవరకొండ వెళ్ళలేదు. దాంతో ఇప్పుడు వెళ్లి పునీత్ రాజ్ కుమార్ సమాధిని దర్శించుకుని నివాళులు అర్పించాడు విజయ్ దేవరకొండ.
లైగర్ చిత్రంపై విజయ్ దేవరకొండ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. పూరీ జగన్నాథ్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. భారీ బడ్జెట్ చిత్రం కావడంతో చాలా టెన్షన్ గా ఉన్నాడు పూరీ. సినిమా తేడా కొడితే చాలా నష్టపోతాడు. అందుకే టెన్షన్ పడుతున్నాడట. థియేటర్ లలో భారీ విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఓటీటీ కి భారీ ఆఫర్ వచ్చినప్పటికీ విడుదల చేయలేదని అంటున్నాడు పూరీ. మరి అతడి నమ్మకం ఏమౌతుందో ఈనెల 25 న తేలనుంది.
Breaking News