36.8 C
India
Tuesday, April 30, 2024
More

    Family Star : రౌడీ బాయ్ కి ‘ఫ్యామిలీ స్టార్’ గిట్టుబాటైందా?

    Date:

    Family Star
    Family Star

    Family Star : ‘లైగ‌ర్‌’ భారీ డిజాస్టర్ తర్వాత హిట్ కొట్టక తప్పని పరిస్థితిలోకి పడిపోయాడు రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ.  పరశురామ్ తో సినిమా రావడంతో మొదటి నుంచి ఆశలు పెట్టుకున్నాడు. పైగా బ్యానర్ కూడా దిల్ రాజుది. ఇవన్నీ చక్కగా కుదరడంతో ఈ సారి విజ‌య్ హిట్టు కొడ‌తాడ‌ని అనిపించింది.

    అయితే, ‘ఫ్యామిలీ స్టార్’ మాత్రం ఆ న‌మ్మకాన్ని నిలబెట్టుకోలేదు. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడమే కాదు, వ‌సూళ్ల ప‌రంగానూ వెనకే ఉండిపోయిందని టాక్ వినిపిస్తోంది. సినిమా రిలీజ్ కు ముందే డిజిట‌ల్‌, శాటిలైట్ రైట్స్ అమ్మేయ‌డంతో ప్రొడ్యూసర్ దిల్ రాజు ఎంతో కొంత సేఫ్ అయ్యారు. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఈ మూవీ పారితోషిక‌ం మంచి గిట్టుబాటు అయ్యిందని తెలుస్తోంది. ఈ మూవీకి గానూ రూ.25 కోట్ల రెమ్యున‌రేష‌న్ అందుకున్నాడ‌ని టాక్‌. విజ‌య్ కెరీర్‌లో.. అత్యుత్తమ పారితోషికం ఈ సినిమాకే తీసుకున్నాడట.

    ‘లైగ‌ర్’ కు కూడా తీసుకున్నంతలో మంచి పారితోషిక‌మే మాట్లాడుకున్నాడు. కానీ అనుకొన్న మొత్తం ఒక‌టైతే, చివ‌ర్ లో అందింది మ‌రోటి. శాటిలైట్ రైట్స్ రూపంలో వ‌చ్చిందే అంతా అని విజ‌యే అన్నారు. ‘లైగ‌ర్‌’ డిజాస్టర్ కావడంతో విజ‌య్ కూడా తనకు ఇస్తానన్న పారితోషికాన్ని డిమాండ్ చేయ‌లేక‌పోయాడు. ‘ఫ్యామిలీస్టార్‌’ విష‌యంలో విజ‌య్‌కి ఆ అసంతృప్తి అయితే లేదని తెలుస్తోంది.

    కొవిడ్ కాలంలో విజ‌య్ ఈ సినిమాకు సంబంధించి అడ్వాన్స్ తీసుకున్నాడు. ప్రీ బిజినెస్‌పై న‌మ్మకంతో విజ‌య్ అడిగినంత ఇచ్చేశాడు ప్రొడ్యూసర్ దిల్ రాజు. సినిమా రిలీజ్ కు ముందే.. విజ‌య్ పేమెంట్స్ క్లియ‌ర్ అయిపోయాయి. అలా.. సినిమా ఫ్లాప్ అయినా.. త‌న పారితోషికం మాత్రం పూర్తిగా అందడంతో విజ‌య్ ఫుల్ ఖుషీలో ఉన్నాడు.

    Share post:

    More like this
    Related

    Tejasswi Prakash : మాగ్నెటిక్ ఫోజుల్లో బ్యూటిఫుల్ లేడీ తేజస్వీ ప్రకాశ్..

    Tejasswi Prakash : తేజస్వి ప్రకాశ్ వయంగంకర్ తనకంటూ ప్రత్యేక...

    CM Jagan : ఎన్డియే కూటమి మేనిఫెస్టో.. సీఎం జగన్ వ్యాఖ్యలు

    CM Jagan : టీడీపీ,జనసేన మేనిఫెస్టోపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు...

    Indian-2 : ‘ఇండియన్-2’ రిలీజ్ డేట్ ఎప్పుడంటే..?

    Indian-2 : విశ్వనటుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్...

    Alliance Joint Manifesto : నవ్యాంధ్రను లిఖించే ‘కూటమి’ ఉమ్మడి మ్యానిఫెస్టో ఇదే..

    Alliance Joint Manifesto : ఏపీలో ఎన్నికల ప్రచారం ఉధృతంగా సాగుతోంది....

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ బ్రేక్ ఈవెన్ అయ్యాడా?

    Family Star : ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్రొడక్షన్ లో...

    Sandeep Vanga : ప్రభాస్ కంటే విజయ్ కే వంగ అవసరం ఎక్కువ.. 

    Sandeep Vanga : సందీప్ రెడ్డి వంగా ఆలోచనలపై ఎవరికి ఎలాంటి...

    Pushpa 2 Teaser : ‘పుష్ప 2’ కొత్త పోస్టర్, టీజర్ విడుదల

    Pushpa 2 Teaser : స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇటీవల...

    Ramcharan-Vijay : ఈ సారి రామ్ చరణ్ కథను దేవరకొండ ఎగురేసుకుపోయాడు!

    Ramcharan-Vijay Devarakonda : రామ్ చరణ్ సినిమాల ఎంపిక విషయంలో చాలా...